ఆయుష్
azadi ka amrit mahotsav

మహిమాన్విత ఔషధాలుగా మూలికా ఔషధాలను ప్రకటించుకోవడం..

Posted On: 17 DEC 2021 4:06PM by PIB Hyderabad

ఆయుర్వేదం, యునాని, సిద్ధ  హోమియోపతి (ఏఎస్యూ&హెచ్) మందులు, చికిత్సలు  సంబంధిత సేవలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గమనించింది.

 

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954  దాని కింద ఉన్న రూల్స్.. ఆయుష్ మందులతో సహా ఔషధాలు  ఔషధ పదార్ధాల  అతిశయోక్తి ప్రకటనల నిషేధానికి సంబంధించిన నిబంధనల గురించి వివరిస్తాయి.  డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940  రూల్స్ 1945  డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం చట్ట నిబంధనల ప్రకారం నిబంధనలను అమలు చేసే అధికారాలను కలిగి ఉంటుంది. తదనుగుణంగా, తప్పుదారి పట్టించే లేదా అక్రమ ప్రకటనలకు సంబంధించిన ఏదైనా రికార్డును నమోదు చేయడానికి, ఏదైనా ప్రాంతంలో శోధించడానికి లేదా పరిశీలించడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి  నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవడానికి అధికారులను నియమించవచ్చు. ఇందుకోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏఎస్యూ&హెచ్ డ్రగ్స్  ఫార్మాకోవిజిలెన్స్  సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ను అమలు చేస్తోంది, ఇది వినియోగదారులతో పాటు ఏఎస్యూ&హెచ్ ప్రాక్టీషనర్లలో రిపోర్టింగ్ సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తోంది.  ప్రతికూల ఔషధ, ప్రతిచర్యలను పర్యవేక్షించడం  నివేదించడంతోపాటు; ప్రస్తుత ఫార్మాకోవిజిలెన్స్ పథకం నియంత్రణ చర్యల కోసం ఏఎస్యూ&హెచ్ ఔషధాల అక్రమ ప్రకటనలపై నిఘా వేసింది.  నివేదికలను కూడా తయారుచేస్తోంది. ఆగస్ట్ 2018 నుండి జూన్ 2021 వరకు, 14876 ఏఎస్యూ&హెచ్ ఔషధాల అక్రమ ప్రకటనలు ఫార్మాకోవిజిలెన్స్ కేంద్రాలు నిషేధించాయి. సంబంధిత వివరాలను ఆయా రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు, మీడియా ఛానెల్స్, తయారీదారులకు తెలియజేయడం జరిగింది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ, తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా ఫిర్యాదు (జీఏఎంఏ) పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను నిర్వహిస్తున్నది. ఎవరైనా తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించి తమ ఫిర్యాదులను దీని ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ క్రింద నమోదైన ఆయుష్ ఉత్పత్తులు  సేవలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ  అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమితుడయ్యారు. ఏప్రిల్, 2015 నుండి జనవరి, 2018 వరకు ఆయుష్ (హెర్బల్‌తో సహా) ఉత్పత్తులు  సేవలకు సంబంధించిన 809 ఫిర్యాదులు పోర్టల్‌లో నమోదు అయ్యాయి. పరిష్కరించబడిన మొత్తం ఫిర్యాదులు దాదాపు 274 వరకు ఉన్నాయి. కాగా,  585 ఫిర్యాదులను ఆయుష్మంత్రిత్వ శాఖ.. తగిన చర్య తీసుకోవడానికి సంబంధిత రాష్ట్ర అధికార యంత్రాంగానికి పంపింది. జీఏఎంఏ పోర్టల్‌లో 2019-–20 సంవత్సరంలో దాదాపు 268 ప్రకటనలు,  2020–-21 సంవత్సరంలో 339 ప్రకటనలను  తప్పుదారి పట్టించే ప్రకటనలుగా గుర్తించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం తగిన చర్య తీసుకోవాలని కోరుతూ సంబంధిత రాష్ట్రాల లైసెన్సింగ్ అధికారులకు బదిలీ చేశారు.

అంతేగాక 2017–-18,  2018-–19 సంవత్సరాల్లో, ఏఎస్యూ&హెచ్ ఔషధాలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనల  వాస్తవికతను నిర్ధారించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అటువంటి ప్రకటనలను సొంతగా పర్యవేక్షించడం కోసం అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఏఐ)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రింట్,  ఎలక్ట్రానిక్ మీడియాలో  ఫిర్యాదులను పరిష్కరించడానికి, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై అవసరమైన చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది.

ప్రజా ప్రయోజనాల కోసం ఆయుర్వేద,  ఇతర ఔషధాల విక్రయాల కోసం అనుచితమైన ప్రకటనలను ప్రచురించడాన్ని నిరోధించడానికి మీడియా నియంత్రణాధికారులను కూడా సంప్రదించారు.  డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954  దానిలోని నిబంధనలకు విరుద్ధంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించడం  ప్రసారం చేయకుండా చూడాలని కేంద్రం సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని మీడియా చానెల్‌లకు సూచనలు/మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏఎస్యూ అండ్ హెచ్ డ్రగ్స్  ప్రకటనల్లో ప్రభుత్వ శాఖలు లేదా సంస్థల పేరును ఉపయోగించకూడదని ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఔషధ తయారీదారులకు,  ప్రకటనల ఏజెన్సీలకు 31.08.2018 తేదీన ఒక సలహాను జారీ చేసింది. అలాగే, ఏఎస్యూ అండ్ హెచ్ డ్రగ్స్ సంబంధించిన నకిలీ కాల్స్, ప్రకటనల బారిన పడకుండా సాధారణ ప్రజల కోసం ప్రముఖ వార్తాపత్రికలలో నవంబర్ 2018లో హెచ్చరికను ఇవ్వడం జరిగింది. దీంతో ప్రకటనదారులు అక్రమ ప్రకటనలను ఉపసంహరించుకున్నారు లేదా మార్చారు. ఈ విషయాన్ని ఆయుష్ శాఖ మంత్రి  శర్బానంద సోనోవాల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

***


(Release ID: 1783190) Visitor Counter : 160


Read this release in: English , Urdu