గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) రోడ్ల నాణ్యత నియంత్రణ

Posted On: 15 DEC 2021 4:02PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కార్యక్రమ మార్గదర్శకాల ప్రకారం, రహదారి పనుల నాణ్యతను నిర్ధారించడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. నాణ్యత నియంత్రణపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సాధారణ మార్గదర్శకాలను జారీ చేసింది. అంతేకాకుండా పని స్థాయిలో నాణ్యత నియంత్రణ ప్రక్రియలను నియంత్రించడానికి గ్రామీణ రహదారుల కోసం నాణ్యత హామీ పై  హ్యాండ్‌బుక్‌ను సూచించింది.

పీఎంజీఎస్ వై కింద నాణ్యమైన రహదారి పనుల నిర్మాణం మరియు రహదారుల మన్నికను నిర్ధారించడానికి మూడు-అంచెల నాణ్యత నియంత్రణ యంత్రాంగం ఉంది. మొదటి శ్రేణి కింద.. ఫీల్డ్ లాబొరేటరీలో మెటీరియల్ మరియు పనితనంపై తప్పనిసరి పరీక్షల ద్వారా ప్రక్రియ నియంత్రణను నిర్ధారించడానికి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యూనిట్లు (పీఐయూలు) అవసరం. రెండవ శ్రేణి అనేది స్టేట్ క్వాలిటీ మానిటర్స్ (ఎస్ క్యూఎంఎస్) ల ద్వారా రాష్ట్ర స్థాయిలో నిర్మాణాత్మక స్వతంత్ర నాణ్యతను పర్యవేక్షించడం. ఇది ప్రతి పనిని ప్రారంభ దశ, మధ్య దశ మరియు నిర్మాణం యొక్క చివరి దశలో తనిఖీ చేయబడిందని నిర్ధారించడానికి. మూడవ శ్రేణి క్రింద.. నాణ్యతను పర్యవేక్షించడానికి మరియు క్షేత్రస్థాయి కార్యనిర్వాహకులకు మార్గదర్శకాలను అందించడానికి రహదారులు మరియు వంతెన పనుల యొక్క యాదృచ్ఛిక తనిఖీ కోసం కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర జాతీయ నాణ్యత మానిటర్‌లను (ఎన్ క్యూ ఎం)లు నియమించింది. దీనితో పాటుగా, మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ ప్రాంతీయ సమీక్షా సమావేశాలు మరియు ప్రీ-ఎంపవర్డ్/ఎంపవర్డ్ కమిటీ సమావేశాలలో నాణ్యత సమస్యలను కూడా రాష్ట్రాలతో వివరంగా సమీక్షిస్తారు.

ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ మరియు అకౌంటింగ్ సిస్టమ్ (ఓ ఎంఎంఏఎస్) అనే ఆన్‌లైన్ ప్రోగ్రామ్ మానిటరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ ప్రాతిపదికన మంజూరు చేయబడిన అన్ని పనుల అమలును పర్యవేక్షిస్తున్నారు.

క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (క్యూ ఎంఎస్) అప్లికేషన్ అనేది నాణ్యమైన మానిటరింగ్ అప్లికేషన్. దీనిని నేషనల్ క్వాలిటీ మానిటర్‌లు/స్టేట్ క్వాలిటీ మానిటర్‌లు తమ ఫీల్డ్ విజిట్ కోసం ఉపయోగిస్తారు. వారు నిర్వహించే అన్ని తనిఖీలు జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌లు మరియు నాణ్యత పర్యవేక్షణ పరిశీలనలను రికార్డ్ చేయడం ద్వారా ఈ యాప్ ద్వారా రికార్డ్ చేయబడతాయి. తర్వాత అవి ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ మరియు అకౌంటింగ్ సిస్టమ్ లో వాటంతటవే అప్‌లోడ్ చేయబడతాయి.

యూజర్ ఫ్రెండ్లీ మరియు పారదర్శకమైన సిటిజన్ ఫీడ్‌బ్యాక్ మరియు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కోసం ఇ-గవర్నెన్స్ మరియు డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో  20 జూలై, 2015న  "మేరీ సడక్" అనే మొబైల్ యాప్ప్రారంభించబడింది. పనుల్లో జాప్యం, పూర్తి చేయని, వదిలేసిన పీఎంజీఎస్ వై రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి పౌరులు ఈ అప్లికేషన్ ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు.  


పీఎంజీఎస్ వై మార్గదర్శకాల ప్రకారం...  పీఎంజీఎస్ వై కార్యక్రమం కింద నిర్మించిన రోడ్ల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. రోడ్ల నిర్మాణ పనులను ఒప్పుకున్న కాంట్రాక్టర్లకే రహదారుల ఐదేళ్ల నిర్వహణ బాధ్యత కూడా ఉంటుంది. రహదారుల నిర్మాణ పనుల వ్యయానికి సంబంధించిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించాలి. ఈ బడ్జెట్ ప్రత్యేక నిర్వహణ ఖాతాలో  రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధి ఏజెన్సీ(ఎస్ ఆర్ ఆర్ డీఏ)ల  వద్ద ఉంచబడతాయి. నిర్మాణానంతర నిర్వహణ యొక్క 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత, పీఎంజేఎస్ వై రోడ్లను ఎప్పటికప్పుడు నిర్వహణ చక్రం ప్రకారం పునరుద్ధరణతో సహా 5 సంవత్సరాల నిర్వహణతో కూడిన జోనల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్‌ల క్రింద ఉంచాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు సమకూరుస్తాయి.


పీఎంజేఎస్ వై ప్రోగ్రామ్ మార్గదర్శకాల ప్రకారం.. టెండర్ వేయడం, అమలు చేయడం మరియు నిర్ణీత ప్రమాణాలకు నిర్మాణ నాణ్యతను నిర్ధారించడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. పీఎంజేఎస్ వై పనులను అమలు చేయడానికి రాష్ట్రాలు అమలు చేసే ఏజెన్సీలు, పీఎంజేఎస్వై పనుల అమలులో డిఫాల్ట్ చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం/పెనాల్టీ విధించడం వంటివి రాష్ట్రాలకే అప్పగించారు.

ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

***



(Release ID: 1781971) Visitor Counter : 130


Read this release in: English