నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పి.ఎం.కె.వి.వై. 3.0 కింద - నిధుల కేటాయింపు

Posted On: 15 DEC 2021 4:35PM by PIB Hyderabad

మహారాష్ట్ర రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం కోసం మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పి.ఎం.కె.వి.వై) 3.0 ని అమలు చేస్తోంది.   పి.ఎం.కె.వి.వై. 3.0 రెండు రకాలుగా అమలవుతోంది.   కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ (సి.ఎస్.సి.ఎం) తో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి) అమలు చేస్తున్న కార్యక్రమం ఒకటి కాగా,  కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో, రాష్ట్ర నిర్వహణ (సి.ఎస్.ఎస్.ఎం) తో రాష్ట్ర ప్రభుత్వం / రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎస్.ఎస్.డి.ఎం. లు) అమలు చేస్తున్న కార్యక్రమం మరొకటి.

 

 

 

పి.ఎం.కె.వి.వై. 3.0 కి చెందిన కేంద్ర ప్రభుత్వ విభాగం కింద, రాష్ట్రాల వారీగా కేటాయింపులు లేవు.  దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న శిక్షణా కేంద్రాల ద్వారా ఈ పథకం అమలు కోసం ఎన్.ఎస్.డి.సి. కి నిధులు పంపిణీ చేయడం జరుగుతోంది.  ఈ విభాగం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) లో 156 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 

 

 

 

పి.ఎం.కె.వి.వై. 3.0 కి చెందిన రాష్ట్ర ప్రభుత్వ విభాగం కింద, నిధులతో పాటు, సంబంధిత భౌతిక లక్ష్యాలను రాష్ట్రాల వారీగా కేటాయించడం జరిగింది.  మహారాష్ట్ర రాష్ట్రంతో సహా సి.ఎస్.ఎస్.ఎం-పి.ఎం.కె.వి.వై. 3.0 కింద రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు అనుబంధం-I లో పొందుపరచడం జరిగింది. 

 

 

 

మహారాష్ట్ర రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం (పి.పి.పి) విధానంలో నైపుణ్య శిక్షణను అందించడానికి ప్రతి జిల్లాలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు (పి.ఎం.కె.కె) గా పిలువబడే ఆదర్శ, ఆకాంక్షాత్మక నైపుణ్య కేంద్రాల ఏర్పాటు ను మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది.   15.11.2021 తేదీ నాటికి, మహారాష్ట్ర రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాల పరిధిలో 50 పి.ఎం.కె.కె. లు కేటాయించడం జరిగింది.  కేటాయించిన పి.ఎం.కె.కె. లలో, 33 జిల్లాల వ్యాప్తంగా 43  పి.ఎం.కె.కె. లను ఏర్పాటు చేయడం జరిగింది.  మహారాష్ట్ర కోసం జిల్లాల వారీగా నెలకొల్పిన  పి.ఎం.కె.కె. ల  వివరాలు అనుబంధం-II లో పొందుపరచడం జరిగింది.

 

 

 

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఎస్.ఈ.డి.జి. లు) తో సహా సమాజంలోని అన్ని వర్గాల కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పి.ఎం.కె.వి.వై) ను అమలు చేయడం జరుగుతోంది. 

 

 

 

అనుబంధం-I.  

 

అనుబంధం-II.  

 

*****


(Release ID: 1781963) Visitor Counter : 151


Read this release in: English