ఉక్కు మంత్రిత్వ శాఖ
కర్నాటకలోని జేఎస్‌డబ్లూ స్టీల్ విజయనగర్ వర్క్స్‌లో కొత్త 5 ఎంటిపిఏ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్
Posted On:
07 JAN 2022 7:29PM by PIB Hyderabad
కర్నాటకలోని బళ్లారిలో జేఎస్‌డబ్లూ స్టీల్ విజయనగర్ వర్క్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫెసిలిటీలో 5 ఎంటిపిఏ కొత్త ప్రాజెక్టుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ బ్రౌన్-ఫీల్డ్ విస్తరణ ప్రాజెక్ట్ జేఎస్‌డబ్లూ స్టీల్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని జేఎస్‌డబ్లూ విజయనగర్ మెటాలిక్స్ లిమిటెడ్ ద్వారా చేపట్టబడుతోంది. ఈ విస్తరణ కోసం కంపెనీ 15,000 కోట్ల రూపాయల క్యాపెక్స్ పెట్టుబడిని కేటాయించింది మరియు ఎఫ్‌వై24 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. జేఎస్‌డబ్లూ స్టీల్ ఛైర్మన్ శ్రీ సజ్జన్ జిందాల్‌తో పాటు ఇతర ప్రభుత్వ మరియు కంపెనీ అధికారుల సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
ప్రాజెక్ట్ కోసం పర్యావరణ క్లియరెన్స్ (ఈసీ) ఇప్పటికే భారత ప్రభుత్వం పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుండి అందుకుంది. కర్ణాటక ప్రభుత్వం 'సింగిల్ విండో హై-లెవల్ క్లియరెన్స్ కమిటీ' (ఎస్‌హెచ్‌ఎల్‌సిసి) నుండి ప్రాథమిక క్లియరెన్స్ కూడా పొందింది. విజయనగర్ వర్క్స్ స్టీల్ ఫెసిలిటీ కోసం 18 ఎంటిపిఎ రోడ్‌మ్యాప్‌లో భాగంగా, జెఎస్‌డబ్లూ స్టీల్ రాబోయే 12 నెలల్లో 13 ఎంటిపిఏ సామర్థ్యాన్ని సాధించడానికి ప్రస్తుత సౌకర్యాన్ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా అదనంగా 1 ఎంటిపిఏ విస్తరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించేందుకు జేఎస్‌డబ్లూ స్టీల్ చేస్తున్న కృషిని కొనియాడారు. పెరుగుతున్న ఉక్కు రంగ అభివృద్ధిపై దృష్టి సారించిన ఉక్కు మంత్రి విస్తరణ ప్రాజెక్టులు ప్రపంచ స్థాయి ఉక్కు లభ్యతను మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క ప్రగతిశీల ప్రణాళికలను పెంపొందించడంలో కూడా సహాయపడతాయని తెలియజేశారు.


***
(Release ID: 1788486)
Visitor Counter : 175