గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
500 అమృత్ నగరాలలో 100 శాతంమానవవ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, నీటి భద్రత లక్ష్యంగా అమృత్ 2.0
प्रविष्टि तिथि:
20 DEC 2021 4:42PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం 2021 అక్టోబర్ 1న అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్, అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ( అమృత్ ) 2.0ను 2021 అక్టోబర్ 2021లో ప్రారంభించింది. పీయే జల్ సర్వేక్షన్ ను అమృత్ 2.0 నగరాలలో1 అక్టోబర్ 2021 న చేపట్టడం నగరంలో నీటి సరఫరా పరిమాణం, నాణ్యతకు సంబంధించిన బెంచ్ మార్క్‌లను అంచనా వేయడం ఒక సవాలుతో కూడుకున్నది. నీటి క్లస్టర్ల ద్వారా వినియోగం వరకు రాకుండా మధ్యలోనే వృధా అయ్యే నీటిని తగ్గించేందుకు ఇది అంచనా వేస్తుంది. అలాగే నీటి వనరులను పునరుద్ధరించడం, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. పీయే జల్ సర్వేక్షన్ కంద తొలిదశలో అమృత్ కింద ఎంపిక చేసిన 500 నగరాలను కవర్ చేస్తారు.
నీతి ఆయోగ్ ప్రస్తుతం అమృత్ పథకంతో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలను నీతి ఆయోగ్ థర్డ్ పార్టీ చేత పరిశీలన చేయిస్తుంది. అమృత్ పథకం సమర్ధత, దాని ఉపయోగం, నిరంతర కొనసాగింపు, ప్రభావం, అందుబాటు తదితరాలను అంచనా వేయడం జరిగింది.
ఈ అంచనా మేరకు అమృత్ పనితీరు అన్ని ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయి.
అట్ మిషన్ ఫర్ రెజునువేషన్, అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ( అమృత్) ను 2015 జూన్ 25న ప్రారంభించింది.. ఎంపిక చేసిన 500 అమృత్ నగరాలలో సార్వత్రిక నీటిసరఫరా, మురుగు నీటిపారుదల పరిస్థితిని మెరుగు పరిచేందుకు దీనిని ప్రారంభించారు.
ఇటీవల, ప్రభుత్వం అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్, అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషనన్ (అమృత్ ) 2.0 ను 2021 అక్టోబర్ 1న ప్రారంభించారు. నీటి భద్రత కలిగిన నగరాలు, అన్ని పట్టణాలలో సార్వత్రిక నీటి సరఫరా , నూరు శాతం మురుగు నీటి పారుదల, 500 అమృత్ నగరాలలో మానవ వ్యర్థాల నిర్వహణ లక్ష్యంగా దీనిని తీసుకువచ్చారు. మురుగు నీటిపారుదల, మానవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఇతర నగరాలలో దీనిని స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ (ఎస్‌బిఎం -యు) 2.0 ని 2021 అక్టోబర్ 1న ప్రారంభించారు.
ఈ సమాచారాన్ని కేంద్ర హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ కౌశల్ కిషోర్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 1784505)
आगंतुक पटल : 161