మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పోషణ్ అభియాన్ కింద పర్యవేక్షణ యంత్రాంగం
నాడు పోస్టు చేయడమైనది:
01 DEC 2021 5:04PM by PIB Hyderabad
ప్రాథమికంగా సిఫార్సు చేసిన ఆహారం - ఆర్.డి.ఏ. కీ, సగటున రోజువారీ తీసుకునే ఆహారం - ఏ.డి.ఐ. కీ మధ్య అంతరాన్ని తగ్గించడం కోసం, అంగన్‌వాడీ సేవల కింద ప్రాధమికంగా రూపొందించిన అనుబంధ పౌష్టికాహారాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల వ్యవస్థ ద్వారా, ఈ క్రింద పేర్కొన్న నిబంధనల ప్రకారం, సంవత్సరంలో 300 రోజులు, అంగన్‌వాడీ సేవల లబ్ధిదారులకు అందించడం జరుగుతోంది.
|
క్రమ సంఖ్య
|
విభాగాలు
|
ఆహార రకాలు
|
|
1.
|
పిల్లలు
(0-6 నెలలు)
|
చిన్నారులకు మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే అందించాలి.
|
|
2.
|
పిల్లలు
(6-36 నెలలు)
|
పిల్లలకు రుచికరమైన రూపంలో ఉండే ఇంటి రేషన్ తీసుకోవాలి. ఇది సూక్ష్మ-పోషక బలవర్ధకమైన ఆహారం మరియు / లేదా శక్తి సాంద్రత కలిగిన ఆహారం రూపంలో ఇవ్వవచ్చు.
|
|
3.
|
తీవ్రంగా పౌష్టికాహారం
అందుబాటులో లేని
పిల్లలు
(6-36 నెలలు)
|
పైన పేర్కొన్న అదే రకమైన ఆహారంతో పాటు, 800 కేలరీల శక్తి మరియు 20-25 గ్రాముల ప్రోటీన్లు కలిగిన అనుబంధ ఆహార పదార్థాలు.
|
| |
పిల్లలు
(3-6 సంవత్సరాలు)
|
పాలు / అరటిపండు / కాలానుగుణ పండ్లు మొదలైన ఆహార పదార్ధాల రూపంలో ఉదయం అల్పాహారం మరియు వేడిగా వండిన భోజనం.
|
|
5.
|
తీవ్రంగా పౌష్టికాహారం
అందుబాటులో లేని
పిల్లలు
(3-6 సంవత్సరాలు)
|
సూక్ష్మ-పోషక బలవర్ధకమైన ఆహారం మరియు / లేదా శక్తి సాంద్రత కలిగిన ఆహారం రూపంలో అదనపు 300 కేలరీల శక్తి మరియు 8-10 గ్రాముల ప్రోటీన్ అందజేయాలి.
|
|
6.
|
గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లులు
|
సూక్ష్మ-పోషక బలవర్ధకమైన ఆహారం మరియు / లేదా శక్తితో కూడిన ఆహారం రూపంలో ఇంటి రేషన్ తీసుకోవాలి.
|
ఈ పథకం సార్వత్రికమైనది, స్వీయ-ఎంపిక మరియు ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వం 2021 జనవరి 1వ తేదీన క్రమబద్ధీకరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలోని జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీల తో సహా తప్పనిసరిగా కాలానుగుణ పర్యవేక్షణను నిర్వహించాలి. అనుబంధ పౌష్టికాహారం (టి.హెచ్.ఆర్. మరియు హెచ్.సి.ఎం) నాణ్యతా పరీక్ష కోసం వీరు నమూనాలను స్వీకరిస్తారు. మొత్తం సరఫరా వ్యవస్థలో, ఆహార భద్రత, పరిశుభ్రత కోసం తగిన చర్యలు పాటిస్తున్నట్లు నిర్ధారించుకుంటారు. అదేవిధంగా అవసరమైన చోట దిద్దుబాటు చర్యలు కూడా చేపడతారు.
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(రిలీజ్ ఐడి: 1777193)
సందర్శకుల సూచీ సంఖ్య : : 155