ఆర్థిక మంత్రిత్వ శాఖ

గత ఐదు సంవత్సరాలలో ఆర్థిక మోసాల నుండి 90 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టిన - షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

Posted On: 06 DEC 2021 5:29PM by PIB Hyderabad

‘ఆర్.బి.ఐ. రిటైల్ డైరెక్ట్ స్కీమ్’ మరియు ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్- 2021’ పథకాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) ప్రారంభించింది.

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ రోజు లోక్‌ సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమర్పించిన సమాధానంలో పొందుపరిచారు. 

ఈ రెండు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలతో పాటు పూర్తి వివరాలు అనుబంధంలో ఉన్నాయి.

ఈ పథకాలు పెట్టుబడి పరిధిని, క్యాపిటల్ మార్కెట్‌ కు ప్రాప్యతను, పెట్టుబడిదారులకు భద్రతను ఏ మేరకు విస్తరించగలవో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి సర్వే నిర్వహించలేదని మంత్రి పేర్కొన్నారు.  అయితే, రిటైల్ పెట్టుబడిదారుల ద్వారా జి-సెక్ మార్కెట్‌ కు ప్రాప్యతను సులభతరం చేయడం కోసం మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొంటున్న వారి నుండి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని రూపొందించింది.   ఈ పథకం కోసం అభివృద్ధి చేసిన ఆన్‌లైన్ పోర్టల్ సురక్షితమైనది మరియు వినియోగదారుల వినియోగానికి అనుకూలమైనది.   పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడం మరియు పెట్టుబడిదారుల స్థావరాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని ఈ పథకం ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ సెక్యూరిటీల కోసం పెట్టుబడిదారుల స్థావరాన్ని,  ఆర్‌.బి.ఐ. రిటైల్ డైరెక్ట్ పథకం విస్తృతం చేస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని ఫలితంగా ఈ సెక్యూరిటీ లకు డిమాండ్ పెరగడం వల్ల ప్రభుత్వానికి రుణాలు తీసుకునే ఖర్చు తగ్గుతుంది.  రెండవది, భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో (జి-సెక్) పెరిగిన రిటైల్ భాగస్వామ్యం,  జి-సెక్  మార్కెట్ లిక్విడిటీని మెరుగుపరుస్తుంది.  ఇది భారతీయ జి-సెక్ మార్కెట్‌ ను మరింత విస్తృత పరచడానికి దోహదపడుతుంది.  అదేవిధంగా, బాగా అభివృద్ధి చెందిన జి-సెక్ మార్కెట్,  భారతీయ స్థిర ఆదాయ మార్కెట్‌ లోని ఇతర విభాగాల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది.

 

*****



(Release ID: 1778760) Visitor Counter : 99


Read this release in: English , Urdu