మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అనాథలకు విద్య

Posted On: 06 DEC 2021 4:31PM by PIB Hyderabad

విద్య అనేది రాజ్యాంగం పేర్కొన్న‌ట్టుగా ఉమ్మడి జాబితాలో అంశం. చాలా పాఠశాలలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉన్నాయి. పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం (డీఓఎస్ఈఎల్‌) విద్యా మంత్రిత్వ శాఖ ఆర్‌టీఈ చట్టం, 2009 అమలులో రాష్ట్రాలు, యుటీలకు మద్దతుగా సమగ్ర శిక్షను అమలవుతోంది. సమగ్ర శిక్ష ప్రీ-స్కూల్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ నుండి సీనియర్ సెకండరీ స్థాయిల వరకు 'పాఠశాల‌ను' కొన‌సాగింపుగా భావిస్తోంది. పాఠశాల విద్య అన్ని స్థాయిలలో సమానత్వం మరియు చేరికను నిర్ధారించడం సమగ్ర శిక్ష యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి. కోవిడ్-19 కారణంగా అనాథలైన పిల్లలకు విద్యను అందించడానికి, డీఓఎస్ఈఎల్‌ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండ‌బ్ల్యుసీడీ) 16.06.2021 తేదీన ఇలాంటి పిల్ల‌ల‌ను వివిధ పథకాల పరిధిలోకి తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలు మరియు యుటీలకు సంయుక్త లేఖను జారీ చేసింది. ఈ విభాగంఅటువంటి పిల్లలకు విద్యను కొనసాగించే విష‌యంలో ఉపాధ్యాయులు, జిల్లా విద్యా అధికారులు మరియు శిశు సంక్షేమ కమిటీల పాత్రను విడ‌మ‌రిచి చెప్పింది. దీనికి తోడు కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా చట్ట పరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పిల్లల కోసం పీఎం కేర్స్ పథకం' ప్రకారం
మద్దతు ఇవ్వ‌నున్నారు.  ఈ మేర‌కు  అన్ని రాష్ట్రాలు, యూటీల‌ ప్రయోజనాల‌లో వారికి త‌గిన  అర్హతలు ఉండేలా చూడాలని అభ్యర్థించబడ్డాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సమగ్ర శిక్షను పేర్కొన్న పథకం కోసం నమోదు చేసుకున్న మరియు సమగ్ర శిక్ష కింద ఉన్న పాఠశాలల్లో ప్రవేశం పొందిన పిల్లలకు ఈ మేర‌కు ప్ర‌యోజ‌నం అందించ‌వ‌చ్చు. దీనికి తోడు ఒక్కో కేంద్రీయ విద్యాలయానికి 10 మంది పిల్లల చొప్పున మంజూరైన తరగతి బలం కంటే ఎక్కువ మరియు అంతకంటే ఎక్కువ అనాథ పిల్లలను చేర్చుకోవడానికి కమిషనర్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు ఆదేశాలు జారీ చేయబడ్డాయి, ప్రతి తరగతికి గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఉండాలి. పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ ప‌థ‌కంను యాంక‌రింగ్ చేసే బాధ్య‌త‌ను ఎండ‌బ్ల్యుసీడీకి అప్ప‌గించ‌బ‌డింది. ఏ పౌరుడైనా pmcaresforchildren.in పోర్టల్ ద్వారా ఈ పథకం కింద మద్దతు కోసం అర్హత ఉన్న పిల్లల గురించి ప్ర‌భుత్వాల‌కు తెలియజేయవచ్చు. క‌రోనా కార‌ణంగా అనాథ‌లైన పిల్లల కోసం పీఎం కేర్స్ పథకం కింద మద్దతు ల‌భించేందుకు అర్హులైన పిల్లలను గుర్తించి, వారిని పోర్టల్‌లో నమోదు చేయాలని ఎండ‌బ్ల్యుసీడీ రాష్ట్రాలు, UTలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ స‌హాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక‌ సమాధానంలో తెలిపారు.
                                                                               

*****



(Release ID: 1778759) Visitor Counter : 101


Read this release in: English , Urdu , Tamil