విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఆర్ఈసీ అనుబంధ సంస్థ సీపీడీసీఎఆర్ఈల్ 'కల్లం ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్', ప్రాజెక్ట్ ఎస్‌పీవీని ఇండిగ్రిడ్ 1 లిమిటెడ్ మరియు ఇండిగ్రిడ్ 2 లిమిటెడ్ కన్సార్టియంకు అప్పగింత
Posted On:
29 DEC 2021 2:59PM by PIB Hyderabad
విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌బీఎఫ్‌సీ నవరత్న సీపీఎస్‌యు అయిన ఆర్ఈసీ లిమిటెడ్ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ 'ఆర్ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్' (సీపీడీసీఎఆర్ఈల్ ) దేశంలో ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూపొందించిన ప్రాజెక్ట్ నిర్దిష్ట ఎస్‌పీవీ (స్పెషల్ పర్పస్ వెహికల్) ఇండిగ్రిడ్ 1 లిమిటెడ్, ఇండిగ్రిడ్ 2 లిమిటెడ్ కన్సార్టియంకు అప్పగించింది. 'మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ప్రాంతంలో (1 గిగావాట్లు) ఉన్న ఆర్ఈ ప్రాజెక్ట్‌ల నుండి ఇండిగ్రిడ్ -1 లిమిటెడ్ మరియు ఇండిగ్రిడ్ 2 లిమిటెడ్ యొక్క కన్సార్టియంకు విద్యుత్ తరలింపు ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ నిమిత్తం కోసం 2021 డిసెంబర్ 28వ తేదీని దీనిని అప్పంగించారు. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్‌ల నిమిత్తం ఇండిగ్రిడ్ -1 లిమిటెడ్, ఇండిగ్రిడ్-2 లిమిటెడ్ కన్సార్టియం విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. బిడ్ ప్రాసెస్ కోఆర్డినేటర్‌గా ఆర్ఈసీపీడీసీఎల్ నిలిచింది. ఆర్ఈసీపీడీసీఎల్ సీఈఓ శ్రీ ఆర్. లక్ష్మణన్, జాయింట్ సీఈఓ టీఎస్‌సీ బోస్‌లు ఎస్‌పీవీని ఇండిగ్రిడ్ 1 లిమిటెడ్ సంస్థకు చెందిన శ్రీ బిగ్యాన్ పారిజాకు, ఇండిగ్రిడ్ 2 లిమిటెడ్‌కు చెందిన శ్రీ ఆదిత్య కిస్లేకు అప్పగించారు. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్‌లు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రాన్స్‌మిషన్ డెవలపర్‌ల ఎంపిక కోసం టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ) ప్రక్రియ ద్వారా విజయవంతమైన బిడ్డర్ ఎంపిక జరిగింది. ఈ పనిలో కల్లం వద్ద 400/220 కేవీ సబ్-స్టేషన్ మరియు 400 కేవీ డబుల్ సర్క్యూట్ పార్లి - పూణే ట్రాన్స్‌మిషన్ లైన్ యొక్క ఎల్ఐఎల్ఓ ఏర్పాటు తదితర పనులు ఉన్నాయి. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్ఈసీ లిమిటెడ్ గురించి: ఆర్ఈసీ లిమిటెడ్ అనేది భారతదేశం అంతటా విద్యత్ రంగం ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధిపై దృష్టి సారించిన నవరత్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ. 1969లో స్థాపించబడిన ఆర్ఈసీ లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాల ప్రాంతంలో యాభై సంవత్సరాల సేవను పూర్తి చేసుకుంది. ఇది రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర/రాష్ట్ర విద్యుత్తు వినియోగ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు, గ్రామీణ విద్యుత్ సహకార సంఘాలు, ప్రైవేట్ రంగ వినియోగాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీని వ్యాపార కార్యకలాపాలు పూర్తి పవర్ సెక్టార్ వాల్యూ చైన్‌లో ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉంటాయి; వివిధ రకాల ప్రాజెక్ట్‌లలో జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ విభాగాలు ఉన్నాయి. ఆర్ఈసీ యొక్క నిధులు భారతదేశంలోని ప్రతి నాలుగో బల్బును ప్రకాశింపజేస్తూ తన సేవలను అందిస్తోంది.
***
(Release ID: 1786223)
Visitor Counter : 147