గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2.68కోట్ల నీటి కుళాయిలు, 2.64 డ్రైనేజీ కనెక్షన్లు!
-అమృత్- 2వదశతో అందనున్న పట్టణ సదుపాయాలు
ఎస్.బి.ఎం.-యు 2వ దశ కింద ఇంటింటినుంచి
తడి, పొడి వ్యర్థాలు వందశాతం సేకరణ..
అమృత్ పథకం అమలు ద్వారా
రూ. 41,847 కోట్లతో1,326 ప్రాజెక్టులు ప్రారంభం,
అందుబాటులోకి 114లక్షల నీటి కనెక్షన్లు..
4,372 పట్టణ స్థానిక సంస్థల్లో 4,371సంస్థలకు
ఒ.డి.ఎఫ్. రహిత ప్రాంతాలుగా గుర్తింపు
Posted On:
02 DEC 2021 4:41PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకు ఉద్దేశించిన స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్.బి.ఎం.-యు) 2వ దశ కార్యక్రమాలు 2021 అక్టోబరు 1న మొదలయ్యాయి. ఆ కార్యక్రమాల ముఖ్యాంశాలు ఇవి:
(1). ఈ పథకం ప్రకారం ఇళ్లతోపాటుగా, ఇతర భవంతుల ఆవరణల్లో పోగయ్యే వ్యర్థాలను, చెత్తను “తడిచెత్త” (వంటగది, తోటలనుంచి వచ్చేది)గా, “పొడి చెత్త” (కాగితం, గాజు, ప్లాస్టిక్, ఇళ్లలోని ప్రమాదకర వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు)గా విడివిడిగా విభజించారు.;
(2). విభజించిన చెత్తను, వ్యర్థాలను ప్రతి ఇంటినుంచి, ప్రతి ఆవరణనుంచి ఇంటింటికి వెళ్లి వందశాతం లక్ష్యంతో సేకరణ జరపడం;
(3). అన్ని రకాల చెత్త, వ్యర్థాల సమస్యను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించడం. వాటిని సురక్షితంగా భూస్థాపితం చేయడం.;
(4). కొన్ని బంజరు భూముల్లో ఎంతో కాలంగా పోగుపడిన ఘనవ్యర్థాల సమస్యను పూర్తిగా పరిష్కరించడం;
(5). లక్షమందికి లోపు జనాభా కలిగిన నగరాల్లో మలవ్యర్థాల నీటితో పాటు ఇతర మురుగు నీటిని సురక్షితంగా సేకరించి, రవాణా చేసి, ప్రాసెస్ చేశారు. తద్వారా, ఈ తరహా మురుగునీరు భూగర్భ జలాలనుగానీ, నీటి వనరులనుగానీ కలుషితం చేయకుండా నివారణ చర్యలు తీసుకున్నారు.;
(6). ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని దశలవారీగా తగ్గించడం.
2021 అక్టోబరు ఒకవ తేదీ ప్రారంభమైన అమృత్ 2వ దశ (AMRUT 2.0) పథకం పనుల్లో ముఖ్యమైన అంశాలు:
(1). సార్వత్రిక నీటి సరఫరా పథకం వర్తించే నగరాల సంఖ్యను 500నుంచి దాదాపుగా 4,800కు పెంచడం.
(2). ఆ నగరాలను ‘సావలంబన’ కలిగిన ‘నీటి భద్రత’ కలిగిన నగరాలుగా తీర్చిదిద్దడంపై దృష్టిని కేంద్రీకరించడం.
(3). అమృత్ పథకం అమలుకోసం గుర్తించిన 500 నగరాలకు సార్వత్రిక మురుగునీటి నిర్వహణను, డ్రయినేజీ సదుపాయాలను వర్తింపజేయడం.
(4). 2.68 కోట్ల మంచినీటి కుళాయిల కనెక్షన్లను, 2.64 కోట్ల డ్రయినేజీ కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకోవడం.
(5). రుణ పరపతి సదుపాయం విస్తరణ, మార్కెట్.నుంచి రుణాల సేకరణ ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థల (యు.ఎల్.బి.ల) ఆర్థిక స్థిరత్వంపై దృష్టిని కేంద్రీకరించడం.
(6). నీటి కనెక్షన్ల ఏర్పాటులో వివిధ నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, పథకం పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షణను పెంచేందుకు ‘పే జల్ సర్వేక్షణ్’ పేరిట ఒక సర్వేని నిర్వహించనున్నారు.
(7). అమృత్ 2వ దశ పథకం అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం ద్వారా నీటి సరఫరా రంగంలో ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన టెక్నాలజీలు ఏమేమి ఉన్నాయో గుర్తించడానికి అవకాశం.
(8). పథకం అమలుకోసం తక్కువ ధరలో లభ్యమయ్యే పరికరాలను వినియోగించడంలో ఔత్సాహిక సంస్థలు, స్టార్టప్ కంపెనీలకు ప్రమేయం కల్పించారు.
ఎస్.బి.ఎం.-యు 2వ దశ, అమృత్ 2వ దశ పథకాలను ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీన ప్రారంభించారు. ఈ రెండు పథకాల కేటాయింపు మొత్తాల వివరాలు అనుబంధం-I.లో పొందుపరచబడ్డాయి.
మొత్తం 4,372 పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల్లో (యు.ఎల్.బి.లలో), 4,371 సంస్థలను బహిరంగ మలవిసర్జన రహిత సంస్థలుగా (ఒ.డి.ఎఫ్. రహితంగా) ప్రకటిస్తూ యోగ్యతా పత్రాలను మంజూరు చేశారు. పశ్చిమ బెంగాల్.లోని పురూలియా పట్టణ పాలక సంస్థను మాత్రమే ఒ.డి.ఎఫ్. రహిత సంస్థల జాబితానుంచి మినహాయించారు.
2015 జూన్ నెల 25న 500 నగరాల్లో అమృత్ పథకం అమలును ప్రారంభించారు. 2011వ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం లక్ష,. అంతకు మించిన జనాభా కలిగిన అన్ని పట్టణ స్థానిక పరిపాలనా సంస్థల పరిధిలోనూ మురుగునీటి పారుదల వ్యవస్థ, డ్రయినేజీ సౌకర్యాన్ని కల్పించి, సార్వత్రిక మంచినీటి సరఫరాను ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం. అలాగే, అన్ని రాజధాని నగరాలకు, వారసత్వ నగరాల అభివృద్ధి పథకం (హృదయ్) వర్తించే నగరాలకు, ప్రధాన నదుల చెంతన ఉండే నగరాలకు, పర్వత ప్రాంతపు రాష్ట్రాలకు, దీవులకు, పర్యాటక స్థలాలకు ఈ పథకాన్ని వర్తింపజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా, అమృత్ 2వ దశ పథకం కింద 500 నగరాలకు సార్వత్రిక ప్రాతిపదిన మురుగునీటి నిర్వహణ, సెప్టేజీ సదుపాయాన్ని వర్తింపజేయనున్నారు.
లక్షమందికంటే తక్కువ జనాభా ఉండి, అమృత్ పథకం వర్తించని నగరాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ, డ్రైనేజీ నిర్వహణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం వంటి కార్యక్రమాలను ఎస్.బి.ఎం.-యు 2వ దశకింద చేపడతారు.
పారిశుద్ధ్య కల్పన రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి, ఏదైనా రాష్ట్రంలో ఎస్.బి.ఎం.-యు. పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే రూపొందిస్తుంది. కాగా, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎస్.బి.ఎం.-యు పథకం కింద కేంద్రం తన వాటాను విడుదల చేసింది. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, వ్యక్తిగత, సామూహిక, ప్రజా మరుగు దొడ్ల నిర్మాణం, ఘనవ్యర్థాల నిర్వహణ, పట్టణ పరిపాలనా సంస్థల సామర్థ్యాల నిర్మాణం వంటి పనులు చేపడతారు. అలాగే, ఈ పథకంపై సమాచార అవగాహనా కార్యక్రమాన్ని, ప్రజా చైతన్య కార్యక్రమాన్ని కూడా చేపడతారు. అస్సాం రాష్ట్రంలో ఎస్.బి.ఎ.-యు. పథకం కింద చేపట్టిన కార్యక్రమాల ఆర్థిక, భౌతిక ప్రగతి వివరాలు అనుబంధం-IIలో పొందుపరచబడ్డాయి.
నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ఎస్.బి.ఎం.-యు పథకం కింద చెత్త రహిత నగరాల స్థాయిని నిర్దేశించేందుకు స్టార్ రేటింగ్ పద్ధతిని 2018 జనవరిలో ప్రారంభంచారు. నగరాలకు చెత్త రహిత స్థాయి నిర్దేశించే యంత్రాగాన్ని సంస్థాగతం చేసేందుకు, మరింత పరిశుభ్రతను పాటించేలా నగరాలను, పట్టణాలను ప్రోత్సహించేందుకు ఈ పద్ధతిని ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సి.ఆర్.), న్యూఢిల్లీ పురపాలక మండలి (ఎన్.డి.ఎం.సి.)లకు 2019వ సంవత్సరానికి గాను త్రీ స్టార్ (3 స్టార్) రేటింగ్ లభించింది. చెత్తరహితంగా నగరాన్ని తీర్చిదిద్దే పనుల్లో 2021లో ఫైవ్ స్టార్ (5స్టార్) రేటింగ్ లభించింది. గతంలో ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డుకు 2020వ సంవత్సరానికి చెత్త రహిత కేటగిరీలో వన్ స్టార్ (1స్టార్) లభించింది.
అమృత్ పథకం కింద ప్రతి ఇంటికీ నీటి సరఫరా ఏర్పాటుకోసం చర్యలు తీసుకున్నారు. రూ. 42,206కోట్ల రూపాయల విలువైన 1,345 నీటి సరఫరా ప్రాజెక్టులను చేపట్టారు. వాటిలో రూ. 41,847కోట్ల విలువైన 1,326 ప్రాజెక్టుల పని ఇప్పటికే మొదలైంది. అందరికీ పైపుల ద్వారా మంచినీటి సరఫరా పథకం కింద 139లక్షల నీటి కుళాయిలను ఏర్పాటు చేయడం లక్యం కాగా, ఇప్పటి వరకూ 114లక్షల కొత్త నీటి కనెక్షన్లు అందించారు.
దేశరాజధాని ఢిల్లీ (ఎన్.సి.ఆర్.) ప్రాంతంలోని 4 పట్టణ పరిపాలనా సంస్థల పరిధిలో ఇప్పటివరకూ రూ. 292కోట్ల విలువైన 10 నీటి సరఫరా ప్రాజెక్టులను ప్రతిపాదించారు. న్యూఢిల్లీ నగరపాలక మండలి (ఎన్.డి.ఎం.సి.), తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఇ.డి.ఎం.సి.), ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (నార్త్ ఎం.డి.సి.), దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధుల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టారు. ప్రతిపాదిత పథకాల్లో రూ 262కోట్ల విలువైన 9 ప్రాజెక్టుల పని ఇప్పటికే మొదలైంది.
ఎస్.బి.ఎం.-యు 2వ దశ, అమృత్ పథకం 2వ దశకు సంబంధించిన నిర్వహణాపరమైన మార్గదర్శక సూత్రాలను ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కింది వెబ్ పోర్టల్స్ ద్వారా తెలియజేశారు.:
ఎస్.బి.ఎం.-యు. 2వ దశ :https://sbmurban.org/
అమృత్ 2వ దశ :https://mohua.gov.in/upload/uploadfiles/files/AMRUT-Operational-Guidelines.pdf
అనుబంధం-I
ఎస్.బి.ఎం.-యు రెండవ దశ పెట్టుబడి
అమలు వ్యయం అంచనా : రూ.1,41,600 కోట్లు.
భారత ప్రభుత్వం వాటా : రూ. 36,465 కోట్లు.
మిగిలిన వ్యయానికి నిధులందించే వారు
(ఎ). లబ్ధిదారుల వాటా వ్యక్తిగత చెల్లింపులు,
(బి). రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు/ పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలు
(సి). ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ప్రైవేటు రంగం వాటా.
(సంబంధిత రంగంనుంచి నిధుల సరఫరా అందుబాటులో లేనిచోట్ల, అవసరమైన నిధులను సంబంధిత రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం అందించవలసి ఉంటుంది.
మిగిలిన వ్యయం : వివిధ రకాల ఇతర వనరుల ద్వారా నిధుల సేకరణ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలనుంచి, బయటి సంస్థళనుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత, (సి.ఎస్.ఆర్.) కింద నిధుల సేకరణతో సహా.
అమృత్ 2వ దశ కేటాయింపు
2021-22నుంచి 2025-26వరకూ అమృత్ 2వ దశ కింద మొత్తం కేటాయింపు రూ. 2,77,000 కోట్లు (రూ. 76,760కోట్ల కేంద్రప్రభుత్వ వాటా నిధులతో సహా.. )
పథకంలోని వివిధ విభాగాల కింద కేంద్రప్రభుత్వ తరఫున బడ్జెట్ కేటాయింపు ఈ దిగువన సూచినట్టుగా ఉంది:
క్రమసంఖ్య
|
పథకం విభాగం
|
కేంద్రం కేటాయింపు (రూ. కోట్లలో)
|
1.
|
ప్రాజెక్టులు
|
66,750
|
2.
|
సంస్కరణలకు ప్రోత్సాహం (సి.ఎ. కేటాయింపులో 8శాతం)
|
5,340
|
3..
|
రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు పరిపాలనా వ్యయం, ఇతర వ్యయాలు (ప్రాజెక్ట్ సి.ఎ. కేటాయింపులో 3.25% శాతం)
|
2,169
|
4.
|
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిపాలనా వ్యయం, ఇతర ఖర్చులు (ప్రాజెక్టు సి.ఎ. కేటాయింపులో 1.75శాతం)
|
1,168
|
5.
|
టెక్నాలజీ వినియోగం (ప్రాజెక్టు సి.ఎ. కేటాయింపులో 1శాతం)
|
667
|
6.
|
సమాచార వ్యాప్తి, అవగాహనా కార్యకలాపాలు (ప్రాజెక్టు సి.ఎ కేటాయుంలో 1శాతం)
|
667
|
ప్రస్తుతం అమలులో ఉన్న అమృత్ ప్రాజెక్టులకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు కేంద్ర సహాయం ద్వారా నిధులను అందిస్తారు.
ఆ తేదీనాటికి ఏదైనా అమృత్ ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిన పక్షంలో, సదరు ప్రాజెక్టు పనులకు నిధులు విడుదల ఉండబోదు. అలాంటి పనులను తమ సొంత వనరులతో పూర్తి చేయడం సంబంధిత రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతపు బాధ్యత అవుతుంది.
అనుబంధం-II
స్వచ్ఛభారత్ మిషన్
ఎ. ఆర్థిక ప్రగతి: అస్సాం కోసం మొత్తం రూ. 244.30కోట్లను స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేటాయించగా, అస్సాం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.207.49 కోట్లను (84.93శాతాన్ని)తీసుకుంది.
బి. భౌతిక ప్రగతి:
(1). మరుగుదొడ్ల నిర్మాణం:
మరుగుదొడ్ల స్వభావం
|
లక్ష్యం
|
పూర్తయినవి
|
ప్రగతి శాతం
|
వ్యక్తిగత, ఇంటి మరుగు దొడ్లు
|
75,720 యూనిట్లు
|
74,416 యూనిట్లు
|
(98.50%)
|
సామూహిక / ప్రజా మరుగుదొడ్లు
|
3,554 సీట్లు
|
3,350 సీట్లు
|
(92%)
|
(2). బహిరంగ మలవిసర్జన రహితం (ఒ.డి.ఎఫ్.) స్థాయి:
ఒ.డి.ఎఫ్. సర్టిఫికేషన్ రకం (రేటింగ్)
|
లక్ష్యం
|
యోగ్యతా పత్రాలు పొందిన పట్టణ పరిపానా సంస్థలు (యు.ఎల్.బి.లు)
|
ODF
|
96పట్టణ పరిపాలనా సంస్థలు
|
96
|
ODF+
|
27
|
ODF++
|
0
|
(3). ఘన వ్యర్ధాల నిర్వహణ :
కార్యక్రమం
|
లక్ష్యం
|
సాధించినది (ఎంత శాతం)
|
100శాతం ఇంటింటి సేకరణ
|
అన్ని (943) వార్డుల్లో
|
845 వార్డుల్లో (89.60శాతం)
|
100శాతం వ్యర్ధాల వర్గీకరణ
|
అన్ని (943) వార్డుల్లో
|
410 వార్డుల్లో (43.47శాతం)
|
శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ
|
రోజూ పోగయ్యే 1,021 టన్నుల వ్యర్థాల్లో వందశాతం
|
రోజూ 653 టన్నులు (పోగయ్యే వ్యర్థాల్లో 64శాతం)
|
ఈ సమాచారాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కుశాల్ కిశోర్ ఈ రోజు లోక్ సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
****
(Release ID: 1777365)