పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్పత్తి అనుబంధ ప్రోత్సాహక పథకం – PLI కింద డ్రోన్లు, వాటి విడిభాగాలను దేశీయంగా తయారుచేసేందుకు రూ. 120 కోట్ల ప్రోత్సాహక నగదు.


ఈ నగదు 2021-22 నుండి ప్రతి ఆర్థిక సంవత్సరం మూడు విడతలుగా అందజేత

దేశీయతయారీ వల్ల ఒనగూరే విలువ జోడింపుపై మాత్రమే PLI పథకం వర్తింపు

Posted On: 09 DEC 2021 5:17PM by PIB Hyderabad

మనదేశంలో డ్రోన్ల, వాటి విడిభాగాల తయారీ దేశీయంగా ప్రోత్సహించడానికి ఉత్పత్తి  అనుబంధ ప్రోత్సాహక నగదు - PLI పథకం వివరాలు  30 సెప్టెంబర్ 2021న ప్రకటించారు.

PLI పథకం వివరాలు:

డ్రోన్,  డ్రోన్ భాగాల భారతీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు ఇచ్చే 120 కోట్ల నగదు  వార్షిక అమ్మకాల ఆదాయం నుండి డ్రోన్ కొనుగోలు ఖర్చు (నికర పన్ను ) మిగులును  లెక్కించి అందజేస్తారు. ఈ ప్రోత్సాహకం 2021-22 నుంచి ప్రారంభమై, మూడు విడతలుగా ఏడాదికోసారి  అందజేస్తారు.

2. దేశీయ తయారీ వల్ల కలిగే విలువ జోడింపులో 20% విలువ  మూడు సంవత్సరాలు సమానంగా  కేటాయిస్తారు .

3. కనిష్ట విలువ జోడింపు  నికర అమ్మకాలలో 40%గా లెక్కించారు .

4. సూక్ష్మ. చిన్న, మధ్యతరహా సంస్థలు

 (MSME)  అంకుర కంపెనీల  కోసం  డ్రోన్ తయారీదారులకు వార్షిక కనీస అమ్మక ఆదాయం రూ.2 కోట్లు మరియు రూ. డ్రోన్ విడిభాగాల తయారీదారులకు వార్షిక కనీస  అమ్మకాల ఆదాయం 50 లక్షలు ఉండడం ప్రాతిపదికగా ఉంది. 

5. ఈ పధకం ఎక్కువ మందికి  లబ్ది చేకూర్చేందుకు  వీలుగా  నగదును    వార్షిక వ్యయంలో 25%కి మించకుండా  పరిమితం చేశారు.

6. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి విలువ జోడింపు కోసం అర్హత కలిగిన తయారీదారు కనీస లబ్ది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే, ఆ తయారీదారుడు తర్వాతి సంవత్సరంలో ఆ లోటును భర్తీ చేస్తే, ముందు కోల్పోయిన ప్రోత్సాహకానికి అర్హుడు .

PLI పథకం  ప్రోత్సాహక నగదు  స్వదేశీ తయారీకే   వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా తయారీదారులను ప్రోత్సహించేది దిగుమతులను తగ్గించుకోవడానికి. ఈ రంగంలో సామర్థ్యం పెంపొందించుకోవడానికి విలువ జోడింపు పథకం లక్ష్యం.

***


(Release ID: 1779995) Visitor Counter : 157


Read this release in: English , Urdu