సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు ఉత్తమ పాలనావిధానాలు పరస్పరం మార్చుకోవాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


భువనేశ్వర్ లో జరిగిన ఉత్తమ పాలనావిధానాల పరస్పర మార్పిడి ప్రాంతీయ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి ప్రసంగం

సామాన్యప్రజల జీవితాలలో సుఖమయ జీవనం తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యం: డాక్టర్ జితేంద్ర సింగ్

అన్ని ప్రభుత్వ నిర్ణయాలలోనూ ప్రజానుకూల వైఖరితో సుపరిపాలన> ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్

Posted On: 04 DEC 2021 4:48PM by PIB Hyderabad

రాష్ట్రాలు ఉత్తమ పాలనావిధానాలు పరస్పరం మార్చుకోవాలని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రి ( స్వాతంత్ర్య ప్రతిపత్తి) , ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి,  సిబ్బంది, ప్రజాఫిర్యాదుల శాఖామంత్రి, విద్యుత్, అణువిద్యుత్ శాఖామంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు భువనేశ్వర్ లో అన్నారు.  ఉత్తమ పాలనావిధానాల పరస్పర మార్పిడి ప్రాంతీయ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి ప్రసంగించారు.  పౌరులే కేంద్రంగా పాలన సాగాలన్నదే మోదీ ప్రభుత్వపు పాలనా సూత్రమని గుర్తు చేశారు. పాలనలో నాణ్యతా పెంచటామన్నాడే భారత ప్రభుత్వ పాలన నమూనాగా ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్రాల, జిల్లాల పాలనలో ప్రతిబింబించాలన్నారు. అప్పుడే ఆవినీతిరహిత, పారదర్శక పాలన అందుబాటులోకి వస్తుందన్నారు.

పరిపాలనాలో ఉత్తమ విధానాలను అన్నీ రాష్ట్రాలూ అవలంబించాలని, ఆలాంటివి ఎక్కడున్నా పరస్పరం అందుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు.  ఆలా మార్చుకున్నప్పుడే మంచి విధానాలు ఉత్తమావిధానాలుగా రూపుదిద్దుకుంటాయన్నారు. మరికొన్ని అమలవుతున్న సమయంలో మరింతగా పదునెక్కి మెరుగైన నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పుతాయన్నారు. కేంద్ర, రాష్టఱ, జిల్లా స్థాయిలలో వెలుగు చూసిన పాలనాపరమైన నవకల్పనలను అందరూ వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.  అప్పుడే ప్రభుత్వం ఆశించిన విధంగా కనీస ప్రభుత్వాధిపత్యం, గరిష్ఠ పాలన క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.  

సుపరిపాలన కోసం సిపిగ్రామ్స్ తదితర  చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రైల్వే టికెట్ల రద్దుతో ఆటోమేటిక్ గా డబ్బు వెనక్కి వెళ్ళటం, బాంకుల ద్వారా పెన్షన్ల పంపిణీ, రైల్ కోచ్ లను యంత్రాల సాయంతో శుభ్రం చేయటం,  ఆదాయం పన్ను రిటర్న్ ల ఈ-తనిఖీ తరహాలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలకు టెక్నాలజీని గరిష్ఠంగా వాడుకోవాలని సూచించటాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

2014 లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాఫిర్యాదుల విభాగం చాలా బలహీనంగా ఉన్నట్టు గుర్తించిందని అందుకే దాని ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుందని చెప్పారు. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేవట్టినప్పుడు  ఏడాదికి 2 లక్షల చొప్పున ఫిర్యాదులు వచ్చేవని, ఇప్పుడు ఆ సంఖ్య 6 రెట్లు  పెరిగిందని, ప్రభుత్వానికి సమస్యల పరిష్కారం  పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మటమే అందుకు కారణమని మంత్రి అభిప్రాయపడ్డారు.  అందుకే ఈరోజు సమస్యల పరిష్కారం శాతం 90-95% ఉందన్నారు.  ఫిర్యాదులను గమనించి పరిష్కరించటానికి ఒక వ్యవస్థ పనిచేస్తున్నట్టు ప్రజలు గమనిస్తున్నారనటానికి ఇది నిదర్శనమన్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ వర్చువల్ విధానంలో ఈ సమావేశాన్నుద్దేశించి మాట్లాడుతూ, సుపరిపాలన లో పోటీని తయారుచేయటం, వ్యూహాల సమన్వయం, బాధ్యతలను నిర్వచించటం. లక్ష్యాలతోబాటు వ్యూహాలను నిర్దేశించటం, వీటన్నిటికంటే ముఖ్యంగా అన్నీ దశాల్లోనూ ప్రజానుకూల వైఖరి అవలంబించటం అనేవి భాగమన్నారు.  మార్పుకు అంతిమ ఆయుధం సుపరిపాలనేనాని అభివర్ణిస్తూ, ప్రజల పట్ల అందరికీ ఉన్న బాధ్యతను నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు.   

పాలనాసంస్కరణాలు, ప్రజాఫిర్యాదుల శాఖ కార్యదర్శి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఉత్తమవిధానాలను సుస్థిరంగా అమలు చేసేలా చూసుకోవటానికి ఈ ప్రాంతీయ సదస్సు ఒక ఆయుద్ధమన్నారు. ఒడిశా రాష్ట్ర  ప్రభుత్వ ప్రణాళికా శాఖామంత్రి శ్రీ పద్మనాభ బెహరా మాట్లాడుతూ తమ రాష్ట్రం పాలనలో అమలు చేస్తున్న సమర్థవంతమైన విధానాలను ప్రస్తావించారు. ఒడిశా రాష్ట్ర  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేశ్ చంద్ర మహాపాత్ర ఈ సదస్సు ఏఱపయాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు చెందిన 15 రాష్ట్రాలనుంచి 250 మందికి పైగా ప్రతినిధులు ఈ  సదస్సుకు నేరుగా హాజరుకాగా మరో 250 మంది వర్చువల్ గా పాల్గొన్నారు.

***



(Release ID: 1778134) Visitor Counter : 141