యు పి ఎస్ సి
షెడ్యూల్ ప్రకారం 2022 జనవరి, 7, 8, 9, 15, 16 తేదీల్లో జరగనున్న - సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2021
అభ్యర్థులు / పరీక్ష నిర్వాహకులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరిన - యు.పి.ఎస్.సి.
प्रविष्टि तिथि:
05 JAN 2022 4:50PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితిని జాగ్రత్తగా సమీక్షించిన అనంతరం, సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2021 ని షెడ్యూల్ ప్రకారం అంటే 2022 జనవరి, 7, 8, 9, 15, 16 తేదీల్లో నిర్వహించాలని, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.
వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలు / నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులకు / పరీక్ష నిర్వాహకుల రాకపోకలకు, ముఖ్యంగా కంటైన్‌మెంట్ / మైక్రో-కంటైన్‌మెంట్ జోన్(ల) నుండి వస్తున్న వారికి, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అవసరమైతే, అభ్యర్థుల ఇ-అడ్మిట్ కార్డులు, పరీక్షా నిర్వాహకుల గుర్తింపు కార్డులను "రాకపోకలకు అనుమతి పత్రాలు" గా ఉపయోగించాలని, కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
అభ్యర్థులు / పరీక్ష నిర్వాహకులు రాకపోకలను సజావుగా సాగించేందుకు వీలుగా, ప్రజా రవాణా వ్యవస్థను గరిష్ట స్థాయిలో, కనీసం పరీక్ష కు ఒక రోజు ముందు నుంచి పరీక్ష నిర్వహించే తేదీ వరకు అంటే 06.01.2022 తేదీ నుండి 09.01.2022 వరకు, అలాగే తిరిగి, 14.01.2022 తేదీ నుండి 16.01.2022 తేదీ వరకు, అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది
ఈ మహమ్మారి సమయంలో పరీక్షల నిర్వహణ కోసం, సంబంధిత జిల్లా అధికారులు, ఆయా పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులకు కమిషన్ మార్గదర్శకాలు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా, అభ్యర్థులు / పరీక్ష నిర్వాహకులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడడం; సామాజిక దూరం పాటించడానికి తగిన ఏర్పాట్లు చేయడం; అభ్యర్థులు / పరీక్ష నిర్వాహకులు అన్ని సమయాల్లో మాస్కులు ధరించడం; పరీక్షా కేంద్రాల్లో అనుకూలమైన ప్రదేశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం; పరీక్ష నిర్వాహకులు, అభ్యర్థులు తమ సొంత శానిటైజర్ల ను పారదర్శక సీసాలలో తెచ్చుకోడానికి అనుమతించడం; ఒక క్రమ పద్ధతిలో ప్రతి పరీక్షా కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం; దగ్గు, తుమ్ములు, ఊపిరి ఆడకపోవడం, జ్వరంతో బాధపడే అభ్యర్థులు తగిన భద్రతా జాగ్రత్తలతో పరీక్ష రాయడానికి వీలుగా, వారి కోసం కోసం అదనంగా రెండు గదులను ప్రత్యేకించడం వంటి మార్గదర్శకాలను ప్రధానంగా పేర్కొనడం జరిగింది.
<><><>
(रिलीज़ आईडी: 1787833)
आगंतुक पटल : 165