మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళలపై గృహ హింస
Posted On:
15 DEC 2021 2:38PM by PIB Hyderabad
నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సంకలనం చేసి క్రైమ్ ఇన్ ఇండియా అన్న తన ప్రచురణలో జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రచురిస్తుంది. గృహ హింస సహా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అత్యాచారాలు, నేరాల గురించిన డేటాను రాష్ట్రాల, వారీగా, సంవత్సరాల వారీగా నివేదికలో పొందుపరుస్తుంది. గృహ హింస నుంచి మహిళలను రక్షణ చట్టం, 2005 కింద 2016, 2017, 2018, 2019, 2020 సంవత్సరాలకు వరుసగా 437, 616, 579, 553, 446గా ఉన్నాయి. ఈ డేటా 2017 నుంచి 2020వరకు గృహ హింస కేసుల సంఖ్యలో తగ్గుదలను చూపుతుంది. పోలీసు, ప్రజా భద్రత అన్నవి భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు కింద రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. శాంతి భద్రతలు, పౌరుల ప్రాణాలను, ఆస్తులను పరిరక్షించడం సహా మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా జరిగే నేరాలను విచారించడం, దర్యాప్తు జరపడం అన్న అంశాల బాద్యత ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వాలది. చట్టంలోని ప్రస్తుత నిబంధనల ప్రకారం అటువంటి నేరాలను ఎదర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధంగా ఉంటాయి.
అయితే, కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధన్యతను ఇచ్చి పలు శాసన, ప్రణాళికా పూర్వక చొరవలను చేపట్టింది.
ఇందులో శిక్షాస్మృతి (సవరణ) చట్టం, 2018, శిక్షా స్మృతి (సవరణ) చట్టం, 2013, కార్యాలయంలో మహిళపై లైంగి వేధింపుల ( నివారణ, నిషేధం, పరిహార) చట్టం, 2013, గృహ హింస నుంచి మహిళ రక్షణ చట్టం, 2006, వరకట్న నిషేధ చట్టం, 1961, తదితర చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత‌్వం అమలు చేసే పథకాలు/ ప్రాజెక్టులలో వన్ స్టాప్ సెంటర్లు (ఒఎస్‌సిలు), మహిళల హెల్ప్‌లైన్‌ల సార్వత్రికీకరణ (డబ్ల్యుహెచ్ఎల్), అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ (ఇఆర్ఎస్ఎస్) ఉన్నాయి. ఇది అత్యవసర పరిస్థితులకు భారతదేశవ్యాప్తంగా (112), / మొబైల్ ఆప్ ఆధారిత వ్యవస్థ , అశ్లీల కంటెంట్‌పై ఫిర్యాదు చేసేందుకు సైబర్ - క్రైమ్ రిపోర్టంగ్ పోర్టల్, మౌలిక సదుపాయాలు, సాంకేతిక స్వీకరణ, సమాజంలో అవగాహనా కార్యక్రమాల ద్వారా సామర్ధ్య నిర్మాణం, దర్యాప్తు అధికారులకు, నేరవిచారణాధికారులకు, వైద్య అధికారులకు శిక్షణ, నైపుణ్యాల అభివృ్ధి కార్యక్రమాలు; రాష్ట్రాలు, యుటిలకు లైంగిక దాడి ఆధారాల సేకరణ (ఎస్ఎఇసి) కిట్లు, చండీగఢ్‌లో అత్యంత ఆధునిక డిఎన్ఎ ప్రయోగశాల సిఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలు బలోపేతం చేయడానికి 24 రాష్ట్రాలు, యుటిలకు సహాయం, అత్యాచారం, పిఎసిఎస్ ఒ చ ట్టం పరిధిలోకి వచ్చే కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్ టిఎస్‌సిల) ఏర్పాటు, దేశంలోని అన్ని జిల్లాలలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక యూనిట్లు (ఎహెచ్‌టియులు), పోలీసు స్టేషన్లలో మహిళల హెల్ప్ డెస్క్‌లను (డబ్ల్యుహెచ్‌డి) ఏర్పాటు చేయడం / బలోపేతం చేయడం సహా ఎనిమిది నగరాలలో (అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై) సేఫ్ సిటీ ప్రాజెక్టులు తదితరాలు ఉన్నాయి.
ఇందుకు అదనంగా, మహిళలు, పిల్లల భద్రత, పరిరక్షణకు సంబందించి ఎప్పటికప్పుడు మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేశాయి.
అదనంగా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తాను అమలు చేస్తున్న పథకాల కింద సంస్థలు అయిన వన్ స్టాప్ సెంటర్, వుమెన్ అండ్ చైల్డ్ హెల్ప్‌లైన్స్, ఉజ్వలా హోమ్స్, స్వాధార్ గ్రెహ్స్, బాలల సంరక్షణ సంస్థలతో పాటుగా గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005, వరకట్న నిషేధ చట్టం, 1961, బాల్యవివాహాల నిరోధక చట్టం, 2006, జువనైల్ జస్టిస్ (బాలల సంరక్షణ, రక్షణ) చట్టం, 2015, తదితరాల వివిధ శాసననియతాధికారులు కార్యకలాపాలను కొనసాగిస్తూ, హింసను ఎదుర్కొంటున్న లేక దుస్థితిలో ఉన్న మహిళలు, బాలలకు తోడ్పడేందుకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు అదనంగా, జాతీయ మహిళా కమిషన్, బాలలహక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ కూడా తొలి లాక్ డౌన్ నుంచి మహిళలు, బాలలకు తోడ్పడేందుకు పలు చర్యలు తీసుకున్నాయి.
ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు.
***
(Release ID: 1781966)