గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టుకు 1,289 కోట్లు కేటాయింపు

Posted On: 02 DEC 2021 4:45PM by PIB Hyderabad

సెంట్రల్ విస్టా  అభివృద్ధి/పునరాభివృద్ధి  మాస్టర్ ప్లాన్ కింద ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి.

 సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్/రీ-డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్ కిందకేవలం 4 ప్రాజెక్ట్‌లు. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంసెంట్రల్ విస్టా అవెన్యూ యొక్క పునరాభివృద్ధికామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు 1,2, 3 నిర్మాణం మరియు ఉప రాష్ట్రపతి నివాసం నిర్మాణం ప్రస్తుతం అమలు చేయబడుతున్నాయి. 

వివరాలు ఇలా ఉన్నాయి.

 

ప్రాజెక్ట్ పేరు

అంచనా వ్యయం

(రూ. కోట్లలో )

ఇప్పటివరకు వెచ్చించిన మొత్తం (రూ. కోట్లలో )

పూర్తి అయ్యే తేదీ  అంచనా

భౌతిక పురోగతి

కొత్త పార్లమెంట్ భవనం

971

340.58

అక్టోబర్ 2022

35%

సెంట్రల్ విస్టా అవెన్యూ  పునరాభివృద్ధి

608

190.76

డిసెంబర్ 2021

60%

ఉమ్మడి సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలు-1,2, 3

3,690

7.85

నవంబర్ 2023

వనరుల సమీకరణ జరుగుతోంది. నిర్మాణ సన్నాహాలు  మరియు సైట్ తయారీ పురోగతిలో ఉన్నాయి 

వైస్ ప్రెసిడెంట్ నివాసం

208.48

15

నవంబర్ 2022

వనరుల సమీకరణ జరుగుతోంది. నిర్మాణ సన్నాహాలు  మరియు సైట్ తయారీ పురోగతిలో ఉన్నాయి 

 

ప్రస్తుత  2021-22 ఆర్థిక సంవత్సరంలో లో సెంట్రల్ విస్టా అభివృద్ధి/పునర్-అభివృద్ధి పనుల కోసం 1,289 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది.  

 

కొత్త పార్లమెంట్ భవనం లేదా సెంట్రల్ విస్టా లోని ఇతర భవనాల నిర్మాణానికి నాణ్యతతో కూడిన ధర ఆధారిత బిడ్డింగ్ పద్ధతులు అవలంబించలేదు. సమగ్ర ఆర్కిటెక్చర్ మరియు సెంట్రల్ విస్టా అభివృద్ధి/పునరాభివృద్ధి  ఇంజనీరింగ్ ప్లానింగ్ కోసం సలహాదారులను నియమించడం  కోసం మాత్రమే క్వాలిటీ-కమ్-కాస్ట్ ఆధారిత బిడ్డింగ్  పద్ధతిని  అమలు చేయడం జరిగింది. 

 

సెంట్రల్ విస్టా లోపల బయట సాగుతున్న పనులు 10,000 మందికి పైగా నైపుణ్యం కలిగినసెమి-స్కిల్డ్ మరియు నైపుణ్యం లేని కార్మికులకు ప్రత్యక్ష జీవనోపాధి అవకాశాలను అందించాయి.  24.12 లక్షల కంటే ఎక్కువ పని దినాలను సృష్టించాయి. వీటితో పాటు  సిమెంట్స్టీల్ మరియు ఇతర నిర్మాణ సామగ్రి తయారీ,  రవాణా రంగాలలో కూడా గణనీయ సంఖ్యలో  ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ విస్టా అభివృద్ధి/పునర్-అభివృద్ధి  పనులు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకరిస్తాయి.  ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం సంకల్పాన్ని సాకారం చేయడంలో వీటి నిర్మాణం  సహాయపడుతుంది. ఎంపీ లాడ్స్  పథకంతో సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్/పునర్-అభివృద్ధి పనుల మధ్య ఎటువంటి  సంబంధం లేదు.2021  నవంబర్ 10 న జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం  2021-22 ఆర్థిక సంవత్సరం  మిగిలిన భాగం కోసం ఎంపీ లాడ్స్  పథకాన్ని  పునరుద్ధరించింది.  2022-23 నుంచి   2025-26 ఆర్థిక సంవత్సరం వరకు 17,417 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొనసాగించాలని నిర్ణయించింది. 

గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

****



(Release ID: 1777363) Visitor Counter : 105


Read this release in: English , Urdu