పర్యటక మంత్రిత్వ శాఖ

మూడవ టూరిజం శాటిలైట్ అకౌంట్ (టి.ఎస్.ఏ) ప్రకారం, 2017-18, 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో దేశంలోని మొత్తం ఉపాధిలో దాదాపు 15 శాతంగా ఉన్న - పర్యాటక రంగం

Posted On: 29 NOV 2021 2:07PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు:

*     దేశంలోని మొత్తం ఉపాధిలో, పర్యాటక రంగం సుమారు 15 శాతం మేర ఉపాధి కల్పిస్తోంది : మూడవ టి.ఎస్.ఏ. 

*     పర్యాటక రంగం దాదాపు 228 మిలియన్ ఉద్యోగాలు (ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా) కల్పిస్తోంది. 

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తన స్వదేశీ దర్శన్ పథకం లో భాగంగా  గుర్తించిన ఇతివృత్తాల క్రింద, రెండు గ్రామీణ ఇతివృత్తాలతో సహా, 76 ప్రాజెక్టులను మంజూరు చేసింది. పర్యాటక రంగాన్ని గుర్తించడం, ప్రచారం చేయడంతో పాటు అభివృద్ధి చేయడం అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.

2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు మూడవ టూరిజం శాటిలైట్ అకౌంట్ (టి.ఎస్.ఏ) కు అనుగుణంగా రూపొందించిన అంచనా ప్రకారం,  దేశంలోని మొత్తం  ఉపాధిలో పర్యాటక రంగం కల్పించిన ఉపాధి వివరాలు ఈ క్రింది విధంగా ఉంది:

 

2017-18

2018-19

2019-20

ఉద్యోగాలలో వాటా 

14.78

14.78

15.34

ప్రత్యక్షంగా (%)

6.44

6.48

6.69

పరోక్షంగా (%)

8.34

8.39

8.65

పర్యాటకం కారణంగా ప్రత్యక్ష + పరోక్ష ఉద్యోగాలు 

(మిలియన్లలో)

72.69

75.85

79.86

 

గమనిక:  పైన పేర్కొన్న అంచనాలను నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ (ఎన్.ఏ.ఎస్) 2021, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్) 2018-19 లో పొందుపరచిన సమాచారాన్ని ఉపయోగించి సవరించడం జరిగింది. 

పర్యాటక మంత్రిత్వ శాఖ వెనుకబడిన ప్రాంతాలతో సహా వివిధ పర్యాటక గమ్యస్థానాల సమగ్రాభివృద్ధి కి కృషి చేస్తోంది.   పర్యాటక రంగం చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో - దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల లో ప్రచారం చేయడం;  పర్యాటక సంబంధిత కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయడం;  వాణిజ్య ప్రదర్శనలలో పాల్గొనడం, వెబినార్లు, టూర్ ఆపరేటర్లు, ఇతర భాగస్వాములకు మద్దతు కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. 

ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి ఈ సమాచారం ఇచ్చారు.

*****



(Release ID: 1776264) Visitor Counter : 107


Read this release in: English , Urdu