ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ సంజయ్ కుమార్ సింగ్ ఉక్కుమంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు

प्रविष्टि तिथि: 30 DEC 2021 4:09PM by PIB Hyderabad

శ్రీ సంజయ్ కుమార్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి.  శ్రీ పి.కె. త్రిపాఠి, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి) తర్వాత శ్రీసింగ్ బాధ్యతలు చేపట్టారు. శ్రీ త్రిపాఠి ఉక్కు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీ సంజయ్ కుమార్ సింగ్‌ను ఉక్కు కార్యదర్శిగా సోమవారం కేంద్రం అమలు చేసిన ప్రధాన ఉన్నత స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నియమించారు.



image.png


ప్రస్తుత పదవిని చేపట్టడానికి ముందు శ్రీ సంజయ్ కుమార్ సింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ (డిఎఆర్‌పిజి) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ & పెన్షనర్స్ వెల్ఫేర్ (డిఓపిపిడబ్లు) కార్యదర్శిగా ఉన్నారు.

***


(रिलीज़ आईडी: 1786436) आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada