ఆర్థిక మంత్రిత్వ శాఖ

చిన్న, సన్నకారు రైతులు, షెడ్యూల్ తెగలు కులాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని(2018 నుండి 2021 వరకు) అధిగమించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

Posted On: 29 NOV 2021 5:47PM by PIB Hyderabad

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBలు) వ్యవసాయ రుణాలను, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు (SF/MF)సమాజంలోని బలహీన వర్గాలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరాద్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన ప్రాధాన్యతా రంగ రుణాలపై (పిఎస్‌ఎల్) సవరించిన మార్గదర్శకాల ప్రకారం, సర్దుబాటు చేసిన నెట్ బ్యాంక్ క్రెడిట్ (ఎఎన్‌బిసి)లో 18 శాతం లేదా ఆఫ్-బ్యాలెన్స్ షీట్ ఎక్స్‌పోజర్‌కు సమానమైన క్రెడిట్ ( CEOBE), ఏది ఎక్కువైతే అది వ్యవసాయానికి రుణాలు ఇవ్వడానికి నిర్దేశించారు, అందులో చిన్న, సన్నకారు రైతులకు (SMFలు) 9 శాతం లక్ష్యం. PSL మార్గదర్శకాలు బలహీన వర్గాలకు రుణాలు ఇవ్వడానికి ANBC లేదా CEOBE 15% లక్ష్యాన్ని నిర్దేశించాయి, ఇందులో చిన్న, సన్నకారు రైతులు SCలు/STలు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలను తెలియజేస్తూ,  2018-2019 నుండి 2020-21 సంవత్సరాలలో SMFలు & బలహీన వర్గాలకు రుణాలు అందించాలనే నిర్దేశిత లక్ష్యాన్ని RRBలు అధిగమించాయని మంత్రి తెలిపారు.
దిగువ పట్టికలో చూపిన విధంగా 



 

 

 

 

As on

RRBల బకాయి రుణాల ప్రకారం

 

చిన్న సన్నకారు రైతులు

బలహీన వర్గాలు

 

వాటా  (%)

 

మొత్తం

వాటా  (%)

31 మార్చి 2019 నాటికి’

2,80,755

1,26,958

45.2

1,58,627

56.5

31 మార్చి 2020 నాటికి’

2,98,214

1,43,103

48.0

1,78,659

59.9

31 మార్చి 2021 నాటికి’

3,34,171

1,56,106

46.7

1,94,315

58.1

 

SC/ST రైతులతో సహా వ్యవసాయ రంగానికి మరియు చిన్న, సన్నకారు రైతులకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల నుండి రుణ ప్రవాహాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో కలసి తీసుకున్న చర్యలను   మంత్రి పాయింట్ల వారీగా  పేర్కొన్నారు:


రిజర్వు బ్యాంకు జారీ చేసిన ప్రాధాన్య రంగ రుణాలపై  (PSL) ప్రధాన ఆదేశాలు వాణిజ్య బ్యాంకులకు వర్తించే 40% లక్ష్యం కాకుండా, ప్రాధాన్యతా రంగానికి రుణాలు ఇవ్వడానికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు 75%  లక్ష్యాన్ని నిర్దేశించింది.
 2020-21 మరియు 2023-24 మధ్య దశలవారీగా చిన్న, సన్నకారు రైతులకు అందే లక్ష్యాన్ని 8% నుండి 10%కి పెంచాలి.
భారత ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తుంది, దీని కింద స్వల్పకాలిక పంట రుణాలు రూ.3.00 లక్షల వరకు రైతులకు 7% తగ్గిన వడ్డీ రేటుతో అందీస్తారు. ఈ పథకం బ్యాంకులు తమ సొంత వనరులను వినియోగించుకోవడం కోసం సంవత్సరానికి 2% వడ్డీ రాయితీని అందిస్తుంది. అంతేకాకుండా, రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించడం కోసం రైతులకు అదనంగా 3% ప్రోత్సాహకం ఇస్తారు, తద్వారా వడ్డీ రేటు 4%కి తగ్గుతుంది.

 

రైతులకు జారీ చేయడానికి 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని ప్రవేశపెట్టారు. పంటల సాగు కోసం రైతులకు వారి స్వల్పకాలిక అప్పు అవసరాలు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు పెట్టుబడి  అవసరాలు ఇంకా  ఇతర అవసరాలు తీర్చడానికి రైతులకు అనువైన సరళీకృత విధానంలో ఒకే విండో కింద బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి  సకాలంలో క్రెడిట్ మద్దతును అందించడం ఈ పథకం లక్ష్యం.
 

ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్‌లో చిన్న మరియు సన్నకారు రైతుల కవరేజీని పెంచడానికి, ఆర్‌బిఐ పూచీకత్తు లేకుండా వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.1.6 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.
 

కిసాన్ క్రెడిట్ కార్డ్ నుండి పశుసంవర్ధక, మత్స్య రైతుల పెట్టుబడి  అవసరాలను తీర్చడానికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర బ్యాంకుల ద్వారా కొత్త పథకం ప్రవేశపెట్టారు. పశుసంవర్ధక, మత్స్య రైతులకు వడ్డీ రాయితీతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు విస్తరించారు.
 

చిన్న మరియు సన్నకారు రైతులు, వాటా-పంటలు మరియు వంటి వారు పొందే రూ.50,000 వరకు చిన్న రుణాలకు సంబంధించి 'బకాయిలు లేవు' సర్టిఫికేట్   సౌలభ్యం   అందించబడింది  బదులుగా, రుణగ్రహీత నుండి స్వీయ ప్రకటన సరిపోతుంది.
 

చిన్న, సన్నకారు, కౌలు రైతులు,  కౌలుదారులను  బ్యాంకులు ప్రమోట్ చేసే సంస్థాగత క్రెడిట్, జాయింట్ లయబిలిటీ గ్రూపుల (JLG) పరిధిలోకి తీసుకురావాలి.
 

NABARD స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణాల కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వారి వనరులను భర్తీ చేయడానికి రాయితీ వడ్డీ రేటుతో రీఫైనాన్స్‌ను విస్తరిస్తుంది. రీఫైనాన్స్ క్షేత్రస్థాయి క్రెడిట్‌ని పెంచుతుందని  వ్యవసాయంలో మూలధన నిర్మాణాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

2020-21లో, NABARD RRBలకు మొత్తం ₹44,975 కోట్ల రీఫైనాన్స్‌ను పంపిణీ చేసింది, ఇందులో దీర్ఘకాలిక రీఫైనాన్స్ ₹15,157 కోట్లు మరియు స్వల్పకాలిక రీఫైనాన్స్ ₹29,818 కోట్లు ఉన్నాయి

 

***



(Release ID: 1776509) Visitor Counter : 1608


Read this release in: English , Marathi