ఆయుష్
azadi ka amrit mahotsav

సంప్రదాయ ఔషధాల పరిశోధన -అభివృద్ధి

Posted On: 17 DEC 2021 4:04PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం వైద్య రంగంలో దేశం కోసం దేశాలతో 25 అవగాహనా ఒప్పందాల (ఎమ్ఒయు) పై సంతకం చేసింది.  నేపాల్, బంగ్లాదేశ్, హంగరీ, ట్రినిడాడ్ & టొబాగో, మలేషియా, మారిషస్, మంగోలియా, తుర్క్మెనిస్తాన్, మయన్మార్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జర్మనీ, ఇరాన్, సావో టోమ్ అండ్

ప్రిన్సిప్ , ఈక్వటోరియల్ గినియా, క్యూబా, కొలంబియా, జపాన్, బొలీవియా, గాంబియా, రిపబ్లిక్ ఆఫ్ గినియా, చైనా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, సురినామ్, బ్రెజిల్ జింబాబ్వే దేశాలతో ఈ అవగాహనా ఒప్పందాలు చేసుకుంది.

 

అలాగే, యుఎస్ఎ, జర్మనీ, యుకె, కెనడా, మలేషియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, తజికిస్తాన్, సౌదీ అరేబియా, ఈక్వెడార్, జపాన్, ఇండోనేషియా, రీయూనియన్ ద్వీపం, కొరియా, హంగరీ లకు చెందిన  33 విదేశ సంస్థలు/విశ్వవిద్యాలయాలు/సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. హంగరీ, లాట్వియా, మారిషస్, బంగ్లాదేశ్, రష్యా, వెస్టిండీస్, థాయ్ లాండ్, ఇండోనేషియా, స్లోవేనియా, ఆర్మేనియా, అర్జెంటీనా, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి విదేశీ సంస్థలు/విశ్వవిద్యాలయాలతో  సంప్రదాయ వైద్య సమిష్టి  పరిశోధన , అభివృద్ధికి 33 ఎం ఓ యు లు చేసుకుంది. ఇంకా హంగరీ, లాట్వియా, మారిషస్, బంగ్లాదేశ్, రష్యా, వెస్టిండీస్, థాయ్ లాండ్, ఇండోనేషియా, స్లోవేనియా, ఆర్మేనియా, అర్జెంటీనా, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కు చెందిన విదేశీ సంస్థలు/విశ్వవిద్యాలయాల్లో ఆయుష్ అకడమిక్ చైర్స్ ఏర్పాటు కు 14 ఎంఒయులపై సంతకాలు జరిగాయి.

 

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ భాగమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్-ఐహెచ్ బిటి), పాలంపూర్, ఔషధ మొక్కలు, బయోయాక్టివ్ అణువులు, మూలికా ఫార్ములేషన్ లు మొదలైన పరస్పర ఆసక్తి రంగాలలో సహకరించడానికి నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైనీస్ మెడిసిన్, ఆరోగ్య ,సంక్షేమ మంత్రిత్వ శాఖ, తైవాన్ తో ఒక ఎమ్ఒయుపై సంతకం చేసింది. సిఎస్ఐఆర్ , బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ భారతదేశం లోపల ,వెలుపల ఉన్న పరిశోధకుల మధ్య శాస్త్రీయ ,సాంకేతిక పరిశోధనఅవకాశాలను గుర్తించడానికి ఒక ఎమ్ఒయుపై సంతకం చేశాయి,

సాంప్రదాయ ఔషధం (ఆయుష్) కు మాత్రమే  పరిమితం కాకుండా, వ్యాధి/ఆరోగ్య ప్రాధాన్యతలకు సంబంధించిన నిర్దిష్ట అనువర్తనాల ద్వారా మార్గనిర్దేశం కలిగిన అంశాలలో ఫౌండేషన్-నిధుల సంస్థలతో సహకారం కూడా ఈ ఎం ఓ యు లలో భాగం.

 

ఆయుష్ లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం కోసం కేంద్ర రంగ పథకం (ఐ సి స్కీమ్) కింద, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ ఔషధ తయారీదారులు, వ్యవస్థాపకులు, ఆయుష్ సంస్థలు ఆసుపత్రులు మొదలైన వాటికి మద్దతు ఇస్తుంది. అంతర్జాతీయ ఎగ్జిబిషన్ లు, ట్రేడ్ ఫెయిర్ లు, రోడ్ షోలు మొదలైనవాటిలో పాల్గొనడం ద్వారా ఆయుష్ అంతర్జాతీయ వ్యాప్తి కోసం వారి ఉత్పత్తులు , సేవలను ప్రదర్శించడానికి మద్దతు ఇస్తుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఔషధి గున్‌వట్టా ఏవం ఉత్పాదన్ సంవర్ధన్ యోజన (AOGUSY) 15వ ఫైనాన్స్ సైకిల్ (2021-22 నుండి 2025-26 వరకు) కేంద్ర సెక్టార్ ఇనిషియేటివ్ స్కీమ్‌లను విలీనం చేయడం ద్వారా ప్రారంభించబడింది. సెంట్రల్ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఆయుష్, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఎ ఎస్ యు & హెచ్ ఔషధాల నాణ్యత నియంత్రణ {జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్ ఎ ఎం ) యొక్క భాగం} ప్రామాణీకరణను సులభతరం చేయడానికి కొన్ని కొత్త అంశాలను చేర్చడం, నియమాలు/ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం, తయారీ ,విశ్లేషణాత్మక పరీక్షల కోసం సాంకేతికత అప్-గ్రేడేషన్, ధృవీకరణ/అక్రిడిటేషన్, ఆయుష్ ఔషధాల నాణ్యత హామీ కోసం ఉద్దేశించిన శిక్షణ, సామర్థ్య నిర్మాణ కార్యకలాపాలు దీని

పరిధిలో ఉన్నాయి. ఆయుష్ తో సహా తయారీ,  సేవా రంగం కింద ప్రయోజనాలను పొందడానికి భారత ప్రభుత్వ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ ఎంఈ) మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఇజిపి) పరిశ్రమకు అందుబాటులో ఉంది.ఆయుష్ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం) ఆధ్వర్యంలో మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ (సిపిఎస్ ఇ) అయిన ఇండియన్ మెడిసిన్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఎమ్ పిసిఎల్) భారతదేశంలో ఆయుర్వేద యునానీ ఔషధాల ను  తయారీ చేస్తోంది.

 

ఆయుర్వేద, యునానీ, సిద్ధ ఎన్ సి ఐ ఎస్ ఎం చట్టం కింద గుర్తించబడ్డాయి.  భారతదేశం అంతటా ఆచరణలో ఉన్నాయి.

 

ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు లోక్ సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని ఇచ్చారు.

 

***


(Release ID: 1782981)
Read this release in: English , Urdu