కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) పోలిష్ ఛాంబర్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిటర్స్ (పిఐబిఆర్) మధ్య అవగాహనా ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం
Posted On:
22 DEC 2021 5:26PM by PIB Hyderabad
సభ్య నిర్వహణ, వృత్తి పరమైన నైతిక విలువలు, సాంకేతిక పరిశోధన, సిపిడి, ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ట్రైనింగ్, ఆడిట్ క్వాలిటీ మానిటరింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ అండ్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ రంగాలలో పరస్పర సహకారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) , పోలిష్ ఛాంబర్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిటర్స్ (పిఐబిఆర్) మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) పై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.
అమలు వ్యూహం-లక్ష్యాలు:
బ్లాక్ చైన్, స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్, సంప్రదాయ అకౌంటింగ్ నుంచి క్లౌడ్ అకౌంటింగ్ కు మార్పు మొదలైన వాటితో సహా ఆడిట్ ,అకౌంటింగ్ రంగంలో కొత్త సృజనాత్మక విధానాల అధ్యయనం అనువర్తనం విషయాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ప్రతిపాదిత ఎమ్ఒయు లక్ష్యంగా పెట్టుకుంది.
వృత్తిపరమైన సంస్థలు ప్రచురించిన పుస్తకాలు, మ్యాగజైన్లు ,ఇతర ప్రచురణల మార్పిడి, ఆడిట్ ,అకౌంటింగ్ పై ఆర్టికల్స్ ను పరస్పరం ప్రచురించడం ,రెండు పార్టీల మ్యాగజైన్లు ,వెబ్ సైట్లపై ఉమ్మడి సహకారాన్ని చేపట్టడం ,అవినీతి , మనీ లాండరింగ్ కు వ్యతిరేకంగా పోరాటంలో ఉమ్మడి సహకారాన్ని చేపట్టాలని ఐసిఎఐ ,పిఐబిఆర్ భావిస్తున్నాయి.
ప్రభావం:
ఐసిఎఐ -పిఐబిఆర్, పోలాండ్ మధ్య ఎమ్ఒయు, ఐసిఎఐ సభ్యులకు స్వల్ప కాలం నుండి దీర్ఘకాలిక భవిష్యత్తులో పోలాండ్ లో వృత్తిపరమైన అవకాశాలను పొందడానికి అవకాశాలను అందించడం ద్వారా ఐరోపాలో తన ఉనికిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఐసిఎఐ -పిఐబిఆర్ సభ్యులకు పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయడమే ఈ ఎమ్ఒయు లక్ష్యం.ఎమ్ఒయుతో, ఐసిఎఐ అకౌంటెన్సీ వృత్తిలో సేవల ఎగుమతిని అందించడం ద్వారా పోలాండ్ తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయగలదు.
ఐసిఎఐ సభ్యులు దేశాల వ్యాప్తంగా వివిధ సంస్థలలో మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి హోదా లను కలిగి ఉన్నారు. ఒక దేశం లోని సంబంధిత సంస్థల నిర్ణయం/విధాన రూపకల్పన వ్యూహాలను ప్రభావితం చేయగలుగుతున్నారు. ఐసిఎఐ తన విస్తారమైన అధ్యాయాలు మరియు ప్రాతినిధ్య కార్యాలయాల విస్తృత నెట్ వర్క్ ద్వారా ప్రపంచంలోని 47 దేశాలలోని 73 నగరాల్లో ఈ దేశాల్లో ప్రబలంగా ఉన్న పద్ధతులను పంచుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి కట్టుబడి ఉంది, తద్వారా భారత ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్తమ పద్ధతులను అవలంబించవచ్చు. భారతదేశంలో వారి నెట్ వర్క్ ను ప్రోత్సహించ గలదు.ఈ ఎమ్ఒయు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ,పోలిష్ ఛాంబర్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిటర్స్ (పిఐబిఆర్)లకు ప్రయోజనం చేకూరుస్తుంది.
నేపథ్యం:
ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) అనేది భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల వృత్తిని నియంత్రించడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం, 1949 కింద ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ.ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ల వృత్తిని పెంపొందించడంలో విద్య, వృత్తిపరమైన అభివృద్ధి, అధిక అకౌంటింగ్ నిర్వహణ, ఆడిటింగ్ ,నైతిక ప్రమాణాల రంగంలో ఐసిఎఐ ఎంతో దోహదపడింది.
పోలిష్ ఛాంబర్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిటర్స్ (పిఐబిఆర్) స్టాట్యూటరీ ఆడిటర్ల స్థానిక ప్రభుత్వంగా ఆర్థిక స్టేట్మెంట్ల ఆడిటింగ్, పబ్లిషింగ్, స్టాట్యూటరీ ఆడిటర్ల కోసం 1991 అక్టోబర్ చట్టం కింద ఏర్పాటై 1992 జనవరి 1 నుంచి అమలు లోకి వచ్చింది. పోలాండ్
లో ఆడిట్ వృత్తి నియంత్రణ దీని లక్ష్యం.
****
(Release ID: 1784397)
Visitor Counter : 186