రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఫార్మాస్యూటికల్ సెక్టార్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం
–ఇప్పటి వరకు 55 మంది తయారీదారులకు లబ్ధి
Posted On:
26 NOV 2021 4:25PM by PIB Hyderabad
24.02.2021న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన “ఆత్మనిర్భర్ భారత్- భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి పది రంగాల్లో ఎగుమతులను మెరుగుపరచడానికి వ్యూహాలు” అనే వ్యూహంపై పీఎల్ఐ ఫార్మాస్యూటికల్స్ పథకం ఆధారపడి ఉంది. పరిశ్రమ సంబంధిత విభాగాలు నీతి ఆయోగ్‌తో సంప్రదింపుల తర్వాత ఫార్మాస్యూటికల్స్ విభాగం 01.06.2021న ఔషధ పరిశ్రమ నుండి దరఖాస్తులను ఆహ్వానించే పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ రంగంలో పెట్టుబడులను, ఉత్పత్తిని పెంచడం ద్వారా భారతదేశ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం, ఔషధ రంగంలో అధిక విలువ గల వస్తువులకు ఉత్పత్తి వైవిధ్యతకు దోహదం చేయడం ఈ పథకం లక్ష్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బాగా ఎదగగల సామర్థ్యం ఉన్న భారతదేశం నుండి ప్రపంచ విజేతలను సృష్టించడం తద్వారా ప్రపంచ విలువ గొలుసుల్లో చొచ్చుకుపోవడం పథకం తదుపరి లక్ష్యాలలో ఒకటి. ఈ పథకం ముందుగా నిర్వచించిన ఎంపిక పద్ధతుల ఆధారంగా ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్లు, ఇన్-విట్రో డయాగ్నొస్టిక్ మెడికల్ డివైజ్‌ల పెరుగుతున్న అమ్మకాలను బట్టి (ప్రాథమిక సంవత్సరంలో) ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. దరఖాస్తుదారు సాధించే పెట్టుబడులు, విక్రయాల సంఖ్య ఆధారంగా ప్రతి కంపెనీకి గరిష్టంగా 6 సంవత్సరాల పాటు ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ పథకం కింద మొత్తం రూ. 15,000 కోట్లును విలువైన రాయితీలను అందిస్తారు. సిడ్బీ ఈ పథకం కోసం ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఫార్మా కంపెనీల మధ్య న్యాయబద్ధమైన పోటీని పెంచడానికి, మరిన్ని కంపెనీలను పథకంలోకి తీసుకురావడానికి మూడు వేర్వేరు వర్గాలలో దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రపంచ ఉత్పాదక ఆదాయాలను బట్టి నిర్ధారించిన కంపెనీ పరిమాణం ఆధారంగా దరఖాస్తులను తీసుకున్నారు. ఈ పథకానికి పరిశ్రమ నుండి చాలా మంచి స్పందన లభించింది . 31.08.2021 చివరి తేదీ నాటికి మొత్తం 278 దరఖాస్తులు అందాయి, వీటి నుంచి గరిష్టంగా 55 మంది దరఖాస్తుదారులను ఎంపిక చేశారు. పీఎల్ఐ కింద కంపెనీలు దరఖాస్తు చేసుకున్న మూడు వేర్వేరు ఉత్పత్తి వర్గాలు ఈ పథకం కిందకు వస్తాయి. ఈ ఉత్పత్తులు భారతదేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ఆవిష్కరణలను, ఆర్ అండ్ డీని, ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నారు.
కేటగిరీ 1: బయోఫార్మాస్యూటికల్స్; కాంప్లెక్స్ జెనరిక్ మందులు; పేటెంట్ పొందిన మందులు లేదా పేటెంట్ గడువు ముగియబోతున్న మందులు; సెల్ ఆధారిత లేదా జన్యు చికిత్స మందులు; ఆర్ఫాన్ డ్రగ్స్; హెచ్పీఎంసీ, పులలన్, ఎంటెరిక్ మొదలైన ప్రత్యేక క్యాప్సూల్స్; కాంప్లెక్స్ ఎక్సిపియెంట్స్; ఫైటో-ఫార్మాస్యూటికల్స్.
కేటగిరీ 2: యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ / కీ స్టార్టింగ్ మెటీరియల్స్ / ఫార్మా ఇంటర్మీడియటరీస్ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు / కీ స్టార్టింగ్ మెటీరియల్స్ మినహా / శాఖ అమలు చేస్తున్న ఏపీఐలు/కేఎస్ఎంలు, డీఐల కోసం మునుపటి పీఎల్ఐ పథకం పరిధిలోకి వచ్చిన డ్రగ్ ఇంటర్మీడియట్‌లు)
కేటగిరీ (కేటగిరీ 1, కేటగిరీ 2 పరిధిలోకి రానివి): రీపర్పస్డ్ డ్రగ్స్; ఆటో ఇమ్యూన్ డ్రగ్స్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్, యాంటీ ఇన్ఫెక్టివ్ డ్రగ్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్, సైకోట్రోపిక్ డ్రగ్స్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్; ఇన్ విట్రో డయాగ్నస్టిక్ పరికరాలు; భారతదేశంలో తయారు చేయని ఇతర మందులు.
పథకం కార్యాచరణ మార్గదర్శకాలలో నిర్దేశించిన ర్యాంకింగ్ పద్దతి ఆధారంగా దరఖాస్తుల మూల్యాంకనం చేశారు. ప్రతి మూడు కేటగిరీలలోని దరఖాస్తుదారుల కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి ఆమోదించారు. ఎంపిక చేసిన 55 మంది దరఖాస్తుదారుల జాబితా ఒకటో అనుబంధం-లో ఉంది. గ్రూప్ ఏలో 11 మంది ఎంపికయిన దరఖాస్తుదారుల వివరాలు ఉన్నాయి. గ్రూప్ బీలో 9 మంది ఎంపికయ్యారు. గ్రూప్ సీలో 35 మంది దరఖాస్తుదారులు ఎంపికయ్యారు. వీరిలో 20 ఎంఎస్ఎంఈలు ఉన్నారు. నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ ఈ పథకం సాంకేతిక అంశాలకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌కు సహాయం చేస్తోంది. సిడ్బీ ఈ పథకం కోసం అనుసరించాల్సిన వ్యాపార ప్రక్రియల కోసం డిజిటల్ మెకానిజంను ఏర్పాటు చేసింది. పథకం పురోగతిని పరిశీలించడానికి బలమైన పర్యవేక్షణ విధానం కూడా అమలవుతుంది. ఈ ప్రకటనతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ద్వారా వచ్చే పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నారు. అనుకున్న మైలురాళ్లను చేరుకోవడమే ఈ పథకం లక్ష్యం. పీఎల్ఐ పథకం మార్గదర్శకాలు డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో https://pharmaceuticals.gov.in/schemesలో అందుబాటులో ఉన్నాయి. పథకం సూక్ష్మ వివరాలను ఉన్న సిడ్బీ పోర్టల్‌ను https://పీఎల్ఐ-pharma.udyamimitra.in/లో చూడవచ్చు.
***
(Release ID: 1776027)
Visitor Counter : 272