నౌకారవాణా మంత్రిత్వ శాఖ

గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి

Posted On: 30 NOV 2021 3:35PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావనపాడు, మచిలీపట్నం,  రామాయపట్నంలను నాన్-మేజర్ పోర్టులుగా ల్యాండ్ లార్డ్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 కింద పేర్కొన్న దుగ్గిరాజుపట్నం ఓడరేవు అభివృద్ధికి బదులుగా రామాయపట్నం పోర్టు అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం కోరింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 20.02.2020న రామాయపట్నం ఓడరేవు పరిమితులను నాన్-మేజర్ పోర్ట్‌గా నోటిఫై చేసింది, ఇది సంబంధిత రాష్ట్ర మారిటైమ్ బోర్డులు/రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియ‌జేశారు.
                                                                       

*****(Release ID: 1776479) Visitor Counter : 152


Read this release in: English , Urdu