ఉక్కు మంత్రిత్వ శాఖ
స్టీలు ఉత్పత్తి పెంపునకు పిఎల్ఐ పథకం
నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2021 3:16PM by PIB Hyderabad
స్పెషాలిటీ స్టీలుకు సంబంధించి 5 స్థూల ఉత్పత్తి కేటగిరీలలో రూ 6,322 కోట్ల రూపాయలను రాగల 5 సంవత్సరాలలో విడుదలకు ,ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం (పిఎల్ఐ) కి సంబంధించిన సవివరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం 2021 అక్టోబర్ 20 న విడుదల చేసింది.
ఈ పథకం కంపెనీల చట్టం 2013 కింద రిజిస్టర్ అయిన కంపెనీలకు వర్తిస్తుంది.
ఈ పథకం కంపెనీల చట్టం, 2013 కింద నమోదైన కంపెనీలకు ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహాన్ని అందజేస్తుంది, ఇది మార్గదర్శకాలలో సూచించిన దరఖాస్తు ప్రక్రియ ద్వారా అర్హత కల్పిస్తుంది. ప్రతి ఉత్పత్తి ఉప-కేటగిరీకి నిర్దేశించిన విధంగా ఉత్పత్తి పెరుగుదల సాధించి, తయారీ రంగంలోని ఆ యా ఉత్పత్తుల ఉప కేటగరీ లో నూతన సామర్ధ్యం సృష్టించేందుకు కనీస నిర్దేశిత పెట్టుబడి పెట్టేవాటికి అర్హత కల్పిస్తుంది.
ఇందుకు సంబంధించి మంత్రిత్వశాఖ 2021 అక్టోబర్ 25న ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ఇందులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయ అన్ని దేశీయ స్టీలు ఉత్పత్తి కంపెనీలు పాల్గోన్నాయి. సెయిల్ తోపాటు వివిధ కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి వాణిజ్యపరమైన అంశాలు, మార్కెట్ తీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆసక్తిగల పార్టీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు వివిధ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని కేంద్ర స్టీలు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
(రిలీజ్ ఐడి: 1782256)
సందర్శకుల సూచీ సంఖ్య : : 141