ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ నిధులతో బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ & లెర్నింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హోలిస్టిక్ ఆస్పిరేషన్ ఆఫ్ మదర్స్ (బిఐఎల్‌సిహెచ్ఎ ఎం-బిల్‌చామ్) కార్యకలాపాలు
Posted On:
29 DEC 2021 1:10PM by PIB Hyderabad
గ్రామీణ సమాజ స్థిరత్వం, రక్షణ కోసం ఐఎఫ్ఎడి, డిఒఎన్ఇఆర్/ ఎన్ఇసి & భారత ప్రభుత్వ నిదులతో జిల్లా స్తాయిలో కేంద్ర ఫెడరేషన్‌గా వెస్ట్ గారో హిల్స్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్ మెంట్ సొసైటీ/ ఎన్ ఇఆర్‌సిఒఆర్ఎంపి కింద సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం, 1983 ప్రకారం 2006, అక్టోబర్ 25న బిఐఎల్‌సిహెచ్ఎ ఎం -బిల్‌చామ్ (బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ & లెర్నింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హోలిస్టిక్ ఆస్పిరేషన్ ఆఫ్ మదర్స్)ను ఏర్పాటు చేయడం జరిగింది.
బిఐఎల్‌సిహెచ్ఎ ఎం ఇప్పడు ఒక బలమైన స్వతంత్ర మహిళా సంస్థ , గతంలో ఇటువంటి సౌకర్యాలు లేని పేదలలోని పేదలకు జీవనోపాధిని, రుణాన్ని అందిస్తోంది.మొత్తం పశ్చిమ గారో కొండలు, తూర్పు, దక్షిణ గారో కొండలలో కొన్ని ప్రాంతాలకు స్వయం సహాయక బృందాల ఫెడరేషన్ల ద్వారా బిఐఎల్‌సిహెచ్ఎ ఎంసేవలను అందిస్తోంది. రుణాలను తనిఖీ చేసి, కేటాయించి, వాటిని తిరిగి వసూలు చేసేందుకు బాధ్యత వహించే బోర్డులో ఎస్‌హెచ్‌జి ఫెడరేషన్లు కూడా సభ్యులు.
కాలక్రమంగా, ఈ సంస్థ ప్రజాదరణ, గుర్తింపు కారణంగా ఈ సంస్థ గ్రామీణ పేదలలో అద్భుతమైన విశ్వాసాన్ని పొందింది. రుణాలు తేలికగా అందుబాటులో ఉండటం, కర్తృత్వ భావన కలగిన ఫలితంగా అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందనను పొందింది.
***
(Release ID: 1786179)
Visitor Counter : 139