పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్ లో మ థుర లోని గోవర్దన్ లో ప్రషాద్ ప్రాజెక్టులను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి


రామాయణం, బౌద్ధ సర్క్యూట్లు వంటి వివిధ ఆధ్యాత్మిక సర్క్యూట్ల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా స్వదేశ్ దర్శన్ పథకం కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ. 500 కోట్లు కేటాయింపు:
శ్రీ కిషన్ రెడ్డి

Posted On: 07 JAN 2022 7:08PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు

 

కార్యక్రమానికి హాజరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, పర్యాటక, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్

 

ప్రషాద్ పథకం కింద ఇప్పటివరకు యాత్ర, ఆధ్యాత్మిక, వారసత్వ పునరుజ్జీవనం దిశగా సుమారు రూ.1200 కోట్ల కేటాయింపులో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు కలిసి 25%నిధులు: : శ్రీ జి.కిషన్ రెడ్డి

 

శరీరం నుండి ఆత్మను తొలగిస్తే మిగిలేది ఏమీ లేనట్టే దేశ అభవృద్ధికి ఆధ్యాత్మిక వారసత్వం, సంస్కృతి పరిరక్షణ అవసరం- గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఇందుకు ముందు నుండి నాయకత్వం వహిస్తున్నారు: శ్రీ కిషన్ రెడ్డి

 

కేంద్ర పర్యాటక , సంస్కృతి, ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ ఇఆర్ ) శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ , పర్యాటక , రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ తో కలసి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రషాద్ పథకం కింద ‘డెవలప్మెంట్ గోవర్దన్ ,మధుర ‘ ప్రాజెక్టు లో భాగంగా గోవర్ధన్ బస్టాండ్ లో  అభివృద్ధి పరచిన వివిధ నిర్మాణాలను వర్చువల్ గా ప్రారంభించారు

 

శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నాయకత్వం లో 150 కోట్ల వ్యాక్సినేషన్లు ఇచ్చిన చారిత్రాత్మక ఘనతను భారత్ సాధించిందని అన్నారు. కోవిడ్ ఇంకా ముగియలేదని ఆయన గుర్తు చేశారు, సురక్షితంగా , ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని ప్రోటోకాల్స్ జాగ్రత్తలను పాటించాలని సూచించారు. "మనం మన శరీరం నుండి ఆత్మను తొలగించినప్పుడు, మిగిలి ఏమీ ఉండదు. అదేవిధంగా మన దేశం ఆధ్యాత్మిక వారసత్వం సంస్కృతిని రక్షింకోపోతే దేశం అభివృద్ధి చెందదు. మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ విషయంలో ముందు నుండి నాయకత్వం వహిస్తున్నారు’’ అని కేంద్రఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాల ద్వారా యాత్రికుల అందుబాటును, వారి అనుభవాన్ని పెంపొందించడంపై ప్రధాన మంత్రి దృష్టి సారించారని తెలిపారు. ప్రధాన మంత్రి దార్శనికత ను సాకారం చేయడం కోసం, మొత్తం సౌక ర్యాలు, ప ర్యాట క మౌలిక స దుపాయాల ను మెరుగుపరచడం కోసం తమ మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ సెంటర్లు, ఎటిఎమ్ ,మనీ ఎక్స్ఛేంజ్ సదుపాయాలు, పర్యావరణ స్నేహపూర్వక బస్సులు, లైటింగ్, పార్కింగ్, టాయిలెట్లు, క్లోక్ రూమ్ లు, ప్రథమ చికిత్స కేంద్రాలు, రెయిన్ షెల్టర్లు పర్యాటక ప్రదేశాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రషాద్ పథకం అమలు చేయబడుతోంది.

 

రాష్ట్రంలో అమలు చేసిన ప్రాజెక్టులను గురించి మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "ఇప్పటివరకు ప్రషాద్ పథకం కింద, ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కలిసి తీర్థయాత్ర, ఆధ్యాత్మిక ,వారసత్వ పునరుజ్జీవనం కోసం సుమారు రూ. 1200 కోట్ల మొత్తం కేటాయింపులో 25% వరకు ఉన్నాయని, అంతేకాక, రామాయణం , బౌద్ధ సర్క్యూట్లు వంటి వివిధ ఆధ్యాత్మిక సర్క్యూట్ల ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా స్వదేశ్ దర్శన్ పథకం ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

 

భారతదేశం 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. రంగోలి తయారీ పోటీ వంటి మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడుతున్న కార్యక్రమాలలో  ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే దేశభక్తి పాటలను కూర్చే పోటీ వంటి ప్రజలలో దేశభక్తి ఉత్సాహాన్ని ప్రేరేపించడానికి రూపొందించిన కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పారు. గోవర్ధన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం వెనుక ఉన్న వ్యక్తులు, అధికారులను మంత్రి అభినందించారు.

 

పర్యాటక, సంస్కృతి, మత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (ఐసి) ప్రోటోకాల్ (ఎంఓఎస్) , శ్రీ డాక్టర్ నీలకంఠ తివారీ, శ్రీమతి. హేమమాలిని, పార్లమెంటు సభ్యురాలు (లోక్ సభ, మధుర రీజియన్, శ్రీ అరవింద్ సింగ్ కార్యదర్శి ,పర్యాటక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ,శ్రీ ముఖేష్ మేష్రామ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (టూరిజం) ,ఉత్తర ప్రదశ్ ఆగస్టు లో హాజరు కానున్నారు.  ఉత్తరప్రదేశ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

ప్రషాద్ పథకం కింద "గోవర్ధన్ మధుర అభివృద్ధి" కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2019 జనవరిలో రూ.39.73 కోట్ల వ్యయంతో పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 'మల్టీ లెవల్ కార్ స్టాండ్ బ్లాక్, క్లోక్ రూమ్ ,టాయిలెట్ లు, సరిహద్దు గోడ ,గోవర్ధన్ బస్ స్టాండ్ వద్ద ఉపరితల అభివృద్ధి' పనులను రూ. 15.82 కోట్ల వ్యయంతో విజయవంతంగా పూర్తి చేశారు.

 

ఈ ప్రాజెక్టు కింద మంజూరు అయిన ఇతర పనులలో మాన్సీ గంగా, చంద్ర సరోవర్, గోవర్ధన్ పరిక్రమ అభివృద్ధి ,కుసుమ్ సరోవర్ వద్ద అభివృద్ధి పనులు ఉన్నాయి. కుసుమ్ సరోవరం విద్యుదీకరణ ఇప్పటికే పూర్తయింది ఫిబ్రవరి 2021 లో దీనిని దేశానికి అంకితం చేశారు. అన్ని ఇతర అన్ని అభివృద్ధి పనులు పురోగతి లో ఉన్నాయి.

 

ఈ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన భాగాలు యాత్రికులకు సౌకర్యం కల్పించడానికి , యాత్రా అనుభవాన్ని పెంచడానికి దారిచేశాయి. అమలు చేసిన అభివృద్ధి పనుల ఫలితంగా గోవర్ధన్ పరిక్రమ మార్గంలో పాదచారుల రద్దీ నియంత్రించారు.

 

తీర్థయాత్ర పునరుజ్జీవనం పై జాతీయ మిషన్, ఆధ్యాత్మిక వారసత్వ పెంపుదల డ్రైవ్ (ప్రషాద్) అనేది భారత ప్రభుత్వ పూర్తి ఆర్థిక సహాయంతో  అమలవుతున్న కేంద్ర పథకం. ఉపాధి కల్పన , ఆర్థికాభివృద్ధిపై ప్రత్యక్ష , గుణాత్మక ప్రభావం కోసం ,వారసత్వ పర్యాటక గమ్యస్థానాలను ఉపయోగించుకోవడానికి దృష్టి సారించే మౌలిక సదుపాయాల అభివృద్ధి దార్శనికతతో 2014-15 సంవత్సరంలో పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి నాయకత్వంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. పర్యాటక సౌకర్యాల కేంద్రాలు, వే సైడ్ సౌకర్యాలు పార్కింగ్, ప్రజా సౌకర్యం, ఇల్యూమినేషన్ , సౌండ్ మరియు లైట్ షోలతో సహా పర్యాటక ప్రదేశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను  అభివృద్ధి పరచడం ఈ పథకం లక్ష్యం.

 

గోవర్ధన్ వద్ద పైన పేర్కొన్న ప్రాజెక్ట్ తో పాటు, మరో 5 ప్రాజెక్టులు. ప్రషాద్ పథకంలో

భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసింది.  ఉత్తరప్రదేశ్ కు ప్రషాద్ పథకం కింద మంజూరు చేసిన ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.139.75 కోట్లు.

మంజూరు చేయబడిన ప్రాజెక్టులలో మెగా టూరిస్ట్ గమ్యస్థానంగా మధుర బృందావన్ అభివృద్ధి, మధుర వద్ద పర్యాటక సౌకర్యాల కేంద్రం నిర్మాణం, వారణాసి అభివృద్ధి ,గంగా నదిలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధి ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద చాలా భాగాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి.  దేశానికి అంకితం చేయబడ్డాయి.

 

అంతర్జాతీయ ప్రమాణాల తో సౌకర్యాలను సృష్టించడానికి భారత ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా ఉపయోగించుకుందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ రంగంలో పర్యాటక మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన ప్రతి

సహకారాన్ని , మద్దతు ను అందిస్తామని  రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

Multi Level Car Parking at Govardhan

Bus Stand

Multi Level Car Parking at Govardhan

Bus Stand

Ramp

Parking Area

Multi Level Car Parking at Govardhan

Bus Stand

Open air Cafeteria at first floor

Toilet Block – Bus Stand

Tourist Information center at Entrance

 

***

 


(Release ID: 1788490) Visitor Counter : 199


Read this release in: English , Urdu , Hindi , Tamil