కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన కింద 1.2 కోట్ల మందికి పైగా లబ్ధి
Posted On:
06 DEC 2021 7:56PM by PIB Hyderabad
యాజమాన్యాలు నూతన ఉపాధి కల్పన చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాక అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత రంగంలోకి తెచ్చే లక్ష్యంతో 2016 నుంచి ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన (పిఎంఆర్‌పివై)ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద, రూ. 15,000 అంతకు తక్కువ లేదా సమానంగా వేతనాలు ఆర్జిస్తున్న నూతన ఉద్యోగులకు మూడేళ్ళ పాటు యాజమాన్యం కట్టవలసిన 12% వంతును భారత ప్రభుత్వం ఇపిఎఫ్ఒ ద్వారా చెల్లిస్తోంది.
సంస్థ ద్వారా లబ్ధిదారు నమోదు చేసుకునేందుకు చివరి తేదీ 31 మార్చి 2019. పథకం కింద మార్చి 31, 2019వరకు నమోదు చేసుకున్న లబ్ధిదారులు, నమోదు చేసుకున్న తేదీ నుంచి 3 ఏళ్ళ పాటు అంటే 31 మార్చి 2022వరకు లబ్ధిని పొందుతారు. ఈ పథకం దాదాపు 20 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూర్చనుంది. దాదాపు 1.53 సంస్థల ద్వారా 1.21 కోట్ల మంది లబ్ధిదారులకు 27 నవంబర్ 2021 వరకు లబ్ధిని చేకూర్చారు.
ఈ పథకం గురించి అవగాహనను పెంచేందుకు ఇపిఎఫ్ ఒ వెబ్ సైట్ సహా వివిధ మీడియా రీతుల ద్వారా ప్రచారం చేశారు. దీనితో పాటుగా, యాజమాన్యాలు, యాజమాన్య అసోసియేషన్లలో అవగాహనను పెంచేందుకు అనేక సెమినార్లు, సమావేశాలను కూడా నిర్వహించారు.
ఈ సమాచారాన్ని కార్మిక, ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.
*****
(Release ID: 1778748)
Visitor Counter : 168