వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సేంద్రీయ పత్తి ఉత్పత్తి
Posted On:
21 DEC 2021 5:01PM by PIB Hyderabad
సేంద్రీయ పత్తితో సహా అన్ని రకాల పత్తి ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి. రైతులు ఉత్పత్తికి గరిష్ట రాబడిని పొందేందుకు వీలుగా వినియోగదారు పరిశ్రమ ద్వారా స్పెషాలిటీ/సేంద్రీయ పత్తిని ప్రోత్సహించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ (డీఏ&ఎఫ్డబ్ల్యూ) సూచించింది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా), వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీఓపీ) అమలు కోసం డీఏ&ఎఫ్డబ్ల్యూ సెక్రటేరియట్గా పనిచేస్తుంది. ఎన్పీఓపీ ధృవీకరణ సంస్థల అక్రిడిటేషన్, సేంద్రీయ ప్రక్రియ & ఉత్పత్తుల ధృవీకరణ కోసం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని అందిస్తుంది. ప్రస్తుతం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఫారిన్ ట్రేడ్ (డెవలప్‌మెంట్ & రెగ్యులేషన్) చట్టం ప్రకారం ఎన్పీఓపీ ముడి సేంద్రీయ పత్తి (విత్తన పత్తి)కి ధ్రువీకరణ తప్పనిసరి. జిన్నింగ్, స్పిన్నింగ్, అల్లడం, నేయడం మొదలైన ప్రాసెసింగ్‌లు దేశం నుండి ఎగుమతి చేయడానికి తప్పనిసరి కాబట్టి ఎన్పీఓపీ కిందకు రావు. సేంద్రీయ పత్తిని శుద్ధి చేసిన తరువాత ప్రైవేట్ సర్టిఫికేషన్ విధానంలో ఎగుమతి అవుతుంది. జౌళి మంత్రిత్వ శాఖ సలహా మేరకు, ప్రాసెస్ అయిన రూపంలోని పత్తికి సరఫరా గొలుసులోని అన్ని సవాళ్లు సమస్యలను అధిగమించడానికి, అపెడా 2020లో స్వచ్ఛంద ప్రాతిపదికన భారతీయ సేంద్రీయ ఫైబర్స్ & ఉత్పత్తుల కోసం చైన్ ఆఫ్ కస్టడీని ప్రారంభించింది. వ్యవసాయ క్షేత్రం నుండి తయారైన వాటి వరకు ఫైబర్ల ధృవీకరణ కోసం ఎన్పీఓపీ కింద దీనిని మొదలుపెట్టింది.
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం 2015–-16 నుండి ఈశాన్య ప్రాంతం కోసం పరంప్రగత్ కృషి వికాస్ యోజన (పీకేవైవీ) మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ (ఎంఓవీసీడీఎన్ఈఆర్) పథకాల క్రింద సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ రెండు పథకాలు సేంద్రీయ రైతులకు మేలు చేస్తాయి. సేంద్రీయ ఉత్పత్తి నుండి ధృవీకరణ, మార్కెటింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ వంటి కోతల అనంతర సేవలను ( పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్) అందిస్తాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్)-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ (సీఐసీఆర్) ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ (ఏఐసీఆర్పీ) 2017-–2021లో 64 నాన్ -బిటి (నాన్-జిఎం) పత్తి రకాలు/హైబ్రిడ్‌లను విడుదల చేశాయి. సేంద్రీయ పత్తి సాగుదారులచే స్వీకరించబడింది. న్యూక్లియస్/బ్రీడర్ విత్తనాలు డెవలపర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇండెంట్ పొందిన తర్వాత సేంద్రీయ పత్తి రైతులకు విత్తనాలను అందజేస్తారు. ఐకార్–-సీఐసీఆర్ పత్తి కోసం ఏఐసీఆర్పీలు బ్రీడర్ విత్తనాల మూలాన్ని అందిస్తాయి. సేంద్రీయ పత్తి ఉత్పత్తికి సంబంధించిన మేలైన ప్యాకేజీ పద్ధతులను అందించడం ద్వారా రైతులకు సహాయం చేస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1784040)
Visitor Counter : 189