నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
హరిత ఇంధన భాగస్వామ్యం కోసం ఎంఒయుపై సంతకాలు చేసిన ఐఆర్ఇడిఎ- బివిఎఫ్‌సిఎల్
Posted On:
30 NOV 2021 2:41PM by PIB Hyderabad
పునరావృత ఇంధన ప్రాజెక్టులు, నిధుల సేకరణను అభివృద్ధి చేయడంలో సాంకేతిక- ఆర్థిక నైపుణ్యాలను అందించేందుకు భారత పునరావృత ఇంధన అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్ఇడిఎ) మంగళవారం బ్రహ్మపుత్ర వాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (బివిఎఫ్‌సిఎల్)తో అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ఈ రెండు కంపెనీలూ కూడా నూతన& పునరావృత ఇంధనం, రసాయినాలు& ఫర్టిలైజర్ల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలు.
అవగాహనా పత్రంపై ఏఐఆర్ఇడిఎ చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ప్రదీప్ కుమార్ దాస్, బివిఎఫ్‌సిఎల్ సిఎండి డాక్టర్ శిబప్రసాద్ మొహంతీ ఐఆర్ిడిఎ డైరెక్టర్ (టెక్నికల్) చింతన్ షా, ఐఆర్ఇడిఎ సిఎఫ్ఒ డాక్టర్ ఆర్. సి. శర్మ, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో సంతకాలు చేశారు.
ఈ అవగాహనా పత్రం ప్రకారం, బివిఎఫ్‌సిఎల్ పునరావృత ఇందన, హరిత ఉదజని, హరిత అమ్మోనియా, ఇంధన సామర్ధ్యం, పరిరక్షణ ప్రాజెక్టుల సాంకేతిక- ఆర్థిక అంశాలను శ్రద్ధతో చేపట్టనుంది. రానున్న ఐదేళ్ళకు పునరావృత ఇంధన ప్రాజెక్టులను సృష్టించేందుకు, పొందేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో బివిఎఫ్‌సిఎల్‌కు ఐఆర్ఇడిఎ తోడ్పడనుంది.
రసాయినాలు, ఎరువుల రంగంలో బివిఎఫ్‌సిఎల్ వంటి ఇతర కంపెనీలు కార్బన్ ఉద్గారాలను తగ్గించుకొని, పర్యావరణకు అనుకూలంగా ఉండేలా ఈ భాగస్వామ్యం స్ఫూర్తినిస్తుందని ఐఆర్ఇడిఎ విశ్వసిస్తోందని అవగాహన పత్రంపై సంతకాలు చేస్తున్న సమయంలో ఐఆర్ఇడిఎ సిఎండి అభిప్రాయపడ్డారు. హరిత ఇంధనం ద్వారా ఈశాన్య భారత అభివృద్ధిలో ఐఆర్ఇడిఎ కీలక పాత్రను పోషించేందుకు ఇది పురోగమన మార్గమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సిఒపి 26లో 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని చేసిన వాగ్దానానికి అనుగుణంగా భారత ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఎంఒయు తోడ్పడి దోహదం చేస్తుందని దాస్ నొక్కి చెప్పారు. ఇటీవల, నూతన & పునరావృత ఇంధన మంత్రిత్వ శాఖ జల విద్యుత్ సహా దేశంలో మొత్తం పునరావృత ఇంధన మొత్తం వ్యవస్థాపిత సామర్ధ్యం 150 గిగావాట్లు దాటిందని ప్రకటించింది. ఇందులో 19 గిగావాట్ల పునరావృత ఇంధన వ్యవస్థాపకతకు ఐఆర్ఇడిఎ తోడ్పడింది.
బివిఎఫ్‌సిఎల్‌తో చేసుకున్న ఎంఒయు ఈ ఏడాదిలోపల సంతకాలు చేసిన వాటిలో ఐదవది. ఇంతకు ముందు ఐఆర్ఇడిఎ - హరిత ఇంధన ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక నైపుణ్యాలను అందించేందుకు ఎస్‌జెవిఎన్, ఎన్‌హెచ్‌పిసి, టిఎఎన్‌జిఇడిసిఒ, ఎన్ఇఇపిసిఒలతో సంతకాలు చేసింది.
***
(Release ID: 1776484)
Visitor Counter : 167