ఆర్థిక మంత్రిత్వ శాఖ

రూ. 1,48,069 కోట్ల డిపాజిట్ బ్యాలెన్స్‌తో 43.85 కోట్ల‌కు పెరిగిన పిఎంజెడివై ఖాతాలు

Posted On: 29 NOV 2021 5:49PM by PIB Hyderabad

బ్యాంకుల స‌మాచారం ప్ర‌కారం,  25.03.2020 నాటికి (కోవిడ్ -19 లాక్ డౌన్ ముందు)  ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న (పిఎంజెడివై)  రూ. 1,18,434 కోట్ల బాలెన్స్‌తో  38.33 కోట్ల ఖాతాలు ఉండ‌గా, 10.11.2021 (కోవిడ్‌-19 లాక్‌డౌన్ అనంత‌రం) నాటికి ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ ఖాతాలు రూ. 1,48,069 కోట్ల‌తో 43.85 కోట్లుగా ఉన్నాయి. సోమ‌వారం లోక్‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భ‌గ‌వ‌త్ కిసాన్‌రావ్ క‌రాద్ లిఖిత పూర్వ‌కంగా ఇచ్చిన‌ స‌మాధానంలో పేర్కొన్నారు. 
ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ, పిఎంజెడివై ఖాతాల‌తో స‌హా అన్ని సేవింగ్ బ్యాంక్ ఖాతాలపై బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్ర‌కారం డిపాజిట్ల‌పై వ‌డ్డీని పొందుతాయి.  క‌నుక‌, పిఎంజెడివై ల‌బ్ధిదారుల‌కు వారి డ‌బ్బుపై వ‌డ్డీప‌రంగా ద్ర‌వ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించేందుకు ప్ర‌భుత్వం ఏ ప‌థ‌కాన్ని రూపొందించ‌డానికి యోచించ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. 

***
 



(Release ID: 1776313) Visitor Counter : 138


Read this release in: Urdu , English , Tamil