సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సీడీపీలకు నిధుల కేటాయింపు
నాడు పోస్టు చేయడమైనది:
06 DEC 2021 1:25PM by PIB Hyderabad
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన సూక్ష్మ మరియు చిన్నిపరిశ్రమల క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి (ఎంఎస్ఈ-సీడీపీ) నిధుల కేటాయింపుపై ప్రభుత్వం వివరాలను తెలిపింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టుపాళం, పుదుచ్చేరిలో మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు ఈ ప్రాజెక్టు కింద రూ 4.14 కోట్ల గ్రాంట్‌కు సమ్మతిని ఇచ్చింది. ఇందులో రూ. 1.59 కోట్ల నిధులను విడుదల చేసింది. దీనికి తోడు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన టెక్నాలజీ సెంటర్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ) కింద పుదుచ్చేరిలో రూ.121.00 కోట్ల వ్యయంతో కాలాపేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్‌లో ఒక సాంకేతిక కేంద్రం (టీసీ) ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా అనుమతినిచింది. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ యొక్క మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్ఈ -సీడీపీ) కింద ఆయా పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.156.50 కోట్ల నిధులు/బడ్జెట్ అంచనాలు కేటాయించిచడమైంది. ఈ విషయాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 1778452)
సందర్శకుల సూచీ సంఖ్య : : 153