రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
'సేతు భారతం' కార్యక్రమం
Posted On:
16 DEC 2021 2:46PM by PIB Hyderabad
జాతీయ రహదారులపై రైల్వే క్రాసింగ్ స్థానంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు) /రోడ్డు అండర్ బ్రిడ్జిల(ఆర్‌యుబీలు) నిర్మాణానికి ప్రభుత్వం 'సేతు భారతం' కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ రహదారులపై ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు) /రోడ్ అండర్ బ్రిడ్జిల(ఆర్‌యుబీలు) నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. దీనిని ప్రభుత్వ రంగంలో నిర్మాణ సంస్థలైన పీడబ్ల్యుడీ, ఎన్‌హెచ్ఏఐ,
ఎన్‌హెచ్ఐడీసీఎల్ వంటి వివిధ సంస్థల ద్వారా చేపడుతుంది. ఇతర జాతీయ రహదారుల ప్రాజెక్టుల మాదిరిగానే రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీల) /రోడ్ అండర్ బ్రిడ్జిల(ఆర్‌యుబీల) నిర్మాణానికి నిధులు అందించడం జరుగుతుంది. సేతు భారతం కార్యక్రమం కింద ఇప్పటి వరకు దాదాపుగా నూటా ఇరవై మూడు (123) రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు) /రోడ్డు అండర్ బ్రిడ్జిల (ఆర్‌యుబీలు) నిర్మాణ పనులకు పరిపాలనాపరమైన ఆమోదం, మరియు ఆర్థిక అనుమతులు లభించాయి. రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు) /రోడ్డు అండర్ బ్రిడ్జిల(ఆర్‌యుబీలు) కొన్నిసార్లు స్వతంత్ర ప్రాజెక్టులుగా, మరికొన్నిసార్లు జాతీయ రహదారి యొక్క ఒక విభాగానికి అనుబంధంగా మెరుగుదల ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించబడతాయి. ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.
(Release ID: 1782437)
Visitor Counter : 138