సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

యాచ‌కుల కోసం పున‌రావాస ప‌థ‌కాలు

Posted On: 01 DEC 2021 4:43PM by PIB Hyderabad

యాచ‌క‌వృత్తిలో నిమ‌గ్న‌మైన వ్య‌క్తుల స‌మ‌గ్ర పున‌రావాసం అన్న ఉప‌ప‌థ‌కం స‌హా  స్మైల్ ( SMILE ) - అట్టడుగువ‌ర్గాలకు చెందిన వ్య‌క్తుల జీవ‌నోపాధి, త‌త్ప‌ర‌త‌కు మ‌ద్ద‌తు అనే ప‌థ‌కాన్ని సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ రూపొందించింది. ఈ ప‌థ‌కం భిక్షాట‌న‌లో నిమ‌గ్న‌మై ఉన్న వ్య‌క్తులకు ప‌లు సంక్షేమ చ‌ర్య‌లు స‌హా అనేక స‌మ‌గ్ర చ‌ర్య‌ల‌ను ఈ ప‌థ‌కంలో పొందుప‌రిచారు.  పున‌రావాసం, వైద్య సౌక‌ర్యాల ఏర్పాటు, కౌన్సిలింగ్‌, ప్రాథ‌మిక డాక్యుమెంటేష‌న్‌, విద్య‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ఆర్థిక స‌హ‌లగ్న‌ల‌పై ఈ ప‌థ‌కం విస్త్ర‌తంగా దృష్టి పెడుతోంది. 
ఈ స‌మాచారాన్ని బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు  సామాజిక న్యాయం& సాధికార‌త స‌హాయ మంత్రి ఎ. నారాయ‌ణ స్వామి లిఖితపూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో వెల్ల‌డించారు. 

***
 



(Release ID: 1777015) Visitor Counter : 103


Read this release in: English , Urdu