రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వానికి పద్దెనిమిదవ డివిడెండ్ చెల్లించిన మినీరత్న-II కంపెనీ ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ & మైన్స్ ఇండియా లిమిటెడ్
Posted On:
23 DEC 2021 4:10PM by PIB Hyderabad
రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎఫ్‌సీఐ ఆరావళి జిప్సమ్ & మినరల్స్ ఇండియా లిమిటెడ్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ అమర్ సింగ్ రాథోడ్.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్యకు రూ.2,60,00,000/- (పన్నెండు కోట్ల అరవై లక్షల) విలువైన డివిడెండ్ చెక్కును అందించారు. ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ చతుర్వేది సమక్షంలో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఈ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ సాధించిన ఫలితాలు, వృద్ధిని మంత్రి అభినందించారు. ఈ కంపెనీ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వానికి అధిక డివిడెండ్‌లను అందజేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కంపెనీ వివిధ రకాల
ప్రణాళికలతో ముందుకు సాగుతోందని, పొటాష్ మరియు రాక్ ఫాస్ఫేట్ వంటి ఎరువుల ఖనిజాలతో మైనింగ్‌లోకి ప్రవేశించే ప్రణాళికలలో ఉందని సీఎండీ ఈ సందర్భంగా తెలియజేశారు. దీనికి తోడు సమీప భవిష్యత్తులో బయో మరియు కెమికల్ ఎరువుల ఉత్పత్తి రంగంలోకి కూడా కంపేనీ ప్రవేశించాలని యోచిస్తోందని వివరించారు. జోధ్‌పూర్ మైనింగ్ ఆర్గనైజేషన్ (మెస్సర్స్ ఎఫ్‌సీఐఎల్ యొక్క ఈ యూనిట్) నుండి విడదీసిన తర్వాత 14.02.2003న ఎఫ్‌షీఐ ఆరావళి జిప్సమ్ & మినరల్స్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ఏజీఎంఐఎల్) విలీనం చేయబడింది. ఈ కంపెనీ తన కొత్త వ్యాపారాన్ని 01.04.2003 నుంచి రూ. 10 కోట్ల అధీకృత మూలధనంతో ప్రారంభించబడింది. గడిచిన రూ. 18 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఈ సంస్థ భారత ప్రభుత్వానికి రూ. 113.94 డివిడెండ్‌ను చెల్లించింది.
*****
(Release ID: 1784700)
Visitor Counter : 140