వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2014 - 2021 మధ్య కాలంలో 4.28 కోట్ల బోగస్ రేషన్ కార్డులు రద్దు

Posted On: 10 DEC 2021 3:32PM by PIB Hyderabad

లక్షీకృత ప్రజా పంపిణీ వ్యవస్థ  టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీపీడీఎస్ ) కింద  తమ దుకాణాల వద్ద  వద్ద ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ పోస్ ) పరికరాలను చౌక ధరల దుకాణాల  డీలర్లు నిర్వహిస్తున్నారు. గృహంలో ఇతర వయోజన సభ్యులు ఎవరూ లేకపోవడంతో కానుక ధరల దుకాణాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న వికలాంగులు, వృద్దులకు  జాతీయ ఆహార భద్రతా చట్టం కింద క్రమం తప్పకుండా ఆహార ధాన్యాలను అందించడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. ఇటువంటి  లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను వారి ఇళ్లకు సరఫరా చేయడం  లేదా వారు  నామినేట్ చేసిన వ్యక్తులకు ఆహార ధాన్యాలను అందించడం లాంటి  ప్రత్యేక పంపిణీకి యంత్రాంగాన్ని అమలు చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది. 

జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనల ప్రకారం లబ్ధిదారులు/గృహాలను చేర్చడం లేదా తొలగించే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంపై ఉంటుంది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం నిరంతర ప్రక్రియ గా సాగుతుంది. రేషన్ కార్డులు/ లబ్ధిదారుల జాబితాను పరిశీలించి అర్హులను చేర్చడానికి/ అనర్హులను తొలగించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తరచు సమీక్షలు నిర్వహిస్తుంటాయి. సరైన తనిఖీ నిర్వహించి అర్హత లేని, నకిలీ లేదా బోగస్ రేషన్ కార్డ్‌లను గుర్తించి వాటిని తొలగించడానికి చర్యలు అమలు జరుగుతాయి. దీనికోసం ఇంటింటికి వెళ్లడం/ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. జాబితాలో అర్హత కలిగిన వారినివదిలివేయబడిన వారిని గృహాలు/లబ్ధిదారులను చేర్చడం జరుగుతుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే గిరిజనులు/ పేద కుటుంబాలు/వ్యక్తులను జాబితాలో చేర్చడం జరుగుతుంది. TPDS సంస్కరణలకు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంరేషన్ కార్డుల డేటా డిజిటలైజేషన్డీ-డూప్లికేషన్ ప్రక్రియశాశ్వత వలసలుమరణాలుఅనర్హులు/నకిలీ/నకిలీ రేషన్ కార్డుల గుర్తింపు మొదలైన విధానాలను అనుసరిస్తూ 2014 నుంచి 2021 మధ్య కాలంలో ఇప్పటివరకు దాదాపు 4.28 కోట్ల బోగస్ రేషన్ కార్డులను రద్దు చేసినట్లు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నివేదికలు అందాయి. 

ఆధార్ తో అనుసంధానం చేయకపోవడం రేషన్ కార్డు రద్దుకు ఒక కారణం కాదు. రేషన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయడానికి విధించిన గడువును 2021 డిసెంబర్ 31 వ తేదీ వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు గడువు విధిస్తూ ఆధార్ చట్టం 2016 సెక్షన్-7 (ఎప్పటికప్పుడు సవరించబడి నట్లుగా)08/02/2017 తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడింది. గడువు ముగిసేంత వరకు ఆధార్  లేదా ఆధార్ నంబర్ లేని కారణంగానెట్‌వర్క్/కనెక్టివిటీ/లింకింగ్ సమస్యలు లేదా ఏదైనా ఇతర సాంకేతిక కారణాలు,  బయోమెట్రిక్ ప్రమాణీకరణ వైఫల్యం లాంటి కారణాలు చూపిస్తూ రేషన్ కార్డు/ లబ్ధిదారుల  జాబితా నుంచి అసలైన లబ్ధిదారుడు/ గృహం పేరును తొలగించరాదని సూచిస్తూ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం పంపడం జరిగింది. 

ఈ సమాచారాన్ని వినియోగదారుల వ్యవహారాలుఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

  

***


(Release ID: 1780182) Visitor Counter : 130


Read this release in: Tamil , Bengali , English