భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఫోర్బ్స్ ఎన్విరో సొల్యూషన్స్ లిమిటెడ్‌లో నియంత్రణ వాటా కొనుగోలు చేసిన లునోలక్స్ లిమిటెడ్ ఆమోదం తెలిపిన సీసీఐ
నాడు పోస్టు చేయడమైనది:
21 DEC 2021 12:01PM by PIB Hyderabad
ఫోర్బ్స్ ఎన్విరో సొల్యూషన్స్ లిమిటెడ్ (టార్గెట్/ ఎఫ్ఈఎస్ఎల్) నియంత్రణ వాటాను కొనుగోలు చేయడానికి లునోలక్స్ లిమిటెడ్(అక్వైరర్ / ఎల్ఎల్)కు కాంపిటీషన్ చట్టం, 2002లోని సెక్షన్ 31(1) కింద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ఎఫ్ఈఎస్ఎల్ కి చెందిన 72.65% వాటాలను ప్రాధమికంగా, మిగిలిన 26% వాటాలను సెబీ నిబంధనలు (ఎక్కువ వాటాల కొనుగోలు మరియు స్వాధీనం), 2011 కి అనుగుణంగా బహిరంగ ఆఫర్ ద్వారా ఎల్ఎల్ సేకరించడానికి వీలు కల్పిస్తూ ఈ ప్రతిపాదిత కలయిక రూపొందింది.
యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్ కి చెందిన ఆరోగ్య, భద్రత రంగాలు (అంటే, (ఎ) వాటర్ ప్యూరిఫైయర్‌ల వ్యాపారం, (బి) ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, (సి) సెక్యూరిటీ సొల్యూషన్స్, (డి) వాక్యూమ్ క్లీనర్‌లు మరియు (ఇ) విద్యుత్ గాలి శుభ్రపరిచే వ్యవస్థలు) నిర్వహణను ఎఫ్ఈఎస్ఎల్ స్వాధీనం చేసుకుంటుంది.
ప్రతిపాదిత కలయిక ఒక విధంగా వ్యాపార సముపార్జన కింద ఉండి కాంపిటీషన్ చట్టం 2002 లోని సెక్షన్ 5(ఎ) పరిధిలోకి వస్తుంది.
ఎల్ఎల్
అల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ (సైప్రస్) పీసీసీ లిమిటెడ్ (అల్ గ్లోబల్) స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఎల్ఎల్ ఏర్పాటు అయ్యింది. ఆసియాలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ పెట్టుబడులను అల్ గ్లోబల్ నిర్వహిస్తోంది.
ఎఫ్ఈఎస్ఎల్
యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ప్రస్తుతం ఎఫ్ఈఎస్ఎల్ పనిచేస్తోంది.
సవివరణ సీసీఐ ఉత్తర్వులు త్వరలో జారీ అవుతాయి.
***
(రిలీజ్ ఐడి: 1783846)
సందర్శకుల సూచీ సంఖ్య : : 175