ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం ఆమోదం.

Posted On: 29 NOV 2021 6:23PM by PIB Hyderabad

 

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ జైరాం గడ్కరీతో కూడిన ప్రత్యామ్నాయ యంత్రాంగానికి  (AM) అధికారం  కల్పించింది; శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి; కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ జితేంద్ర సింగ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL)లో GoI యొక్క 100% ఈక్విటీ వాటా విక్రయానికి M/s నందల్ ఫైనాన్స్ మరియు లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క గరిష్ట ధర బిడ్‌ను ఆమోదించారు. )-వైజ్ఞానిక  పారిశ్రామిక పరిశోధన సంస్థ (DSIR) కింద ఉన్న  ఈ  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ  కొనుగోలు  వేలం ధర  రూ. 210,00,60000/- (రూ. రెండు వందల పది కోట్ల అరవై వేలు మాత్రమే).

27.10.2016లో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయ   ఆమోదంతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో సంస్థ  విక్రయం కోసం  20.06.2019 నాటికి  గడువు ప్రక్రియ పూర్తవ్వాలని నిర్ణయించారు.    ఫైనాన్షియల్ బిడ్‌ను ఆహ్వానిస్తూ 02.05.2019న అర్హతపొందిన  సంస్థాగత  కొనుగోలుదారులతో (QIBలు) 'ప్రతిపాదన కోసం అభ్యర్థన' పత్రంతో పాటు   ప్రత్యేక  పవర్ ఆఫ్ అటార్నీని భాగస్వామ్యం చేశారు.   అయినప్పటికీ వేలానికి ఏ సంస్థా  ఆసక్తి చూపలేదు
-
ఈ ప్రక్రియ 3 ఫిబ్రవరి 2020న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం (PIM) జారీతో ,ఆసక్తి-వ్యక్తీకరణల అభ్యర్థన (EOI)తో మళ్లీ ప్రారంభించారు . ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కారణంగా అభ్యర్థనల సమర్పణ చివరి తేదీ 15.7.2020 వరకు పొడిగించారు.

చివరి తేదీ (15.07.2020) నాటికి మూడు EOIలు అందాయి. బిడ్డర్‌లందరినీ సాంకేతిక సంస్థ (Technical agency) ఔత్సాహికుల జాబితా  చేసింది. 7.1.2021న ప్రత్యామ్నాయ యంత్రాంగం (AM) సవరించిన అమ్మకాలు, కొనుగోలు ఒప్పందం, సవరించిన  అభ్యర్థన ప్రతిపాదన (RFP)ని ఆమోదించింది. తదుపరి చర్య కోసం లావాదేవీల సలహాదారుకి సవరించిన అభ్యర్థన  జారీ చేయడానికి, అవసరమైతే దానిపై ఏవైనా స్పష్టీకరణలను జారీ చేయడానికి 'పెట్టుబడి మరియు ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య విభాగం' (DIPAM)కి అనుమతినిచ్చింది . 'అనుమతి ' పొందడం కోసం ప్రొఫార్మాతో పాటు ఫైనాన్షియల్ బిడ్‌ను ఉంచడం కోసం ఎంపిక చేసిన  బిడ్డర్‌లకు జారీ చేశారు.

ఎంపిక చేసినఅర్హతగల  బిడ్డర్‌లకు వర్చువల్ డేటా రూమ్ (VDR) యాక్సెస్ ఇవ్వబడింది, దీని ద్వారా సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  సమగ్ర సమాచారం బిడ్డర్‌లకు అందుతుంది. వారు లావాదేవీల లో భాగంగా చూపిస్తున్న  ఆస్తులు , సౌకర్యాలను తనిఖీ చేయడానికి అనుకూలతను ఈ విధంగా  కల్పించారు.   బిడ్డర్‌ల సందేహాల నివృత్తి చేశారు.. విధివిధానాల ప్రక్రియ  తర్వాత, సాంకేతిక సంస్థ ఆమోదించిన అభ్యర్థన ప్రతిపాదన, అమ్మకాలు,  కొనుగోలు ఒప్పందాన్ని సెక్యూరిటీ క్లియరెన్స్ ఫార్మాట్‌తో పాటు 17.2.2021న షార్ట్-లిస్ట్ చేసిన బిడ్డర్‌లకు 10 మార్చి 2021న సమర్పించడానికి చివరి తేదీగా ఖరారు చేసింది. తుది అమ్మకాలు,  కొనుగోలు ఒప్పందంలో  వివరణాత్మక నిబంధనలు ఉన్నాయి.  ప్రభుత్వ హామీల విడుదల, లావాదేవీల  షరతులు, సంబంధిత బాధ్యతలు బిడ్ సమర్పణకు ముందు  ముగిశాయి.

కోవిడ్  కారణంగా ఏర్పడిన అంతరాయాలవల్ల    బిడ్డర్‌ల అభ్యర్థన మేరకు ఫైనాన్షియల్ బిడ్‌ను సమర్పించే చివరి తేదీని  12 అక్టోబర్ 2021 వరకు పొడిగించారు . చివరి తేదీ నాటికి, నాన్-ఫైనాన్షియల్ బిడ్ డాక్యుమెంట్‌లతో పాటు రెండు సీల్డ్ బిడ్‌లు అందాయి. అర్హత కలిగిన రెండు సంస్థల నుండి  రహస్య బిడ్
 స్వీకరించిన తర్వాత  వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదించబడిన విధానానికి అనుగుణంగా, సంబంధిత పద్ధతుల ప్రకారం లావాదేవీల సలహాదారు సంస్థ  (TA) మరియు ఆస్తుల అంచనా సంస్థ  (AV) ద్వారా మదింపు ఆధారంగా రూ.194 కోట్ల 'రిజర్వ్ ధర' నిర్ణయించారు . రిజర్వ్ ధర స్థిరీకరణ తర్వాత, అప్పటికే స్వీకరించిన  సీల్డ్ ఫైనాన్షియల్ బిడ్‌లు బిడ్డర్ల సమక్షంలో తెరిచారు.  
ఏర్పాటు ప్రక్రియ వివరాలు:

(i)  బిడ్ కోసం నందల్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 210,00,60,000/- ప్రైస్ (రూ. రెండు వందల పది కోట్ల అరవై వేలు  )

(ii) రూ. 190,00,00,000/- (రూ. నూట తొంభై కోట్లు మాత్రమే) ధర బిడ్ కోసం JPM ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ.

M/s నందల్ ఫైనాన్స్ మరియు లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన రెండు  బిడ్‌లలో  ధర రిజర్వ్ ధర కంటే ఎక్కువగా ఉన్నట్లు గమనించారు.

మొత్తం  ప్రక్రియ పారదర్శక పద్ధతిలో, బిడ్డర్‌ల గోప్యతతో సహా , వివిధ మంత్రిత్వ శాఖల  అంతర్గత  బృందం (IMG), పెట్టుబడుల ఉపసంహరణపై   కార్యదర్శుల  ప్రధాన బృందం  (CDG)  బహుళ-ఎంపిక   వ్యవస్థ  ద్వారా నిర్వహించారు. ఆస్తుల మదింపుదారులు   మొత్తం ప్రక్రియ కు మద్దతు ఇచ్చారు.

తదుపరి దశలో అంగీకారపత్రాన్ని (LoI)ని జారీ చేసి, ఆపై షేర్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయాలి, దీని తర్వాత షరతులను విజయవంతమైన బిడ్డర్, కంపెనీ  ప్రభుత్వాన్ని సంతృప్తి పరచాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 లో లావాదేవీలు  పూర్తవుతాయని  భావిస్తున్నారు.


 

****


(Release ID: 1776511) Visitor Counter : 222


Read this release in: English , Marathi , Hindi