ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు
Posted On:
01 DEC 2021 1:05PM by PIB Hyderabad
జైపూర్‌లో ఆభరణాలు మరియు రంగు రత్నాల తయారీ, ఎగుమతిలో నిమగ్నమైన గ్రూపుపై ఆదాయపు పన్ను శాఖ 23.11.2021న సోదాలు మరియు స్వాధీన కార్యకలాపాలను చేపట్టింది. జైపూర్ నగరం మరియు చుట్టుపక్కన ఉన్న 50కి పైగా ప్రదేశాలలో ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో పాక్షిక విలువైన మరియు విలువైన రాళ్లను ఆఫ్రికన్ దేశాల నుండి దిగుమతి చేసుకున్నట్లు, జైపూర్‌లో ప్రాసెస్ చేస్తున్నట్లు కనుగొనబడింది. కత్తిరించిన మరియు పాలిష్ చేసిన విలువైన రంగు రాళ్ల దిగుబడి విలువను తక్కువ చేసి చూపబడింది. దీనిలో కొంత భాగాన్ని నగదు రూపంలో విక్రయించబడినట్టుగా కూడా గుర్తించడమైంది. దీనిని ఖాతాల పుస్తకాలలో నమోదు చేయలేదు. లెక్కల్లో చూపకుండానే ఆదాయాన్ని పొందడం జరిగింది. ఇలా లెక్కకు చూపని ఆదాయాన్ని ఫైనాన్స్ బ్రోకర్ ద్వారా నగదు రూపంలో రుణాలను అందించడం ద్వారా వడ్డీని సంపాదించినట్టుగా కూడా గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ బృందాలు అటువంటి నగదు రుణాల పంపిణీకి సంబంధించిన దస్తావేజులు మరియు డిజిటల్ సాక్ష్యాలను వాటిపై వచ్చిన వడ్డీని స్వాధీనం చేసుకుంది. ఈ లావాదేవీల స్వభావాన్ని ఫైనాన్స్ బ్రోకర్ అంగీకరించారు. ఇదే కాకుండా, లెక్కలు చూపని అమ్మకాలు మరియు కొనుగోళ్లు, స్టాక్‌లో వ్యత్యాసం, నిజమైన అన్‌సెక్యూర్డ్ రుణాలు, షేర్ అప్లికేషన్ డబ్బు మొదలైన వాటికి సంబంధించిన నేరారోపణకు సంబంధించిన ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి. దీనికి తోడు స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) నుండి పనిచేస్తున్న గ్రూప్ యొక్క సంస్థల నుండి పత్రాలు కనుగొనబడ్డాయి, ఈ యూనిట్ల నుండి వచ్చే ఆదాయం ఆదాయపు పన్ను చట్టం, 1961, 10ఏఏ సెక్షన్ కింద మినహాయింపుకు అర్హమైనది కనుక ఈ యూనిట్ల నుండి అధిక లాభాలను ప్రకటించడం కోసం వారు వివిధ అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారని గుర్తించడమైంది. ఈ సోదాల్లో సుమారు రూ.4 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు దాదాపు రూ. 9.00 కోట్ల మేర విలువైన ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు గ్రూప్‌లో రూ.500 కోట్ల కంటే విలువైన లెక్కకు చూపని ఆదాయాన్ని గుర్తించడం జరిగింది. ఇందులో మొత్తం రూ. 72 కోట్లను సంబంధిత ఆదాయాన్ని గ్రూపు సంస్థలు తమ వెల్లడించని ఆదాయంగా అంగీకరించాయి. తదుపరి విచారణ కొనసాగుతోంది.
***
(Release ID: 1777003)
Visitor Counter : 144