ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటకం మరియు అభివృద్ధి మంత్రి (డిఓఎన్‌ఈఆర్) శ్రీ జి. కిషన్ రెడ్డి నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో వర్చువల్‌గా పాల్గొన్నారు
పారిశ్రామికవేత్తలు మరియు అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లతో కేంద్ర మంత్రి సంభాషించారు
‘పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ఈశాన్యం’ సందేశాన్ని దేశంతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయాలని వ్యాపార వర్గాలను మంత్రి కోరారు.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి ‘యాక్ట్ ఈస్ట్’ చొరవ ద్వారా ఎన్‌ఈఆర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు - శ్రీ కిషన్ రెడ్డి
Posted On:
08 JAN 2022 4:10PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
- కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవనీయులైన ప్రధాన మంత్రి ‘యాక్ట్ ఈస్ట్’ చొరవ ద్వారా ఈశాన్య ప్రాంత (ఎన్‌ఈఆర్) అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు.
- గత 7 సంవత్సరాలలో దేశంలో కనిపిస్తున్న మరియు వేగవంతమైన అభివృద్ధిని దేశవ్యాప్తంగా మరియు ఇతర ప్రాంతాలకు 'పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ఈశాన్య' సందేశాన్ని తీసుకువెళ్లాలని మంత్రి వ్యాపార వర్గాలను కోరారు.
- భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. బ్రాండ్ ఇండియాను నిర్మించడం ద్వారా భారతదేశ ఆర్థిక పురోగతి ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు గణనీయంగా దోహదపడ్డారని తెలిపారు.
ఈశాన్య ప్రాంత సంస్కృతి, పర్యాటకం మరియు అభివృద్ధి మంత్రి (డిఓఎన్‌ఈఆర్) శ్రీ జి. కిషన్ రెడ్డి నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌కు వర్చువల్‌గా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవస్థాపకులు మరియు సంభావ్య స్టార్టప్‌లతో ఈ సందర్భంగా సంభాషించారు. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అనేది డోనర్ డైలాగ్స్‌లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమం. అలాగే ఈశాన్య ప్రాంతంలోని యువత మరియు వ్యాపారవేత్తలు వంటి వివిధ వాటాదారులతో పరస్పర చర్చ జరిగే కార్యక్రమాల సమూహం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సరిగ్గానే చెప్పారు, ఈశాన్య ప్రాంతం వేగంగా 'జాతీయ వృద్ధికి గేట్‌వే'గా మారుతోంది. 'వోకల్ ఫర్ లోకల్' లేదా ఆత్మనిర్భర్ భారత్ అడుగడుగునా అవసరమైన మద్దతుతో ప్రజలను శక్తివంతం చేసింది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి 'యాక్ట్ ఈస్ట్' చొరవ ద్వారా ఎన్‌ఈఆర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఈశాన్య ప్రాంతం ఇప్పుడు నవ భారత అభివృద్ధి యాత్రకు నాయకత్వం వహించే అవకాశం ఉందని" అభిప్రాయపడ్డారు. గత ఏడు సంవత్సరాలుగా ఈశాన్య ప్రాంతం రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌వేలు, ఇంటర్నెట్ మరియు లాజిస్టిక్స్ కనెక్టివిటీలో స్థిరమైన పురోగతిని సాధించిందని తెలిపారు.
" భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఆర్థిక పురోగతి మరియు బ్రాండ్ ఇండియాను నిర్మించే ప్రయాణంలో వ్యవస్థాపకులు తమ వంతు సహకారం అందించారు. ఈ ప్రాంతం సహజ వనరులు, ఖనిజాలు మరియు అటవీ సంపద, వృక్షజాలం మరియు జంతుజాలం, సారవంతమైన భూమి, ఇతరదేశ పండ్లు మరియు కూరగాయలు మరియు అసమానమైన ప్రకృతి అందాలతో గొప్ప రిజర్వాయర్" అని మంత్రి తెలిపారు. దీనితో పాటు ఆగ్నేయాసియాకు భౌగోళిక సామీప్యత, ఈ ప్రాంతం అపారమైన వాణిజ్య సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు మార్కెట్ అనుసంధానాలతో, ఈశాన్య ప్రాంతం ఆగ్నేయాసియాకు వాణిజ్య కేంద్రంగా మారుతుంది. దీని కోసం, దేశంలో మరియు ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీని మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
రాజధాని కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్ధి కథలో కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి శరవేగంగా కనిపిస్తోందని, 85,000 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, జాతీయ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా, గ్రామ పంచాయతీలకు 4జీ మొబైల్ కనెక్టివిటీ మరియు వైఫై కనెక్టివిటీని మెరుగుపరచడం వలన దృశ్యం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. కనెక్టివిటీలో ఈ వృద్ధి త్వరలో ఎనిమిది రాష్ట్రాలు మరియు ప్రజలకు ఆర్థిక శ్రేయస్సుగా మారుతుందని ఆకాంక్షించారు.
అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఈ ప్రాంతం యొక్క స్వాభావిక సామర్థ్యాన్ని వెలికితీయడంకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి ఎనేబుల్ పాత్రను హైలైట్ చేశారు. పర్యాటక రంగం, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయం, ఉద్యానవనం, ఐటీ రంగం, సేవల పరిశ్రమ, టెక్స్‌టైల్స్ తదితర రంగాల్లో ఈ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ రంగాలలో వ్యవస్థాపకత మరియు పెట్టుబడికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా చొరవను ప్రారంభించినప్పటి నుండి..వ్యవస్థాపక స్ఫూర్తి దేశాన్ని కదిలించింది. స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర యోజన, స్టార్ట్-అప్ నార్త్ ఈస్ట్ ఉద్యమం వంటి అనేక కార్యక్రమాలతో పాటు నార్త్ ఈస్ట్ వెంచర్ ఫండ్ పథకం ద్వారా భారీ ఊపందుకుంది. ఈ పథకాన్ని ఉపయోగించుకుని యువత సామర్థ్యాన్ని అన్వేషించడంలో మరియు తమకు తాముగా మంచి జీవితాన్ని సంపాదించుకోవడంలో సహాయపడుతోందని తెలిపారు.
కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలతో పాటు ఈశాన్యప్రాంతంలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 75 మంది యువ పారిశ్రామికవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేయడంలో ప్రభుత్వం చేపడుతున్న చొరవ గురించి మాట్లాడారు. వారు సాధించిన కృషికి వారిని సత్కరించారు. ఒక పుస్తకం సంకలనం చేయబడుతుందని మరియు ఈ యువ ప్రదర్శనకారులకు వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఐఐఎం షిల్లాంగ్ నుండి సంస్థాగత మద్దతు కూడా అందించబడుతుందని మంత్రి చెప్పారు.తద్వారా రిప్ల్ ఎఫెక్ట్ ఉంటుందని, ఇతరులు తమ సొంత ప్రయాణాన్ని ప్రారంభించేలా స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. వృద్ధి మరియు అభివృద్ధి యొక్క భవిష్యత్తును మరింతగా రూపొందించడంలో సహాయపడటానికి వర్ధమాన వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం వహించాలని స్టార్టప్ యజమానులను ఆయన కోరారు. గత 7 సంవత్సరాలలో కనిపించే మరియు వేగవంతమైన అభివృద్ధితో గౌరవనీయమైన మంత్రి వ్యాపార వర్గాలను 'పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ఈశాన్య' సందేశాన్ని దేశవ్యాప్తంగా మరియు వెలుపల ప్రాంతాలకు తీసుకువెళ్లాలని కోరారు. గౌరవనీయులైన మంత్రి శ్రీ శ్యాంకను మహంత మరియు నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ ఆర్గనైజింగ్ టీమ్‌కి నార్త్ ఈస్ట్‌లోని వివిధ వ్యవస్థాపక వాటాదారులను ఉమ్మడి వేదికపైకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
***
(Release ID: 1788683)
Visitor Counter : 201