ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుళికల రూపంలో ఉన్నఒక కిలో కొకైన్‌ను ప్రయాణీకురాలి కడుపులో గుర్తించి స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
Posted On:
29 DEC 2021 3:36PM by PIB Hyderabad
న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సరికొత్త రీతిలో సాగుతున్న మాదకద్రవ్యాల రవాణాను గుర్తించి ఛేదించారు. అత్యంత శ్రద్ధతో డేగ కళ్ళతో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు కొకైన్ అక్రమ రవాణాను అరికట్టారు. గుళికల రూపంలో కొకైన్ ను మింగి దానికి అక్రమంగా తరలించడానికి జరిగిన ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు . దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కొన్ని రోజుల కిందట ఉగాండా కి చెందిన ఒక ప్రయాణికురాలు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. టెర్మినల్ -3 వద్ద ప్రయాణికురాలి అధికారులు గుర్తించారు. ప్రయాణికురాలి కదలికలు, ప్రవర్తన అసహజంగా ఉండటంతో అధికారులు ఆమెను ఆపి ప్రశ్నించారు. మానవతా దృక్పధంతో ఆమెకు సహాయం అందించాలని అధికారులు భావించారు. అధికారులు నుంచి సహాయం తీసుకునేందుకు నిరాకరించిన ప్రయాణికురాలు వారితో మాట్లాడేందుకు కూడా విముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆమె ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రయాణికురాలి అసహజ ప్రవర్తన అధికారులకు అనుమానం కలిగించింది. దీనితో అధికారులు సదరు ప్రయాణికురాలిని జాగ్రత్తగా గమనించడం ప్రారంభించారు. గ్రీన్ గ్రీన్ ఛానల్‌ను దాటి అంతర్జాతీయ నిష్క్రమణ ద్వారం వద్దకు వచ్చిన ఆమెను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. తరచి తరచి ప్రశ్నించడంతో ఆమె 91 మత్తుపదార్థాల క్యాప్సూల్స్‌ను మింగినట్లు వెల్లడించింది.
ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి కావడంతో అధికారులు ప్రయాణికురాలని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చారు. ఎక్స్ రే లో సదరు ప్రయాణికురాలి కడుపులో 91 గులికెలు ఉన్నట్టు పెద్దపేగు కింద, పై భాగాలు గులికెలతో నిండిపోయి వున్నాయి. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వాటిని వెలికి తీశారు. మొత్తం ఆమె కడుపులో నుంచి 91 గుళికలు బయట పడ్డాయి.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అనేక రోజులు పట్టింది. ఈ సమయంలో కస్టమ్స్ అధికారులు గట్టి నిఘా ఉంచారు. ఈ గులికెలను పౌడర్ రూపంలో ఉన్న కొకైన్తో నింపారు. పట్టుబడిన కొకైన్ బరువు 992 గ్రాముల వరకు ఉంది.
కోలుకున్న ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులకు ఆస్పత్రి అధికారులు అప్పగించారు. ఎన్ డి పి ఎస్ చట్టం,1985 లోని సెక్షన్ 43(బి) కింద కేసు నమోదు చేసిన అధికారులు 29.12.2031 న ఆ మహిళను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.
***
(Release ID: 1786178)
Visitor Counter : 137