ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ ఐజిఐ విమానాశ్రయంలో రూ.10 లక్షల విలువైన నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లతో పాటు రూ.7.5 లక్షలకు పైగా విలువైన స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ; ఇద్దరి అరెస్టు
Posted On:
14 JAN 2022 9:15PM by PIB Hyderabad
న్యూఢిల్లీ లోని ఐజిఐ విమానాశ్రయం టెర్మినల్-3 కి 12.01.2022న యుఎఇ రాస్ ఎఐ ఖనిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లైట్ నెం. ఎస్ జి753 లో వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుని కస్టమ్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేశారు.
కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణికుని నుంచి రూ. 7,65,089/-( ఏడు లక్షల అరవై ఐదు వేల ఎనభై తొమ్మిది రూపాయలు) విలువైన 175 గ్రాముల బంగారం ఆకృతి లో వెండి పూత పూసిన 24 స్థూపాకార ముక్కలను , పదిలక్షల రూపాయలు విలువైన ఎఫ్ ఐసిఎన్ (నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు) లను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయం అరైవల్ గేట్ వద్ద ఈ ప్రయాణికుడిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మరో భారతీయ జాతీయుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.
175 గ్రాముల బరువున్న వెండి పూత పూసిన స్థూపాకార ఆకారంలో ఉన్న 24 (ఇరవై నాలుగు) ముక్కలు , రూ.10,00,000/- లను ప్రయాణికుడు తన ట్రాలీ బ్యాగుల్లో దాచి పెట్టాడు. వాటిని కస్టమ్స్ చట్టం, 1962 లోని సెక్షన్ 110 కింద 12.01.2022 న స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం, 1962 లోని సెక్షన్ 104 కింద ప్రయాణికుడ్ని , అతని రిసీవర్ ను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది. ఎన్ఐఏకు కూడా సమాచారం ఇచ్చారు. వారు కూడా దర్యాప్తులో చేరారు.
****
(Release ID: 1790272)
Visitor Counter : 124