శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యువశాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు ప్రోత్సహించేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర ప్రసాద్ సింగ్
రెగ్యులర్ సర్వీసులో లేని శాస్త్రవేత్తలకు నెలకు రూ 31,000 నుంచి రూ 1,35,000 వరకు సరళతర ఆర్ధిక మద్దతుతో కూడిన ఫెలోషిప్‌లు మంజూరు .
Posted On:
15 DEC 2021 4:33PM by PIB Hyderabad
యువశాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కేంద్ర శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వశాఖ సహాయమంత్రి (స్వతంత్ర చార్జి), భూ విజ్ఞాన శాస్త్ర సహాయమంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ డాక్టర్ జితేంద్రసింగ్ , 2018-19,2019-20,2020-21 , ప్రస్తుత సంవత్సరంలో యువ శాస్త్రవేత్తల పరిశోధన కార్యక్రమాలకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ కింద వరుసగా రూ 1001.9 కోట్లు, రూ 1113.1 కోట్లు, రూ 1056.6 కోట్లు, రూ 724.7 కోట్లు గా తెలిపారు. సరళతర ఆర్దిక మద్దతు కింద ఈ ఫెలోషిప్ ఆఫర్ రెగ్యులర్ సర్వీసులో లేని వారికి , వారి అర్హతలు , పథకం స్వభావాన్ని బట్టి నెలకు రూ 31,000 కోట్లరూపాయల నుంచి రు 1,35,000 వరకు ఉన్నట్టు తెలిపారు.
శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ యువశాస్త్రవేత్తల కోసం అమలు చేస్తున్న ప్రముఖ కార్యక్రమాలలో ఇన్నొవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్‌స్పైర్‌డ్ రిసెర్చ్ (INSPIRE) ఫెలోషిప్, ఇన్ స్పైర్ ఫాకల్టీ ఫెలోషిప్ ఆఫ్ డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్ి), నేషనల్ సోస్ట్ డాక్టొరల్ ఫెలొషిప్ (N-PDF),
సైన్స్ ఇంజనీరింగ్ రిసెర్చ్ బోర్డుకు చెందిన స్టార్టప్ రిసెర్చ్ గ్రాంట్ ( ఎస్ ఆర్‌జి), కౌన్సల్ ఆఫ్ సైంటిఫిక్ , ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ ఐఆర్) , డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలీ (డిపిటి) కు చెందిన రిసెర్చ్ ఫెలో షిప్ పథకం, రిసెర్చ్ అసోసియేట్ షిప్, ఆర్ అండ్ డి ప్రాజెక్టు ఆధారిత ప్రాజెక్ట్ అసొసియేట్స్, డిబిటికి చెందిన హర గోవింద్ ఖురానా ఇన్నొవేటివ్ యంట్ బయోటెక్నాలజిస్ట్ అవార్డ్ ఇందులో ఉన్నాయి.
యువశాస్త్రవేత్తల పరిశోధనలకు సులభతర రీతిలో నిధుల మంజూరు, సత్వర విడుదల, ఆకర్షణీయ ఫెలోషిప్‌లు, అత్యుత్తమ పరిశోధనలకు అనువైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచడం, విజ్ఞాన భాండాగారం అందుబాటు, తగిన గుర్తింపు, మెంటారింగ్ సదుపాయం, వంటివి యువ శాస్త్రవేత్తల పరిశోధన ప్రోత్సామక కార్యక్రమాలలో ముఖ్యాంశాలు. ఈ పథకాల కింద యువ శాస్త్రవేత్తలను గుర్తించి వారికి తగినశిక్షణ పరిశోధన సదుపాయాలను , సైన్స్ టెక్నాలజీలోని కీలక రంగాలలో అందుబాటులోకి తెచ్చే విధంగా వీటిని రూపకల్పన చేశారు. ఈ పథకాలు స్వతంత్ర పరిశోధనలకు కూడా వేదికగా ఉపయోగపడతాయి. దేశ ప్రయోజనాలకు సవాళ్లతో కూడిన పరిశోధనలు చేపట్టేందుకు ఇవి వీలు కల్పిస్తాయి.
***
(Release ID: 1783005)
Visitor Counter : 163