రక్షణ మంత్రిత్వ శాఖ
స్వదేశీ స్టాండ్ -ఆఫ్ యాంటీ ట్యాంక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డిఆర్‌డిఒ & భారత వైమానిక
Posted On:
11 DEC 2021 5:49PM by PIB Hyderabad
దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన హెలికాప్టర్ లాంచ్డ్ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ (ఎస్ఎఎన్‌టి) క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ), భారత వైమానిక దళం (ఐఎఎఫ్) పోఖ్రాన్ శ్రేణుల నుంచి డిసెంబర్ 11, 2021న పరీక్షించాయి.
తన మిషన్ లక్ష్యాలను నెరవేర్చడంలో విమాన పరీక్ష (ఫ్లైట్ టెస్ట్) విజయవంతం అయింది. రిలీజ్ మెకానిజం ( విడుదల యంత్రాంగం), అడ్వాన్స్‌డ్ గైడెన్స్, (అధునాతన మార్గదర్శకత్వం), ట్రాకింగ్ ఆల్గోరిథమ్స్ (అనుగామి యాంత్రిక పద్ధతి ), సమీకృత సాఫ్టవేర్ తో కూడిన ఏవియానిక్స సంతృప్తికరంగా పని చేయడంతో పాటుగా అనుగామి వ్యవస్థలు ఈ మిషన్ కార్యాలను పర్యవేక్షించాయి. అత్యాధునిక ఎంఎండబ్ల్యు అమర్చిన ఈ క్షిపణి, సుదూర తీరం నుంచి అత్యంత కచ్ఛితంగా లక్ష్యాన్ని ఛేదించగల సామర్ధ్యాన్ని అందిస్తుంది. ఈ ఆయుధం 10 కిమీల పరిధిలోని లక్ష్యాలను నిర్వీర్యం చేయగలదు.
ఎస్ఎఎన్‌టి క్షిపణిని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సిఐ), హైదరాబాదు ఇతర డిఆర్‌డిఒ ప్రయోగశాలల సహకార సమన్వయం, పరిశ్రమల భాగస్వామ్యంతో రూపొందించి, అభివృద్ధి చేసింది. ఇటీవలి కాలంలో దీర్ఘ పరిధి బాంబు, స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ ఆయుధం తర్వాత ఐఎఎఫ్ ఆయుధశాలను బలోపేతం చేసేందుకు దేశీయంగా తయారు చేసిన స్టాండ్ ఆఫ్ ఆయుధ పరీక్షల శ్రేణిలో ఇది మూడవది.
అధునాత సాంకేతికలతో భిన్న అప్లికేషన్ల కోసం వివిధ కన్ఫిగరేషన్ల (రూపురేఖ)లను దేశీయంగా అభివీద్ధి చేయడమన్నది రక్షణలో ఆత్మనిర్భర్ భారత్ దేశంగా దృఢంగా సాగడమే.
ఈ మిషన్‌తో సంబంధం కలిగి ఉన్న బృందాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఎస్ఎఎన్‌టి క్షిపణి విజయవంతమైన ఫ్లైట్ టెస్ట్ దేశీయ రక్షణ సామర్ధ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, రక్షణ శాఖ ఆర్&డి కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ జి. సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
***
(Release ID: 1780622)
Visitor Counter : 220