రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోడ్డు ప్రాజెక్టుల కోసం భూసేకరణ

Posted On: 16 DEC 2021 2:38PM by PIB Hyderabad

విలువ ఆధారిత ఆర్థిక నమూనా(VCF)  కేవలం జాతీయ రహదారులు, ఉపమార్గాలు  (బైపాస్) లేదా రింగ్ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ కోసం మాత్రమే ఉపయోగించరు. అయితే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తన 18.03.2021 నాటి సర్క్యులర్ ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర పాలిత ప్రాంతం తో పంచుకునే ఉద్దేశ్యంతో జాతీయ రహదారుల అభివృద్ధికై  వాల్యూ క్యాప్చర్ ఫైనాన్స్ (VCF) మోడల్‌కు సంబంధించి ఒక విధాన నిర్ణయాన్ని  జారీ చేసింది. VCF పాలసీ ముఖ్యమైన లక్షణాలు/వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

i. రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం ద్వారా ప్రాజెక్ట్ ఏర్పాటు ;

ii. భూమి ఇవ్వడం  ద్వారా సహకారం;

iii. రాయల్టీ/పన్నుల మాఫీ/వాపసు చేయడం మొదలైనవి.

iv. ప్రాజెక్ట్ ప్రభావ ప్రాంతాల్లో పెరిగిన  భూమి విలువను పంచుకోవడం;

v. ప్రాజెక్ట్ ప్రభావ ప్రాంతంలో నివాస/వాణిజ్య రియల్ ఎస్టేట్ అభివృద్ధి అవకాశాన్ని అన్వేషించడం, దీని కోసం జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ -NHAI ద్వారా హైవే/సర్వీస్ రోడ్డుల అనుసంధానం చేయవచ్చు.

ఇంకా, రోడ్ల నగదీకరణ  ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి, నిర్వహణ, జాతీయ రహదారుల (NHల) నిర్వహణ, రుణాల చెల్లింపు మొదలైన వాటికి వినియోగిస్తారు.

VCF మోడల్‌లో పాల్గొనడానికి అంగీకరించిన కర్ణాటకతో సహా రాష్ట్ర ప్రభుత్వాల వివరాలు అనుబంధంలో ఉన్నాయి.

రహదారి ప్రాజెక్టుల కోసం భూసేకరణ సంబంధించిన అనుబంధం

 

 

రాష్ట్ర ప్రభుత్వం

విలువ ఆధారిత ఆర్థిక నమూనా(VCF) వివరాలు

కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం GST/రాయల్టీని మినహాయించకుండా 30% భూ సేకరణ (LA) ఖర్చు వాటా  సమ్మతి పొందబడింది, "ఈ రహదారి అభివృద్ధి తర్వాత సేకరించిన టోల్ ఆదాయం నుండి రాష్ట్ర వాటా తిరిగి చెల్లిస్తారు" అనే షరతుకు లోబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 30% ఆదాయాన్ని తిరిగి  చెల్లించనవసరం లేదు  అనే  షరతుతో NHAI ఈ అంశానికి అంగీకరించింది.

ప్రభుత్వం ద్వారా 50 % భూ సేకరణ ఖర్చు భాగస్వామ్యం అన్ని స్వతంత్ర రింగ్ రోడ్లు / బైపాస్‌ల కోసం కర్ణాటక (GoK). (STRR, మంగళూరు, కుంటా, తుమకూరు బైపాస్ / రింగ్ రోడ్). LA ఖర్చు రూ.140 కోట్లు భరించేందుకు సమ్మతి. (50%) బెలగావి, తుమకూరు బైపాస్ కోసం కర్నాటక ప్రభుత్వ  వాటాగా 200 కోట్లు  (25%) ప్రభుత్వం నుంచి స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు NHAI అంగీకరించింది. బెలగావి & తుమకూరు బైపాస్ కోసం పునరావాసం భూసేకరణ వాస్తవ వ్యయం 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలనే షరతుకు లోబడి ఉంటుంది.

కేరళ

NH-66, 85, 966, SH1 మరియు  నౌకాశ్రయ అనుసంధాన ప్రాజెక్ట్‌ ల విస్తరణ కోసం 25 % భూసేకరణ ఖర్చును పంచుకోవడం. తిరువంతపురం ఔటర్ రింగ్ రోడ్డు కోసం 50% ఖర్చు పంపకం.

తమిళనాడు

చెన్నై పోర్ట్ నుండి మధురవాయల్ వరకు 4 లేన్ ఎలివేటెడ్ హైవేలు. భూసేకరణ మరియు ఆర్ అండ్ ఆర్ కోసం ఖర్చు రూ. 470 కోట్లుగా  అంచనా వేశారు. మొత్తంలో సగం  రూ. 235 కోట్లను చెన్నై పోర్ట్ ట్రస్ట్ పంచుకుంటుంది రూ. 235 కోట్లు తమిళనాడు ప్రభుత్వం పంచుకుంటుంది. ఇంకా, భూసేకరణ పునరావాసం వంటి     అన్ని ఇతర అదనపు ఖర్చులు తమిళనాడు ప్రభుత్వం భరిస్తుంది.

పంజాబ్

లూథియానాలో లాడోవల్ బైపాస్ కోసం భూసేకరణ ఖర్చులో 50%.

మధ్య ప్రదేశ్

రాష్ట్ర ప్రభుత్వం చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే 309 కిలోమీటర్ల  కోసం 292 హెక్టార్ల భూమిని అందించింది.

హైవే నిర్మాణం కోసం ముర్రం, మట్టి రాయల్టీపై సడలింపు. రాష్ట్ర ప్రభుత్వం చంబల్ ఎక్స్‌ప్రెస్‌వే 309కిమీ కోసం 292 హెక్టార్ల భూమిని అందించింది.

హైవే నిర్మాణం కోసం ముర్రం, మట్టి  రాయల్టీపై సడలింపు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని NHAI ప్రాజెక్ట్‌ ల యుటిలిటీ షిఫ్టింగ్ పనుల కోసం చేసిన వాస్తవ పని ప్రకారం పర్యవేక్షణ ఛార్జీలు చెల్లించాలి.  11.5%  బదులుగా 7.5%  చెల్లించాల్సి   ఉంటుంది.

 

హిమాచల్ ప్రదేశ్

పింజోర్‌బడ్డీ నలగఢ్ ప్రాజెక్ట్‌ లోని హిమాచల్ విభాగానికి అదనపు భూసేకరణ ఖర్చు (రూ. 15.19 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.

ఉత్తర ప్రదేశ్

భూమిపై 2.5% పన్ను రద్దు చేశారు. సిమెంట్, స్టీల్ మొదలైన వాటి మొత్తం రాయల్టీ/GSTని మాఫీ చేయడం పై చర్చ జరుగుతోంది.

ఢిల్లీ అభివృద్ధి సంస్థ

UER-II (NH-344 M, NH-344 P & NH-344 N) నిధులు రూ. 3600 కోట్లు దీని ప్రకారం, ఆర్థిక ఒప్పందంపై NHAI మరియు DDA సంతకం చేశాయి.

బీహార్

పాట్నా రింగ్ రోడ్ ఫేజ్-I (సుమారు పొడవు 60 కి.మీ) నిర్మాణం కోసం 100% భూ సేకరణ ఖర్చు.

తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం చుట్టూ ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ చేయాలి. పూర్వ నిర్మాణ వ్యయం లో 50% భరించాలి.

ఒడిశా

భువనేశ్వర్ కటక్ బైపాస్ కోసం భూసేకరణ ఖర్చులో 50%

 

 

ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 1782450) Visitor Counter : 287
Read this release in: Tamil , English