ఆయుష్
దేశ విదేశాల్లో పెరిగిన - ఆయుర్వేద మార్కెట్
Posted On:
07 DEC 2021 4:13PM by PIB Hyderabad
దేశ విదేశాల్లో డిమాండ్ పెరగడంతో, 2014-2020 లో ఆయుష్ పరిశ్రమ మొత్తం మార్కెట్ పరిమాణం 17 శాతం పెరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి నియంత్రణ, పరిశోధన, అభివృద్ధితో పాటు, బలమైన మౌలిక సదుపాయాలకు పటిష్టమైన మద్దతు లభించడం ద్వారా ఇది సాధ్యమయ్యింది.
కస్టమ్స్ అధికారులు రూపొందించిన షిప్పింగ్ బిల్లులలో రాష్ట్రాల కోడ్ లు ఆధారంగా ఎగుమతిదారులు నివేదించిన రాష్ట్రాల వారీగా ఎగుమతి సమాచారాన్ని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ & స్టాటిస్టిక్స్ (డి.జి.సి.ఐ.ఎస్) కార్యాలయం ద్వారా సంకలనం చేయడం జరిగింది.
2019-20 మరియు 2020-21 ఆర్ధిక సంవత్సరాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన ఆయుష్ మరియు హెర్బల్ ఉత్పత్తుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఆర్ధిక సంవత్సరం
|
పరిమాణం
కె.జి. లలో
|
విలువ
మిలియన్ అమెరికా డాలర్లలో
|
2019-20
|
364271
|
2.29
|
2020-21
|
513514
|
3.81
|
అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ రంగ పథకం (ఐ.సి. పథకం) కింద, ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతులను పెంపొందించే ఉద్దేశ్యంతో, అంతర్జాతీయ ప్రదర్శనలు / వాణిజ్య ప్రదర్శనలు మొదలైన వాటిలో పాల్గొనడంతో పాటు, విదేశాల్లో ఎగుమతి ప్రయోజనం కోసం. యు.ఎస్.ఎఫ్.డి.ఏ. / ఈ.ఎం.ఈ.ఏ. / యు.కె=ఎం.హెచ్.ఆర్.ఏ. / ఎన్.హెచ్.పి.డి. (కెనడా) / టి.జి.ఏ. వంటి ఇతర అంతర్జాతీయ రెగ్యులేటరీ ఏజెన్సీలతో ఆయుష్ ఉత్పత్తుల అనుమతి / నమోదు కోసం ఆయుష్ ఔషధ తయారీదారులకు ప్రోత్సాహకాలు అందజేయడం జరిగింది. కెన్యా, అమెరికా, రష్యా, లాట్వియా, కెనడా, ఒమన్, తజికిస్తాన్, శ్రీలంక వంటి ఎనిమిది దేశాలలో ఇప్పటివరకు 50 కంటే ఎక్కువ ఉత్పత్తులు (యునానీ మరియు ఆయుర్వేదం) నమోదయ్యాయి.
పైన పేర్కొన్న వాటితో పాటు, ఎగుమతులను సులభతరం చేయడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ దిగువ పేర్కొన్న వివరాల ప్రకారం ఆయుష్ ఉత్పత్తుల ధృవీకరణలను ప్రోత్సహిస్తోంది :-
(i) మూలికా ఉత్పత్తుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల (సి.ఓ.పి.పి) ధ్రువీకరణ.
(ii) అంతర్జాతీయ ప్రమాణాలకు, స్థాయికి అనుగుణంగా, తృతీయ పక్షం చేసే మూల్యాంకనం ఆధారంగా, ఆయుర్వేద, సిద్ధ, యునాని ఉత్పత్తులకు ఆయుష్ ప్రీమియం మార్క్ మంజూరు కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూ.సి.ఐ)) ద్వారా అమలు చేస్తున్న నాణ్యతా ధృవీకరణ పథకం.
కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1779026)