వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2030 నాటికి సేవలు , సరుకుల ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల డాలర్లు సాధించడం సాధ్యం - శ్రీ పీయూష్ గోయల్


"గొప్పగా ఆలోచించండి" భారతీయ పరిశ్రమలతో శ్రీ పీయూష్ గోయల్ రాబోయే 25 సంవత్సరాల ప్రణాళిక రూపొందించడంలో సహాయపడాలని ఫిక్కీ వంటి పరిశ్రమల సంస్థలకు విన్నపం

మహమ్మారి కాలానికి ఎదురు నిలబడిన భారతీయ పరిశ్రమలు - శ్రీ పీయూష్ గోయల్

పరిశ్రమలకు దన్నుగా ఉంటూ ఉత్ప్రేరకంగా , సంధాతగా, భాగస్వామిగా వ్యవహరించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉంది - శ్రీ పీయూష్ గోయల్

సాంప్రదాయ ఆలోచన అడ్డంకులను విచ్ఛిన్నం చేయాలని వ్యాపారవర్గాలకు పిలుపు

Posted On: 17 DEC 2021 4:36PM by PIB Hyderabad

వాణిజ్యం , పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజాపంపిణీ , జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్‌గోయల్ భారతీయ పరిశ్రమ పురోగమన  లక్ష్యాలను భారతదేశం వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోనున్న 2047 నాటికి సాకారం అయ్యేట్టు  నిర్దేశించుకోవాలని, పరివర్తనాత్మక మార్పులను సాధించాలనే లక్ష్యంతో  పనిచేయాలని  ఈరోజు కోరారు.

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 94వ వార్షిక సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు.

మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్లు , అనిశ్చితి నేపథ్యంలో దుబాయ్ ఎక్స్‌పోలో భారత వాణిజ్య ప్రదర్శనా ప్రాంగణాన్ని  సాకారం చేసినందుకు  మంత్రి ఫిక్కీకి తన అభినందనలు తెలియజేశారు. దుబాయ్ ఎక్స్‌పోలో అత్యధికంగా సందర్శించిన , ప్రశంసించిన వేదికలలో భారతీయ వాణిజ్య ప్రాంగణం  ఒకటి.

 

దుబాయ్ ప్రయోగాన్ని ధిల్లీ  ప్రగతిమైదాన్‌లో పునరావృతం చేయాలని, తద్వారా దేశం నలుమూలల నుండి ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు , యువకులు మన దేశ పురోగతి , విజయాలను సందర్శించడానికి, అన్వేషించడానికి , గర్వపడటానికి అవకాశం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మహమ్మారి సమయంలో భారతీయ పరిశ్రమలు ఎదుర్కొన్న సవాళ్లపై దృష్టి సారించిన శ్రీ గోయల్, పరిశ్రమల రంగం మెరుగ్గా  కోలుకుందనీ , వేగవంతమైన అభివృద్ధికి సిద్ధంగా ఉందని చెప్పారు. సేవల ఎగుమతిలో సాధించిన వృద్ధిని ప్రస్తావించిన  మంత్రి, $400 బిలియన్ల ( నలభైవేల కోట్ల ) విలువ కలిగిన సరుకుల ఎగుమతి లక్ష్యం  వాస్తవం  కాబోతుందని అన్నారు.

 

ప్రభుత్వం, పరిశ్రమలు సమష్టిగా పనిచేసి మన లక్ష్యాలన్నింటినీ ఆచరణ సాధ్యం చేసినట్లయితే, లక్ష కోట్ల (ట్రిలియన్) డాలర్ల సేవలు , సరుకులను 2030 నాటికి ఎగుమతి చేయాలనే ఆశయంతో విజయాలు సాధించాలన్నదే  ఈ సంక్షోభం నుంచి నేర్చుకున్న పాఠమని మంత్రి అన్నారు. మనం  దానిని కూడా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు.

సంస్థాగత మార్పులతో పురోగతి సాధ్యమని  ప్రభుత్వం అనుకోవడంలేదని, ప్రతి అవకాశాన్ని పరిశుభ్రత, పారిశుధ్యం, వంటగ్యాస్ కనెక్షన్ లేదా విద్యుత్తు లేదా ఆరోగ్య సంరక్షణ వంటివి ఏవైనా కానీ విజయవంతంగా అందించడానికి  కృషి చేసిందని మంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానం సహాయంతో  పద్ధతి ప్రకారం అందరికీ నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే దృక్పథంతో ఆరోగ్య రక్షణను ప్రాధాన్యతగా  తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

 

జీవన సౌలభ్యం , వ్యాపార సౌలభ్యాల్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, ఒక సంవత్సరంలో 22,000 ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను నివారించామని, మరిన్ని విజయాలు  సాధించడానికి మార్గాన్వేషణ చేస్తున్నామని చెప్పారు.

 

ప్రపంచం భారతదేశాన్ని విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని, ముఖ్యంగా మహమ్మారి సమయంలో మనం  ప్రదర్శించిన దృక్పథం  కారణంగా వ్యాపారం, పరిశ్రమలు నిర్దేశించుకున్న అంతర్జాతీయ అంచనాలను అందుకున్నది సమిష్టి  నిబద్ధత వల్లనే అని మంత్రి అన్నారు. కోవిడ్ కాలంలో భారతీయ పరిశ్రమ సవాళ్లను స్వీకరిస్తూ  ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శించింది ,  అందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి అని మంత్రి పేర్కొన్నారు.

 

శ్రీ గోయల్  ప్రధాన మంత్రి వ్యాఖ్యానాన్ని  గుర్తుచేస్తూ ,  మనకు శతకోటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి శతకోటి మనస్సులు ఉన్నాయని అన్నారు.   అత్యున్నత స్థాయి సమగ్రత, కనీస ప్రభుత్వం-గరిష్ట పాలన, జీవన సౌలభ్యం, సులభ వ్యాపార మార్గాలు  మొదలైన వాటిపై దృష్టి సారిస్తూ ప్రచారం చేయడానికి , ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న గొప్ప ఆదర్శ పాలన  భారతదేశానిది అని ఆయన అన్నారు.

 

కొత్త ఆలోచనలు వినడానికి,  వాటిని ప్రతి స్థాయిలో పరిశ్రమలతో పరస్పరం పంచుకోవడానికి , దోహదకారిగా, ఉత్ప్రేరకంగా , భాగస్వామిగా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు.

 

వ్యాపారం , పరిశ్రమలను ప్రోత్సహించడానికి వాణిజ్యం , పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలను వివరిస్తూ, కీలకమైన విధాన నిర్ణయాల నుండి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ  పథకాల వరకు సెమీ కండక్టర్ పరిశ్రమకు ఇటీవల ప్రకటించిన భారీ ప్యాకేజీ వరకు ప్రస్తావిస్తూ , కొత్త అవకాశాలను తీవ్రంగా అన్వేషిస్తున్నట్లు శ్రీ పీయూష్‌గోయల్ చెప్పారు.

 

అమలులో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల  గురించి మంత్రి ప్రస్తావిస్తూ, అరబ్ దేశాలు, కెనడా, ఇంగ్లాండులతో వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎలు) త్వరలో జరగబోతున్నాయని, యురోపియన్ కూటమి  , ఇజ్రాయెల్‌తో ఒప్పందం  ఇప్పటికే ప్రారంభించబడిందని మంత్రి చెప్పారు. ఆ దిశగా భారత్‌తో చర్చలు ప్రారంభించడానికి గల్ఫ్ సహకార సమితిలోని  దేశాలు సైతం  ఆసక్తి వ్యక్తం చేశాయని ఆయన తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  ఎఫ్‌టిఎతో పాటు, సరసమైన ధరలకు వాణిజ్య సముదాయాలు , గిడ్డంగులతో కూడిన ఇండియా మార్ట్‌ ను దుబాయ్‌లో ఏర్పాటు చేయడం వంటి ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు శ్రీ గోయల్ చెప్పారు.

 

ప్రపంచ మార్కెట్‌లో భారతీయ వస్త్రాలకు, ముఖ్యంగా నాణ్యమైన   చేనేత వస్త్ర వాణిజ్యానికి  ఉన్న అపారమైన అవకాశాన్ని ఎత్తి చూపుతూ   శ్రీ గోయల్ వస్త్ర  పరిశ్రమ వాటాదారులను పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కోరారు. వ్యాపారాలు, పరిశ్రమలు గతకాలపు  ఆంక్షల బారినపడకుండా  పనిచేయాలని, సంప్రదాయ ఆలోచనల అడ్డంకులను ఛేదించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు

***



(Release ID: 1782997) Visitor Counter : 124


Read this release in: English , Hindi