ఆయుష్

ఆయుష్ ఔష‌ధాల‌పై ప‌రిశోధ‌న ప్రాజెక్టులు

Posted On: 07 DEC 2021 4:11PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌)', 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సీసీఆర్‌యుఎం)', 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (సీసీఆర్ఎస్‌)స‌, 'సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్‌)'.  అనే ప్రత్యేక సెంట్రల్ రీసెర్చ్ కౌన్సిల్‌లను ఏర్పాటు చేసింది.  ఈ పరిశోధన మండలిలు ఔష‌ధాల ప‌రిశోధ‌న‌లు, ఔష‌ధాల ప్రామాణిక‌ర‌ణ ప‌రిశోధ‌న‌లు,  ఫార్మాకోవిజిలెన్స్ పరిశోధ‌న‌లు , ఔష‌ధాల క్లినికల్ వెరిఫికేషన్, ప్రాథ‌మిక ప‌రిశోధ‌న‌లు మరియు లిటరరీ రీసెర్చ్‌లపై పరిశోధన ప్రాజెక్ట్‌లను చేపడతాయి. సీసీఆర్ఏఎస్ -4562, సీసీఆర్‌యుఎం-1792, సీసీఆర్ఎస్-‌92, సీసీఆర్‌హెచ్-936  పరిశోధన ప్రాజెక్టులను చేపట్టింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్‌లో పరిశోధన మ‌రియు ఆవిష్కరణలను చేప‌ట్ట‌డం కోసం ఆయుర్‌జ్ఞ‌న్ ప‌థ‌కాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌ను కూడా అమలు చేస్తోంది. ఈ పథకం కింద, కోవిడ్-19పై 34 పరిశోధన ప్రాజెక్టులతో సహా ఆయుష్‌లోని 311 పరిశోధన ప్రాజెక్టులకు త‌గిన ఆర్థిక సహాయం అందించబడింది.
సెంట్రల్ రీసెర్చ్ కౌన్సిల్స్ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది, ఇందులో దాదాపు 33325 (ఆయుర్వేదం - 23868; వై&ఎన్ - 1425, యునాని - 2691; సిద్ధ - 2854; హోమియోప‌తీ - 2487) పరిశోధన ప్రచురణలు ఉన్నాయి. ప్రచురణలు ఆయుష్ రీసెర్చ్ పోర్టల్ https://ayushportal.nic.in/లో అందుబాటులో ఉన్నాయి, వీటికి సాధారణ ప్రజలకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఈ విషయాన్ని ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక స‌మాధానంలో తెలిపారు.

 

***



(Release ID: 1779030) Visitor Counter : 100


Read this release in: English , Urdu