ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా సాంకేతిక అంకుర సంస్థల సదస్సు నిర్వహించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ

Posted On: 03 DEC 2021 1:00PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” వేడుకల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ స్టార్ట్ అప్ హబ్ ఈ వరం ప్రారంభంలో సాంకేతిక అంకుర సంస్థల సదస్సు ను నిర్వహించింది.  సాంకేతిక ఆవిష్కరణలు,అంకుర సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం మేధో సంపత్తి సృష్టించడం లాంటి అంశాలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంక్యుబేషన్ కేంద్రాలు, ఎక్సలెన్స్ కేంద్రాలు   సాంకేతిక వనరులను పరస్పర  మార్పిడి చేసుకోవడం, సృజనాత్మకత ఆలోచనలను పంచుకోవడం, ఉత్తమ విధానాలను అనుసరిస్తూ పరిశోధనా నైపుణ్యాలను మెరుగు పరచుకోవడం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు తన  వంతు సహకారాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ద్వారా అందించడానికి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 

సాంకేతిక సదస్సును రెండు దశల్లో నిర్వహించారు. దీనిలో భాగంగా నిపుణులతో చర్చలు ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ బీఎస్ఎఫ్-భూమి ఛాలెంజ్ అవార్డులను ప్రదానం చేసింది.   

తొలి సెషన్ లో అంకుర సంస్థల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. వన్ విజన్ వన్ నేషన్ పేరుతో నిర్వహించిన ఈ సదస్సులో వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొని ప్రసంగించారు.  స్టార్టప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా అధిపతి  శ్రీమతి ఆస్తా గ్రోవర్, స్పెడ్ బీరక్ అధిపతి డాక్టర్ మనీష్ దివాన్,  నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ బోర్డ్ అధిపతి   డాక్టర్ అనితా గుప్తాడిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ముఖ్య అధికారిశ్రీ  వివేక్ విర్మణి, COO,కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారుడు  శ్రీ. ముదిత్ నారాయణ్ వివిధ అంశాలపై ప్రసంగించారు. 

అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి అమలు చేయాల్సిన చర్యలను శ్రీమతి ఆస్తా గ్రోవర్ ప్రస్తావించారు. సంస్కరణల ద్వారా సంస్థలపై  భారాన్ని తగ్గించడంనిధులు/గ్రాంట్ల ద్వారా ఆర్థిక సహకారం అందించడం మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించడంఅంకుర సంస్థలకు  మార్గదర్శకత్వం వహించడం లాంటి అంశాలను ప్రస్తావించిన శ్రీమతి ఆస్తా గ్రోవర్ అంకుర సంస్థలు   వ్యాపార వృద్ధి పై దృష్టి సారించి పని చేయాలని సూచించారు. 

ఎక్కువ కాలం మనుగడ సాగించే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ మనీష్ దివాన్ సూచించారు. నిధులు, మౌలిక సదుపాయాలు, సంబంధిత వర్గాలతో కలిసి పనిచేసి భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు. 

ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిలా విద్యావంతులైన యువత మారడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ అనితా గుప్తా దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లునేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ మరియు హార్నెస్సింగ్ ఇన్నోవేషన్ మొదలైన కార్యక్రమాల  ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. సరైన యాజమాన్య విధానాలు, ఆర్థిక సహకారంతో అంకుర సంస్థలను అభివృద్ధి చేయవచ్చునని అన్నారు. దీనివల్ల భారతదేశం అంకుర సంస్థల కేంద్రంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు రంగాల మధ్య సహకారం పెరుగుతుందని పేర్కొన్నారు. 

సరైన  పరిశోధనా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల రక్షణ రంగ ఉత్పత్తుల రంగంలోకి యువ పారిశ్రామికవేత్తలు ప్రవేశించలేకపోతున్నారని శ్రీ వివేక్ విర్మాణి అన్నారు. రక్షణ రంగ అవసరాలు తెలుసుకున్న తరువాత మాత్రమే ఈ రంగంలో అంకుర సంస్థలు ప్రవేశించాలని ఆయన సూచించారు. 

వినియోగదారుల అవసరాలురవాణాఇంధన ఉత్పత్తి మరియు నిల్వ విధానాలలో సవరణల అవసరాలపై శ్రీ  ముదిత్ నారాయణ్ ప్రసంగించారు.   'జై జవాన్ జై కిసాన్నినాదం  'జై విజ్ఞాన్ భారత్‌గా మారాలని ఆయన అన్నారు. దీనివల్ల  ఆత్మనిర్భర్ భారత్ సాధన సాకారం అవుతుందని అన్నారు. 

ప్రారంభం నుంచి మార్కెట్ చేరే వరకు ఎదురయ్యే సమస్యలను పరిష్కారానికి అంకుర సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ ఏకే  గార్గ్ అన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను మార్చుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయాలని సూచించారు. 

పెట్టుబడులు, నిధుల సమీకరణ అంశాలపై ప్రత్యేకంగా సదస్సును నిర్వహించారు. దీనిలో 3one4 క్యాపిటల్సహ వ్యవస్థాపకుడు ఆరిన్ క్యాపిటల్ మరియు మణిపాల్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ. మోహన్ దాస్ పాయ్, , ఫండ్ ఆఫ్ ఫండ్స్ అధిపతి   శ్రీ. కృపా శంకర్,  ప్రైవేట్ సెక్టార్ పార్టనర్‌షిప్స్ లీడ్బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ. అంజనీ బన్సల్, సన్ గ్రూప్ ఉపాధ్యక్షుడు   శ్రీ. కీర్తి లాల్ కాలా,  స్టార్టప్‌ఎక్స్ సీడ్ వెంచర్స్ వ్యవస్థాపకుడు శ్రీ. బివి నాయుడు,టై గ్లోబల్ హెడ్ శ్రీ. మహావీర్ ప్రతాప్ శర్మ,ఫండ్ స్ట్రాటజీ & ఇన్వెస్టర్ రిలేషన్స్లెట్స్ వెంచర్   హెడ్  శ్రీ. నకుల్ సక్సేనా తదితరులు సదస్సులో ప్రసంగించారు. 

శ్రీ. మోహన్ దాస్ మాట్లాడుతూ దేశంలో స్వదేశీ పెట్ట్టుబడులతో పోల్చి చూస్తే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. స్వదేశీ పెట్టుబడులపై విధిస్తున్న అధిక పన్ను, పెట్టుబడులపై నెలకొన్న భయం, పెట్టుబడుల సమీకరణ, పర్యవేక్షణపై సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సీడ్ క్యాపిటల్ సమకూర్చాలని ఆయన సూచించారు. 

సరైన అవగాహనతో అవసరమైన అంశాలపై పెట్టుబడులు పెట్టాలని శ్రీ కృపా శంకర్ సూచించారు. ఆదాయం సమకూర్చే అంశాలపై పెట్టుబడులు పెట్టాలని అన్నారు. 

తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం, ఉత్పత్తులపై స్పష్టమైన అవగాహనతో పనిచేయాలని శ్రీ. అంజనీ బన్సాల్ సూచించారు. దీనివల్ల అంకుర సంస్థల ఉత్పత్తులకు విదేశాల్లో కూడా మార్కెట్ ఉంటుందని అన్నారు. 

అంకుర సంస్థలలో  పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి ఆవశ్యకత, వడ్డీ,  ఆసక్తి ఉన్న ప్రాంతాలుదీర్ఘకాలిక అనుబంధంప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని  శ్రీ కీర్తి లాల్ కాలా సూచించారు. 

 ప్రారంభ దశలో పెట్టుబడులను సేకరించే విషయంలో అంకుర సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను  శ్రీ బి వి నాయుడు వివరించారు. అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సరళీకృత విధానాలను అమలు చేసి, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

పర్యవేక్షణ, అవకాశాలు, మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ మార్కెట్ పరిధిని అంకుర సంస్థలు విస్తరించుకోవాలని శ్రీ మహావీర్ ప్రతాప్ శర్మ సూచించారు. 

పెట్టుబడిదారులకు (నాన్-మెట్రోల నుంచి పెట్టుబడిదారుల తో సహా), స్థిరమైన పెట్టుబడుల ఆవశ్యకత ప్రభుత్వ సహకారం  ద్వారా దీర్ఘకాలిక మూలధన నిల్వలను పెంచుకునే అవకాశాలపై అవగాహన కల్పించాలని శ్రీ. నకుల్ సక్సేనా సలహా ఇచ్చారు. 

రెండు సదస్సులకు ఎం ఎస్ హెచ్ సీఈఓ శ్రీ జితేంద్ర విజయ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. వివిధ అంశాలపై నిపుణులు సలహాసూచనలు అందించేలా ఆయన ప్రశ్నలు సంధించారు. 

వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి , సరిహద్దు భద్రతా దళం సహకారంతో ఎలక్ట్రానిక్స్,ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పోటీ విజేతలకు బహుమతులు అందించడం జరిగింది.  విహాన్ నెట్‌వర్క్స్ లిమిటెడ్జియో రాడార్ ఆవ్రిత్తి  టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డ్జ్రిన్ ఫోర్జ్ ఆప్టిమమ్ లాజిక్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురుత్వన్ సిస్టమ్స్ ప్రైవేట్  లిమిటెడ్, బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు  ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందించారు. 

భారతదేశానికి కొత్త శకానికి నాంది పలుకుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తున్న  యువ విద్యార్థి పారిశ్రామికవేత్తలను ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్ మరియు రైల్వే శాఖ  మంత్రి శ్రీ  అశ్వనీ వైష్ణవ్ అభినందించారు. 

సదస్సులో పాల్గొన్న వారికి ఎలక్ట్రానిక్స్,ఐటీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి    శిరి భువనేష్ కుమార్ ధన్యవాదాలు తెలుపుతూ భుమి పోటీ వివరాలను తెలిపారు. 

***



(Release ID: 1777827) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Hindi