నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం స్థాపిత విద్యుత్ సామర్త్య లక్ష్యాన్ని సాధించిన ఇండియా
మొత్తం స్థాపిత శిలాజేతర ఇంధన ఆధారిత సామర్ధ్యం 156.83 జిడబ్ల్యుగా ఉంది
Posted On:
02 DEC 2021 6:43PM by PIB Hyderabad
స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 40 శాతాన్నిశిలాజేతర ఇంధన వనరులద్వారా 2030 నాటికి సాధించాలని జాతీయ నిర్దేశిత విధానం (ఎన్‌డిసి) లో భాగంగా కాప్ 21 సమావేశంలో ఇండియా ప్రకటించింది. అయితే ఈ లక్ష్యాన్ని 2021 నవంబర్ నాటికే మన దేశం సాధించింది. దేశ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం ప్రస్తుతం 150.0 జిడబ్ల్యుగా ఉంది. ఇండియా అణు ఇంధన ఆధారిత స్థాపిత సామర్థ్యం 7.78 జిగావాట్లుగా ఉంది. దీనితో మొత్తం శిలాజేతర ఆధారిత స్థాపిత ఇంధన సామర్ధ్యం 156.83 గిగావాట్లకు చేరుకుంది. ఇది మొత్తం 390.8 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంలో 40.1 శాతం. ఇది ప్రధానమంత్రి గారు ఇటీవల ముగిసిన కాప్ 26 లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇది ఉంది.
2030 నాటికి ప్రభుత్వం శిలాజేతర ఇంధన వనరుల నుంచి 500 జి.డబ్ల్యు స్థాపిత సామర్ధ్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
***
(Release ID: 1777511)
Visitor Counter : 290