గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వాతావరణ అవగాహన ప్రచారం - జాతీయ ఫోటోగ్రఫీ పోటీ

Posted On: 03 JAN 2022 5:23PM by PIB Hyderabad

గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యుఎ) వాతావరణ మార్పు అవగాహన ప్రచారం , జాతీయ ఫోటోగ్రఫీ పోటీని నిర్వహిస్తోంది. గుజరాత్ లోని సూరత్ లో ఫిబ్రవరి 4 ,5 తేదీల్లో జరిగే 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్- స్మార్ట్ సిటీస్: స్మార్ట్ అర్బనైజేషన్' ఈవెంట్ కోసం జరిగే ముందస్తు కార్యకలాపాల్లో 2022 జనవరి 26 వరకు పాల్గొనే వారికి ఈ పోటీ లో ప్రవేశం ఉంటుంది. వాతావరణ మార్పుల ద్వారా ఎదురయ్యే సవాళ్ల పై  చైతన్యవంతం చేయడం, పరిష్కారాలకు ఆలోచనలతో పాల్గొనేవారిని ప్రోత్సహించడం , నగరాల్లో వాతావరణ పరిరక్షణ చర్యను పెంపొందించడం ఈ ప్రచార కార్యక్రమానికి, పోటీకి కూడా ఇతివృత్తంగా ఉన్నాయి.

వాతావరణ అవగాహన ప్రచారం:

ఈ ప్రచారంలో మునిసిపల్ కమిషనర్లు , పట్టణ స్థానిక సంస్థల ప్రధాన అధిపతులు, స్మార్ట్ సిటీ సిఇఒలు పాల్గొని పట్టణ వాతావరణ మార్పు ,సుస్థిరతతో సంబంధం ఉన్న సవాళ్లు ,పరిష్కారాలకు యువ మనస్సులను సమలేఖనం చేయడానికి వారి నగరాల్లోని పాఠశాలలు ,కళాశాలలతో సహా విద్యా సంస్థలలో అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నగరాల్లో ఈ క్రింది వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలను నిర్వహిస్తారు :

వాతావరణ మార్పు అవగాహన ప్రచారం: వాతావరణ మార్పు , స్థిరమైన చర్యలపై నగర అధికారులు విద్యా సంస్థలలో అవగాహన కల్పించనున్నారు.

వాతావరణ మార్పులపై సోషల్ మీడియా ప్రచారం: నగర అధికారులు సోషల్ మీడియా అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తారు. మేయర్లు/మునిసిపల్ కమిషనర్లు/స్మార్ట్ సిటీ సిఇఒలు వంటి నగర నాయకులు వాతావరణ చర్యల గురించి మాట్లాడతారు. ఇది వారి నగరంలో అమలు చేయవచ్చు. ప్లాంటేషన్ డ్రైవ్, నీటి వనరుల శుభ్రత, ఇ-వ్యర్థాల రీసైక్లింగ్, నివాస - వాణిజ్య భవనాలలో సౌర శక్తిని స్వీకరించడాన్ని ప్రోత్సహించడం, లేదా వాతావరణ అనుసరణ లేదా ఉపశమన చర్యలను ప్రోత్సహించే ఏదైనా ఇతర చొరవ వంటివి చర్చకు తీసుకుంటారు. తీసుకోబడతాయి.

ఫోటోగ్రఫీ పోటీ కి ప్రోత్సాహం:  వాతావరణ మార్పుల ఇతివృత్తం ఆధారంగా నగర స్థాయి ఫోటోగ్రఫీ పోటీని నిర్వహిస్తారు.

ఈవెంట్ ల వివరాలు https://niua.org/c-cube/content/climate-change-awareness-campaign లో అందుబాటు లో ఉన్నాయి.

భారతీయ నగరాలపై వాతావరణ మార్పుల ప్రభావాలపైన, వాతావరణ మార్పులను స్వీకరించడానికి/ తగ్గించడానికి వ్యక్తులు, కమ్యూనిటీలు లేదా నగర అధికారులు తీసుకున్న చర్యలపైన దృష్టి  సారించే ఛాయాచిత్రాలను పోటీ లో పాల్గొనేవారు సమర్పించాలి. పోటీలో పాల్గొనేందుకు, ఫోటోగ్రాఫ్ లను రెండు కేటగిరీల్లో సమర్పించాలి.

నగరాల్లో వాతావరణ ప్రభావాలు

నగరాల్లో వాతావరణ చర్యలు

ఛాయాచిత్రాల ఎంపిక -కంటెంట్, కూర్పు, టెక్నిక్ పై దృష్టి సారిస్తుంది. ఆసక్తి గల ఫోటోగ్రాఫర్లు ,వాతావరణ ఔత్సాహికులందరూ పోటీ లో పాల్గొనే వివరాల కోసం https://niua.org/c-cube/content/national-photography-competition ను సందర్శించవచ్చు. ఫోటోగ్రాఫ్ సమర్పించేందుకు గడువు 26 జనవరి 2022 రాత్రి 11:59 గంటల తో ముగుస్తుంది.

 

ఆజాది కా అమృత్ మహోత్సవ్

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని, దాని ప్రజల సుసంపన్నమైన చరిత్రను,  సంస్కృతి , విజయాలను ప్రజలు వేడుకగా జరుపుకోవడానికి , స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ. ఈ

మహోత్సవాన్ని భారతదేశాన్ని దాని పరిణామ ప్రయాణంలో ఇప్పటివరకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో భారతదేశాన్ని 2.0 తో క్రియాశీలం చేయాలనే ప్రధాని మోడీ దార్శనికతను సాకారం చేసే శక్తిని , సామర్థ్యాన్ని కలిగి ఉన్న భారతదేశ ప్రజలకు అంకితం చేశారు.

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది భారతదేశ సామాజిక-సాంస్కృతిక, రాజకీయ ఆర్థిక గుర్తింపు గురించిన ప్రగతిశీలమైన వాటన్నింటి స్వరూపం. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” అధికారిక ప్రయాణం 12 మార్చి 2021న ప్రారంభమైంది, ఇది మన 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది.

 

*****



(Release ID: 1787273) Visitor Counter : 224