ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కలిగిన ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామి: దుబాయ్ ఎక్స్పో 2020 లో రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 14 DEC 2021 5:55PM by PIB Hyderabad

వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే అంశంలో ప్రపంచంలో  భారతదేశం అగ్రగామి గా ఉండటానికి అవకాశం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు  నైపుణ్యాభివృద్ధి  వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్పో 2020లో భారత పెవిలియన్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ చంద్రశేఖర్  ప్రపంచ ఆర్థిక వ్యవస్థను  భవిష్యత్తులో    నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకిత భావంతో పనిచేసే మానవ శక్తి శాసిస్తాయని  అన్నారు. వీటిని  మధ్యప్రాచ్యంఎమిరేట్స్ తో సహా అన్ని దేశాలకు అందించే అంశంలో భారతదేశం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. 

భారతదేశం-యుఎఇ మధ్య  సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని శ్రీ చంద్రశేఖర్  అన్నారు. “భారతదేశం మరియు ఎమిరేట్స్ వాణిజ్యం మరియు పెట్టుబడి  రంగాల్లో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆర్థిక శ్రేయస్సు మరియు అవకాశాలను సృష్టించడానికి ఈసంబంధాలు దోహదపడతాయి.  ముఖ్యంగా కోవిడ్ అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి సాధించడానికి అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది.' అని ఆయన అన్నారు. 

ఎక్స్పో లో ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ప్రాధాన్యతను శ్రీ చంద్రశేఖర్ వివరించారు. ' తన దేశ ప్రజలకు అవకాశాలను అందించడానికి, అభివృద్ధి పథంలో పయనించడానికి భారతదేశం చేస్తున్న కృషికి ఈ పెవిలియన్ అద్దం పడుతుంది. భవిష్యత్తులో మెరుగైనశాంతియుత మరియు సంపన్నమైన ప్రపంచాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.' అని మంత్రి అన్నారు. అన్ని రంగాలలో స్వయం సమృద్ధ భారత దేశ నిర్మాణానికి ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిబింబంగా ఈ పెవిలియన్ నిలుస్తుందని అన్నారు. 

పెట్టుబడులతో భారతదేశానికి రావాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులను శ్రీ చంద్రశేఖర్ ఆహ్వానించారు. కోవిడ్ మహమ్మారి తరువాత భారతదేశ సామర్థ్యం, విపత్తులను ఎదుర్కొని అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం, దేశ ప్రజలు చేసిన కృషిని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. వృద్ధి సాధిస్తున్న భారతదేశం  భవిష్యత్తులో మెరుగైనశాంతియుత మరియు సంపన్నమైన ప్రపంచాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్రీయాశీలక పాత్ర పోషించాలన్న పట్టుదలతో పనిచేస్తున్నదని మంత్రి అన్నారు. అభివృద్ధి సాధించడానికి అపారమైన అవకాశాలు కలిగి ఉన్న భారతదేశానికి పెట్టుబడులతో రావాలని మధ్యప్రాచ్యం దేశాలతో సహా అన్ని దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం భారతదేశం చేస్తున్న  ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. 

దుబాయ్ ఎక్స్పో 2020 లో జర్మనీ, అమెరికా ఏర్పాటు చేసిన పెవిలియన్‌లను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు  నైపుణ్యాభివృద్ధి  వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్  సందర్శించారు.

***



(Release ID: 1781507) Visitor Counter : 123


Read this release in: English , Hindi , Odia